దార్సినికుడు మాల్ రక్స్ —2
1957 కేమాస్ కు నోబెల్ పురస్కారం ప్రకటిస్తే ”నోబెల్ బహుమతి మాల్ రక్స్ కు ఇచ్చి వుండాల్సింది ‘అని బాహాటం గానే ప్రకటించుకున్న నోబెల్ పిచ్చాడుమాల్ రక్స్ .1966 లో Grand and petit palace లో pikasso retrospect (సింహావలోకనం )నుమాల్ రాక్స్ అత్యద్భుతం గా నిర్వహించాడు .అయితేఅధికారుల అలసత్వం తో ఆ కార్యక్రమ ఆహ్వానం చిత్రకారుడు పికాసో కు అందలేదు .పికాసో కు ఎక్కడో మండి ”నేను చచ్చానను కున్నారా ?”అని మాల్ రక్స్ కు టెలిగ్రాం ఇచ్చాడు .మనవాడు ”నేనేమైనా మినిస్టర్ ను అనుకున్నావా ”అని గోల్మాల్ సమాధానం ఇచ్చాట్ట .చైనా అధ్యక్షుడు మావ్ సే టుంగ్ తన జీవిత చరిత్రను memoirs పేరుతో రాస్తే మనవాడు అంటి మేమోఇర్స్ (అపస్మ్రుతులు )రాశాడు .మాల్ రక్స్ కు భారతదేశం అంటే వల్లమాలిన గౌరవం ,అభిమానం .”అన్ని నాగారకతలు సమానమే ,కాని భారతీయ నాగరకత సమానమైన కొన్నిటికంటే ఇంకా ఎక్కువ (more equal )అని కితాబు ఇచ్చాడు .మనదేశామంటే విపరీతమైన వ్యామోహం కూడా వుండేది .నమ్మకం లేని మతపరమైన నమ్మకం వున్న వాడు (religious mind without faith ).”గాంధి మహాత్ముడు అడ్డుపడక పోతే ,ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్యోతిని ప్రసాదిస్తున్న భారత దేశం ,ఆసియా లోనే తిరుగు బాటు స్థానం గా చరిత్రలో మిగిలి వుండేది ”అనిమహోన్నతం గా భారతీయ సనాతన పరంపరను ,అహింసా మూర్తి ,గాంధీ మహాత్ముని విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆరాధనాభావం తో విశ్లేషించాడు .” భారతీయ ఆత్మను దర్శిస్తేనే భారతీయులు అర్ధమవుతారు ‘,వారి మేధోవిజ్ఞానం తెలుస్తుంది ”అని పరమాద్భుతం గా చెప్పాడు రక్స్ .
మాల్ రక్స్ కు భారతదేశం లో గొప్ప గణిత శాస్త్రజ్ఞులు ,వైద్యులు ఉన్నట్లు తెలియదు .మధుర మీనాక్షి దేవాలయం ను సందర్శించినపుడు డాక్టర్ రాజా రావు గైడు గా వ్యవహరించారు .”సూర్యుడు శిఖరాన్ని వెలిగించేది , శిల్ప కళా వైభవాన్ని చాటి చెప్పేది ఈ దేవాలయమేనా ?అని అడిగారు మాల్ రక్స్ ఆశ్చర్యం గా .దానికి రావు గారు ”మనిషి ఒక వస్తువు మీద దృష్టి పెడితే అది అతని లో కరిగి పోతుంది .ఇక్కడి గోపురం అంతరిక్షానికి చిహ్నం .ఆకాశం లోని సూర్యుడు క్రిందిభూమినిచల్లబరుస్తాడు .ఇక్కడి అసంగత విషయం( Absurd )ఏమిటంటే దానికి సమాధానం అనేది దొరకదు ”అని చెప్పారట .
