హాస్యపు – ఉండ్రాళ్ళు- హాస్యం – వినాయకచవితి శుభాకాంక్షలు

హాస్యం ఉండ్రాళ్ళు

              పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొంతూండగా మా బావ మరిది ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను అన్నాడు .సుధ  ఏమో కాని వ్యధ పంచిపెదతావేమోనని బాధ అన్నా .మూతి బిగించి వాడు అదే నీతో వున్న చిక్కు .బావమరిదిని కదా నన్ను ఎంకరేజ్ చెయ్యవ్ .ఎప్పుడూ ,నీ పేరు ,ప్రఖ్యాతులేనా మేమూ వున్నాం బాబూ .మమ్మల్నీ కనిపెట్టాలి అన్నాడు నిష్టూరం గా .సరేరా అసలు విషయం ఏమిటి అడిగాను .వాడు .ఇవాళ వినాయక చవితి కదా సాయంత్రం ఒక సాహితీ సభ జరుగు తోంది అందులో నన్నూ పాల్గొనమని కబురు చేశారు .నీకు వేరే ప్రోగ్రాం ఉందటగా .నీ బదులు నేనట .ఇంతకీ ఏమిటి ప్రోగ్రాం అన్నాను .హాస్యం వండి వడ్డించాలి  .మనకు ఎప్పుడు అలవాటు లేదాయే .నువ్వున్నావనే ధైర్యం తో ఒప్పుకొన్నాను బావా నీవే తప్ప ఇతహ్పరంబెరుగా ఆనాడు బేలగా ,పీలగా .సరేరా .నువ్వెంతవరకు prepare అయావు అని అడిగా .వెంటనే ఒక చిట్టా జేబులోంచి తీసి చేత్తో పట్టుకొన్నాడు .బావా -ఈ మధ్య కొన్ని కంపెనీలు యాద్డ్  కోసం రాయమనే పేపర్ ప్రకటన చూసి కొంత రాశా .పంపావా అని అడిగాను .పంపాను తిరుగుటపా   లో వచ్చేశాయిఅన్నాడు కూల్ గా .అర్ధమైంది వాడి పరిస్థితి రోట్లో తలపెట్టేశాగా ఇంక రోకటి పోట్లకు వెరవటం ఎందుకు ?.సరే చిట్టా విప్పమన్నాను .బావా నవ్వద్దు .ఎంకరేజ్ చెయ్యి బావా .మర్రి చెట్టుకింద మోకను చేస్తున్నావు నన్ను ఎదగానీకుండా అనిమల్లీ గగ్గ్గోలు .సరే కానిమ్మన్నాను
     పోటాష్ తయారు చేసే కంపనీ ki ఒక స్లోగన్ రాశా .విను అన్నాడు .ఒదులు అన్నా.”వాడండి మీ చేలకు పోటాష్ -లేకుంటే మీరు మటాష్ ”అని చదివాడు .నోర్ముయ్యి కామోష్ అన్నా భరించలేక .ఇంకోటి చూడు .అవతలి వాడి ప్రతిభ అంటే నీకు ఈర్ష బావా మొదట్నించీ .అని రెండోది చెప్పాడు ”వినాయక చవితికి ఉండ్రాళ్ళు -తింటే బిడ్డలను కంటారు గొద్రాళ్ళు ”అన్నాడు .రాళ్ళతో ఊడగోడ్తారు పళ్ళు అన్నాను .కొంచెం చిన్న బుచ్చుకొని మూడోది లంకించుకొన్నాడు .”పెరిగింది పెరిగింది అవినీతి –నీతి అతిగ్గా పెరిగితే వచ్చేదే అవినీతి ”అని చల్లగా వినిపించాడు ”.నీ మతి మండితే వచ్చేదే ఈ కపి నీతి ”అని అడ్డకట్ట వేశాను .సరే ఇంకోటి విడుస్తా విను అన్నాడు .నీకున్న సిగ్గు లజ్జా వదులు చాలు అదే పెద్ద హాష్యం అన్నా.వాడు ఊరుకోంటాడా ?
