జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి—–“దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది “

        జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి
                 దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది .దిశా నిర్దేశం చేయ లేని ప్రధాని ,నిమ్మకు నీరెత్తి నట్లు మౌనమే నీ భాష వో చిన్ని మనసా అనుకుంటూ ,నీరో చక్ర వర్తి లా జేబుల్లో చేతులు పెట్టు కోని పాపం జపం చేసు కొంటు ,నీతిని చూడను మంచిని వినను  మాట్లాడను అని భీష్మించు కోని కూర్చొంటే ,అవినీతి చక్ర వర్తులు అందలం ఎక్కి సందడి చేస్తూ ,కలకలం సృస్తిస్తున్నా కిమిన్నాస్తి గా వున్న ఈ దేశం నిజం గా మునుగు తున్న పడవే .ఆ నాటి లోక నాయక జయ ప్రకాష్ నారాయణ్ ఏ స్ఫూర్తి తో దేశాన్ని మేలు కొలిపి జనతా ప్రభుత్వం ఎర్పరచాటానికి కారణమయారో అలాంటి పరిస్తి తే మన ముందుంది .పూజ్య అన్నా హజారే దేశ ప్రజల గుండె తలుపులు తట్టి జాగృతం చేస్తున్నారు .ఇక అది బధిర శంఖారావం కాకూడదు .సమయం వచ్చేశింది .జాతి జనులంతా సమైక్యం అవాలి .ఇక్కడ పార్టీ భేదాలు పక్కన పెట్టండి .అభిప్రాయ భేదాలు విడనాడండి .అన్ని పార్టీలు దాదాపు ఒకే వేదిక పైకి చేరటం ఒక శుభ సందర్భం .దీన్ని చారిత్రాత్మక సన్ని వేశం గా భావించండి .ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఆసన్న మయ్యాయి .దేశాన్ని మళ్ళీ ఆ చీకటి రోజుల్లో కి నేట్టకండి .అయితే కిం కర్తవ్యం ?
              దేశం లో ఇప్పుడు అవినీతికి ,ఆశ్రిత పక్ష పాతానికి దూరం గా ఉంటూ ,సమర్ధుడు గా పేరు పొంది  ,దార్శనికుని గా గణత కెక్కిన, వివాద రహితుడైన బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను  ప్రధాన మంత్రి ని చేయ టానికీ ,ఆయన నేతృత్వం లో ప్రజా స్వామ్య జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయ టానికి బి;జే.పీ .,వామ పక్షాలు , తెలుగు దేశం ఇతర ప్రజాస్వామ్య పార్టీలు అన్నా ది .ఏం .కే .,మొదలైన ప్రతి పఖాలన్ని ఏక తాటి పై నిలిచి ,ఆయనకు మద్దతు తెలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలి .ఆలశిస్తే కాలమ్ క్షమించదు .చరిత్ర సహించదు .నితీష్ కుమార్ నాకేమీ బంధువు కాదు ,ఆత్మీయుడు కాదు ,మచ్చ లేని నాయకుడు అనే నేను ఈ సూచన చేశా .అన్నా వెనక వుండి ఆ నాటి జయ ప్రకాష్ లా నైతికబలం   ఇస్తారు .ప్రభుత్వాన్ని నడపాల్సింది ఇలాంటి సమర్దులే .
          ఇక మన రాష్ట్రం లో” జగన్మాయ ”దృష్టాంతాలు ,వృత్తాంతాలు రోజూ paper లలో మీడియా లో చూసి కంగారు పడకండి .ఇదంతా ఒక సేన్సషణ్ .ఆ తర్వాత పవిత్ర జలం చల్లి అగ్ని పునీతుడిని చేసి పార్టీ పగ్గాలు అప్ప గిస్తారు .కనుక దీనికే చంకలు గుద్దు కో నక్కర్లేదు .ఆనాడు సుఖరాం ,రాంలాల్ ,చెన్నా రెడ్డి ,భజన్ లాల్ లను అక్కున చేర్చి నట్లే మళ్ళీ అతనికి అందలం అందిస్తారు .అతని శక్తి సామర్ధ్యాలు ,సామ్రాజ్య విస్తరణ తెలిసిన వారెవ్వరూ దూరం చేసు కో లేరు .ఇదో విష సంస్కృతి .మళ్ళీ ఆ గూటికి చేరాల్సిందే .చేర్చు కోవాల్సిందే .ఇది తాత్కాలిక ఎడబాటు .దీన్ని భూతద్దం లో చూడద్దు .దీన్ని తగిన వారెవరో చూసుకొంటారు
             మనం విశాల దృక్పధం తో ఆలోచిద్దాం .అన్న కు మద్దతు అంటే ఒట్టి మాటలు కాదు .సమర్ధమైన నీతి వంతమైన ,నిజమైన పరిపాలనను అందించటమే .వో నా దేశ ప్రజలారా ,రాజకీయ పార్టీ ప్రముఖు లారా రండి ,కలవండి ఏకం కండి .సమర్దవంత మైన జాతీయ ప్రాభుత్వాన్ని ఏర్పరచి భారత మాత కన్నీరు తుడవండి ,ప్రజల బాగోగులను పట్టించుకోండి .ఇక అలసత్వం వహిస్తే ప్రజా చైతన్యం ముందు మీరు తల వంచుకొని నిల బడాల్సి వస్తుంది జాగ్రత్త . ,
                                     గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -08 -11 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం. Bookmark the permalink.

1 Response to జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి—–“దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది “

  1. శేషు's avatar శేషు says:

    చూస్తుంటే అదే జరిగేది. NDA వాళ్ల మోడి ని అందరు ఒప్పుకోకపోతే నితీష్ అవటం చాల వరకు ఖాయం.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.