వైల్దేరిసం (Wilderism )
Thornton Wilder గొప్ప అమెరికన్ నాటక రచయిత అని చేపాను కదా .ఇప్పుడు అతని మనోభావాలు తెలియ జేస్తాను .అవి అందరు తెలుసుకోవలసినవే ..రచయిత రాసే భాష అతను జీర్ణించుకున్న అనుభవం ద్వారా తనను గురించి తనకు తాను తెలియ జెప్పుకొంటాడు అంటాడు ఆయన .నాటక రంగం మీద ప్రతిక్షణం ”ఇప్పుడే ”అనిపిస్తుంది .భవిష్యత్తుకు ,భూతకాలానికి మధ్య పాత్రధారులు ఖడ్గ ధార (rajor edge )మీద నిలబడి ,అత్యంత అవసరమైన అంతరాత్మ ప్రబోధకం గా మాటలు పెదాలు దాటి అప్పటికపుడు ప్రయత్నా రహితం గా మాట్లాడుతారు .నవలా అంటే జరిగి పోయిన విషయం .చెప్పేవాడికి స్వయం గారద్దు పరచేదేమి లేక ఉండక విషయాన్ని దాచి మనకు అతని గొంతు వినిపించేట్లు చేస్తాడు .మళ్ళీ మళ్ళీ లేక్కలేసుకుంటూ జరిగి పోయిన సంఘటనలతో తాను ఎంచుకున్న సంఘటనలను జ్ఞాపకం చేసు కుంటాడు .ఇతను లెక్కించటానికి వీలు కాని ఇతరుల కంటే మనముందు నిలిచి తనకున్న పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తాడు అంటాడు వైల్దేర్
నాటక రంగం అన్ని కళల కంటే మహోన్నత మైనదని అతని భావన .మానవుడు తన లాంటి మరో మానవుని మనోభావాలను అప్పటికప్పుడు పంచుకొనే వీలున్న రంగం .రచయిత లందరికి ఏదో కొంత నీతిని బోధించాలని పిస్తుంది .అక్కడినుంచి ,యంత్రం కదలటం మొదలవుతుంది .ఇంకో రకం గా చెప్పాలంటే మనం గాస్ స్టవ్ మీద వండుకొన్న పదార్ధం ఆ గాస్ వాసనతో వుండదు .కాని మనం అందులే వేసిన దినుసుల లోని రుచే వస్తుంది .నాటకం చెప్పేదేమిటంటే -జీవితం జీవిస్తూ ,అందులోనే జీవితాన్ని తెలుసుకోవటం లా వుంటుంది .”మీరు ఎందుకు రాస్తున్నారు ?”అని వైల్దేర్ ను అడిగితే ”నేను ఎందుకు రాస్తున్నాను అంటే -నాపై నేను ప్రయోగం చేసుకుంటూ ,కొత్తపుస్తకాన్ని ఆవిష్కరించాతానికే ,అది చదివి నేను ఆనందించటానికి,లేకపోతే ఒక కొత్త నాటకం తో నన్ను నేను మరచిపోవటానికి,లేక తాదాత్మ్యం చెందటానికి”అన్నాడు ”మీరు చెప్పిన విషయాలన్నీ మీరు రాసిన పుస్తకాలు నేరవేర్చాయా ?”అని ప్రశ్నిస్తే ”లేదు ”అని ఖచ్చితం గా చెప్పాడు .
వైల్దేర్ అభిప్రాయం ప్రకారం రచయిత తప్పని సరిగా విమర్శకుడు అయివుండాలి ..ప్రతి వాక్యం శక్తివంతం గా తిరస్కరిమ్పబడే అస్తిపంజరమే నంటాడు .ప్రతి అంగీకారం సత్యం శక్తి ,సౌందర్యం మొదలైన వాటిని పాలించేదే .రచనావ్యాసంగం చాలాభాగం వదలివేయబడే వ్యూహాత్మక అంతశ్చేతనా విధానమే .విమర్శకుడు పందోమిదిభాగాలు నీళ్ళలోనే మునిగివుందే మంచుపర్వతమే (ఐస్ బెర్గ్ )అంటాడు నాటక కర్త వైల్దేర్ .ఎందుకు ,ఎలా రాశాడు అనే విషయం మీద రాసే వారిని W.B.yeats ”వసంతాన్ని మురికి చేయటం వంటిది ”అన్న మహాకవి బ్రౌనింగ్ వాక్యం తో హెచ్చరించినట్లు వైల్దేర్ చెప్పాడు చివరగా వైల్దేర్ ”ఆపిల్ పండుఎర్రబడిన చోట తొంగి చూడకు-చూస్తే మన స్వంత ఎడెన్ కాని నువ్వు కాని నేను కాని ఉండము ‘.అని హితవు చెప్తాడు
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -10 -11 .