”అన్నా హజారే –అరె అరె -దేశం బేజారే-ఆయన మాట అంటే జీ హుజూరే –దేశానికి ఆయన ఒక కొత్త వజీరే ” అన్నాడు .కొంచెం దగ్గిరికి వచ్చావురా అన్నా .బావా నువ్వు అండ గా వుంటే చెలరేగుతాచూడు   అన్నాడు .అంత చెలగాటం వద్దు నాయనా అని సర్ది చెప్పా .”నాగం గురించి ఒకటి రాశా అన్నాడు సరే విడువు అన్నా ”అన్నా నాగం -నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆగం –నీతో కష్టం వేగటం -మీ ఆవిడ యెట్లా భరిస్తోందో నీ  ఆగడం ”పర్లేదు కానీ అని ఉత్చాహ పరిచాను .”అందరి మీదా కాలు దువ్వె కే.సి ఆర్.–కిక్కురు మనకుండా వున్నావేమిటి యార్ ”ఒరే దవడ పగలగోడతారు  take care  అని వారించాను .సరే .”ఉద్యోగుల సమ్మె మళ్ళీ వాయిదా –వాళ్ల కేమి పోయింది ఫాయిదా ”అన్నాడు అర్ధం ఏమిటీ అన్నాను .ఏదో ప్రాస కలిసింది కదానని వాయించా అన్నాడు .నిన్ను వాయించేస్తారు ఖాయలా పడతావు అన్నాను .”పాలైతే నువ్వు జైలు –ఎవడో ఇప్పించక పోడు  బెయిలు ”- వహ్వా వహ్వా అన్నా.వాడు యెగిరి గంతేశాడు .”పావలాకే పంట ఋణం –అదీ పండితే గా తీర్చేది ఋణం ”భేష్ అన్నాను ..మా వాడు రెచ్చిపోయాడు .”మన్యాన్ని ఒనికిస్తున్న డెంగ్యు –చెయ్యాలి దానితో పాపం కుంగ్ ఫ్యూ ”సెహబాష్ అన్నాను .”అవినీతి లో ఆఫీసర్ బీల –దొరికి పొతే అయాడు  బేల .”ఇంకా వుంది నీ కడుపు లోకక్కెయ్యి అన్నా ..”అవినీతి వర్గం పై వుమ్మీయ్యి అన్నాడొకడు –తీరా ఉమ్మేస్తే పడేది వాడి మీద కాదా అన్నాదిన్కోడు ” —
”తెలుగును ఉద్ధరించాలి మనం -అదీ సి.ఏం .తో ప్రారంభించాలి అదే మన ఖర్మం ”. దారిలో పడ్డాడు మా వాడు అని లోపల కొంత సంతోషం .బయటికి అంటే మరీ రెచ్చిపోతాడని వూరుకొన్నాను .”గణపతి విగ్రహాలకు వాడండి మట్టి –లేకుంటే పర్యావరణం  నోట్లో మట్టి ”అని చదివాడు .ఇంక ఆపక పొతే చంపేస్తాను కుట్టి కుట్టి .అని వాడి హాస్య ప్రయత్నానికి పెట్టించాను ఫుల్ స్టాప్ .పాపం బిక్క మొహం తో వెళ్లి పోయాడు వాడు కనీసం వెళ్తానని చెప్పకుండా వాళ్ల అక్కతో కూడా మాట్లాడకుండా .
రాత్రి లోకల్ chaannel లోమా బావ మరిది హాసపు ఉండ్రాల్లకు ప్రధమ బహుమతి వచ్చింది అని    విన్నాను .అంటే తెలుగు హాస్యం యెంతబాగా వృద్ధి చెందిందో నని   బాధ పడ్డాను .ఇది చదివి నవ్వు రాక పొతే తప్పూ నాది కాదు  –.నవ్వక పొతే తప్పు మీది  .
               శుభా కాంక్షలతో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -09 -11 .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

2 Responses to హాస్యపు – ఉండ్రాళ్ళు- హాస్యం – వినాయకచవితి శుభాకాంక్షలు

  1. Don's avatar Don says:

    good one !!

    Like

  2. kovila's avatar kovila says:

    baagundi maastaru.. bahu chakkaga vaddinchaaru..!!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.