రెండు మంచి కవితలు
1 — శై ”శవ”గీతం —రచన —చల్లా మధుసూదన్ –9490638222
ఆకాశం కాలు జారి –నెలనీల్లోసుకొంది నీల్లోసుకొంది
అడవికి వంధ్యత్వం–సాగర గర్భం లో సంతాన సాఫల్య కేంద్రం
ఆకలికి ఒక ఆలింగనం -దాహానికి -గాఢ చుంబనం
కాలంతో మైధునం –అరక్షిత లైంగిక సంబంధం .
నిద్రలేమి స్వప్నాన్ని స్కలించింది –కాలానికి బిడ్డలు కావాలి –వేగంతో సహ జీవనం జీవిస్తోంది
యూజ్ అండ్ త్రో –శుక్రకణాలు -లేటెస్ట్ ట్యూబ్ లో –అండం ఫలదీకరణ
కండోం అడ్డు గోడలు –అన్వాన్తేడ్ వాంచలు దాటి –అండ నిర్ధారణ జరిగి –డిస్పోజబుల్ పిల్లల జననం .
తల్లి పాల వారోత్చావాలు –తెట్రాప్యాక్ లోముర్రుపాలు
చుక్కల మందు మాత్రల విందు
సన్ ఆఫ్ లేకుండా –కేరాఫ్ అడ్డ్రెస్ వెతుక్కుంటూ–కేర్ కేర్ మంటూ –చైల్డ్ కేర్ సెంటర్ కు
విదేశీ నిధులు –స్వచ్చంద విధులు –అనాధ శరణాలయాలకు –పాక్కొంటు వెళుతున్నారు .
సెక్స్ లోను బుక్స్ లోను –సగం సగం —కుటుంబ నియంత్రణ లో మాత్రం —సింహభాగం
అంగం వెనకాల –వో గర్భాశయం –పాపా(యి ) లతో నిండి –ప్రసవించేందుకు సిద్ధం గా వుంది
కత్తులు మరగ బెట్టండి –బల్లలు సిద్ధం చేయండి –మగాళ్ళకు —మ్రుగాళ్ళకు —వేసేక్టమి చేసెయ్యండి ..
-2-మరిచిపోయాను —–రచన –మరాతి మూలం –ఏ;ది .జోషి —అనువాదం –డాక్టర్ నలిమెల భాస్కర్ –9704374081
——————-
హాల్లోకి టి .వి వచ్చాక –నేను మాట్లాడ్డం మరిచి పోయాను —
ఇంటికి వాహనం తెచ్చాక –నేను నడవటమే మర్చిపోయాను —
జేబులోకి కాలిక్యులతోర్ వచ్చాక –ఎక్కాలన్నీ మర్చిపోయాను
తార్రోడ్డు వచ్చాక -మట్టి సుగంధం మర్చి పోయాను
కుహనాసంబంధాల్ని సంబాలించ లేక –ప్రేమానురాగాలు మరిచి పోయాను
ఫాస్ట్ ఫుడ్ ప్రపంచం లో –తృప్తిచెందతమూ మర్చిపోయాను
పాప్, రాక్ రణ గోనల్లో –సంగీత సరిగమలు మర్చి పోయాను
క్షణిక మైన ఎండమావుల వెంట పరుగు పెట్టి –ఒక మంచిపని వల్ల లభించే తృప్తిని మరిచి పోయాను
నాలుగు రాళ్ళు కూడబెట్టుకొనే ప్రయత్నం లో –తోటి వాళ్ళ స్ప్రుహనే మర్చిపోయాను
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచం లో –ప్రశాంతం గా వో క్షణం నిలవడం మర్చి పోయాను .
మనసు విప్పి హాయిగా నవ్వడం మర్చి పోయాను –నవ్వడం మరిచాక జీవించటం కూడా మర్చిపోయాను .
ఈ రేడు కవితలు ఈ రోజూ అంటే 10 -09 -11 ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురింపబడ్డాయి .నాకు నచ్చి మీకూ నచ్చుతాయని పంపుతున్నాను .మీ స్పందన తెలియ జేయటానికి కవుల సెల్ నేమ్బెర్లు కూడా ఇచ్చాను .మీ స్పందన వారిని ఉత్తేజితం చేస్తుందని భావిస్తూ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —10 -09 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

