విశ్వాత్మ లోకి విశ్వ నరుడు
నండూరి రామ మోహన రావు గారు ఇక లేరు అక్షర విశ్వ రూపం చూపిన దార్శనికులాయన .ఆయనకు ఖగోళం ,భౌతిక శాస్తాలు కరతలామలకం .పరిణామ క్రమాన్ని అధ్యనం చేసిన శాస్త్ర వేత్త .దానితో” నరావతారం ”రాసి మానవ ఆవిర్భావాన్ని ఆవిష్కించారు శాస్త్ర్రేయతను జోడించి .ప్రపంచ సాహిత్య మధనం చేసిన పండితుడు .తత్వ శాస్త్రాన్ని కూలంకషం గా ,పరీక్షించి ,బహుదేశ సిద్ధాంతాలను అవలోడనం చేసి ,సమగ్రమ్ గా ,”విశ్వ దర్శనం” రాశారు .ఆయన అన్ని ప్రక్రియలను సుసంపన్నం చేశారు .రాజకీయ వ్యంగ్య రచనలు చేసి ”సవ్య సాచి ”అని పించుకొన్నారు .అవి నాయకులకు కొరడాలైతే చదువరులకు దీపావళి మతాబులైనాయి .ప్రఖ్యాత ఈసబ్ కధలను ”కధా గేయ సుధానిధి ”గా రాశారు .బాపు బొమ్మలు వేస్తె ”మిత్రలాభం ,మిత్రభేదం ”రాసి అందరికి ఆనందాన్ని ,విజ్ఞానాని ,వినోదాన్ని పంచారు .అనువాదం లో అందే వేసిన చేయి రావు గారిది .మార్క్ ట్విన్ రచించిన Tom sawer ,huckle berrifin ”నవలను తెలుగు లో అద్భుతం గా అనువదించారు .అవి సీరియల్ గా వస్తున్నంతకాలం ఆత్రం గా ఎదురు చూసే వారు .అలాగే రాజు -పేద ,విచిత్ర వ్యక్తీ అనేవి కూడా ఆయన అనువాద రచనలే .ఆయన అనువాద శైలి చాలా ఆకట్టుకొనేది .ఒరిజినల్ పుస్తకమే చదువుతున్న ఫీలింగ్ కల్పించే వారు .సరళం గా ,సవ్యం గా సూటిగా సాగే రచన వారి ప్రత్యేకం .ఱొబెర్త్ళౌఇస్ stevenson రాసిన treasure island ను” కాంచన ద్వీపం” గా తెలుగు లోకి తెచ్చారు .అదీ సూపర్ హిట్ అయింది .అందుకేనేమో బాపు రమణలు కొంటెగా ”అనువాద హనుమంతు ”అని పిలిచే వారట .ఆయన బాల సాహిత్యమూ సృజించారు .హరి విల్లు ,బాల గేయాలు అందు లో ముఖ్య మైనవి .
ముళ్ళ పూడి వెంకట రమణ గారి భార్య రామ మోహన రావు గారి సోదరే .ఆయన కృష్ణా జిల్లా ఆరుగొలను గ్రామం లో జన్మించారు 1927 లో .ఇరవయి ఒకటి వయసు లోనే” విజ్ఞానం” అనే లిఖిత పత్రికకు సంపాదకులైనారు .ఆ తర్వాత పత్రికా రంగం లో దేదీప్య మానం గా వెలిగి పోయారు .ఆంద్ర పత్రిక లో ప్రవేశించి ,ఆ తర్వాత ఆంద్ర జ్యోతి కి సబ్ ఎడితరై సమాదకులుగా 1980 లో బాధ్యతలు చేబట్టారు .నార్ల తరువాత జ్యోతి బాధ్యతలు ఆయనే చేబట్టారు .సుమారు 34 సంవత్చారాలు దాని సంపాదకులు గా పనిచేసి ఎందరో రచయితలను ప్రోత్చాహించారు .కొత్త శీర్షికలను ప్రవేశ పెట్టారు .పత్రిక సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దే వారు .ఆయన సంపాదకీయాలు చాలా సూటిగా సరళం గా ఉండేవి .వాటిని ఒక సంపుటం గా తెచ్చారు .ఈ నాటి తరానికి అవి కరదీపికలే .అలాగే అనుపల్లవి ,వ్యాఖ్యావళి ,చిరంజీవులు పుస్తకాలను రచించారు .l ముళ్ళ పూడి వెంకట రమణ గారు గతించిన కొన్ని నెలలకే నండూరి రామ మోహన రావు గారుతమ ఎనభై నాల్గవ ఏట,పరమ పదించటం ఆ కుటుంబానికి తీరని వ్యదే .సాహితీ కుటుంబానికి తీరని లోటే .వారి ఆత్మ కు శాంతి కాగాలని కోరుకొందాం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -09 -11 .