1958 లో ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ మాల్ రక్స్ ను ఇంటర్వ్యూ చేశాడు .”మాల్ రక్స్ ఫ్రేజులు టపా కాయలు లాగాపేలుతాయి .అందులో భయంకర శబ్దాలు మెరుపులు కనిపిస్తాయి .అంతా అయాక మిగిలేది వట్టి నల్లటి పొగ మాత్రమే ”అని తేల్చాడు .కాశీ క్షేత్రం లో గంగానదిని చూసి ”ఈ గంగా జలం సగం నోరు తెరిచి చనిపోయిన వారి నోల్లల్లోకి చేరి పవిత్రం చేస్తాయి ”అన్నాడు .ఫ్రాన్సు దేశం లో భారత దేశ రాయబారి రామేశ్వర్ దయాళ్ -మాల్ రక్స్ ను చూడటానికి వస్తానని చెబితే మాల్ రక్స్ వచ్చేటప్పుడు పవిత్ర గంగాజలం ను తీసుకుని రమ్మని చెప్పాడట .అంతటి పవిత్రభావం ఆయనకు వుండేది గంగా నది పైన .ఆయన కోరినట్లే గంగాజలం తెప్పించి ,వెండి పాత్రలో పోసి తీసుకొని వెళ్లి అందించాడు దయాళ్ .
తాను లెక్కించదగిన రచయితనుఅని తానే దంకా బాజా ఇంచాడు మాల్ రక్స్ .1969 లో జార్జెస్ పామ్పిడో -దేగాల్లి ని వోడించి ఫ్రాన్సు అధ్యక్షుడు అయాడు . .రాజకీయం గా తెరమరుగైనాడు మాల్ రక్స్ .”రాయటం ఒక బలమైన మందు ”అంటాడు రక్స్ .”దీనిపై స్పందించిన డేగాల్లి ”మూటలో ఏముందో మరిచేట్లు చేస్తుంది .అది చాలా ముఖ్యం ”అని తిప్పి కొట్టాడు .తాను పికాసో అంత జీనియస్ అని స్వంత డబ్బా కొట్టుకోవటం పాపం అతని బలహీనత .”నాకు పాబ్లో ఎవరో తెలీదు .అతనొక ఏకాంత వాసి .కాని పికాసో అంటే బాగా తెలుసు ”అని అమాయకం గా అంటూ అసలు పికాసో కు అస్తిత్వం వుండటం ఆశ్చర్యకరం అని చెబుతూఅలాగే మాల్ రక్స్ జీవించివున్నాడుఅంటమ్ కూడా అంతే ఆశ్చర్యం అన్నాడు మాల్ రక్స్ .
తాగుడుకు పూర్తి బానిస అయినా అది మాల్రక్స్ బుద్ధి కుశలతను తగ్గించలేక పోయింది 71 వ ఏట తన తోటి వారు ,తాను అత్యధికం గా ప్రేమించిన వారు ప్రమాదాలలో మరణించినందుకు చాలా కలత చెండాడు .ఈ స్థితి లో ఇంకా బతికి వుండటం చావుతో సమానం అన్నాడు .అతని ఆర్ట్ పుస్తకాలు గొప్ప ఆల్బం లు గా ప్రసిద్ధి చెందాయి .”విషయం ఎంత ప్రాముఖ్యం పొందిందో ,చిత్రాలు అంతే ప్రాముఖ్యం పొందాయి కాలమ్ తో బాటు రచన ఎలా రూపాంతరం చెందుతుందో సోదాహరణం గా వివరించాడు .శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత ,ఆ రచన దేనికోసం ఉద్దేశింపబడి చేయబడిందో ,దాని నుంచి వేరై పవిత్రాక్రుతి దాలుస్తుంది అంటాడు .”ప్రతి సంస్కృతి విశ్వజనీనమై ,సత్యమై వుంటుంది .కళా కృత్యం ఆ కాలమ్ లో ఆవిర్భవించి అందులోనే జీవించి ,అది కళాత్మకం గా కాలాన్ని దాటి నిలిచి పోతుంది .
దాన్ని అర్ధం చేసుకోవా టానికి కావలసిన సమస్తమైన సమాధానాలు అందులోనే కనిపిస్తాయి .వెతికే ఓపిక వుండాలి సంస్కృతి కేవలం జ్ఞానమే కాదు అదొక గొప్ప ఆవిష్కరణ .మేధావి సత్యాన్నే గ్రహిస్తాడు .కళ లో అంతకు ముందు లేని భావాన్ని మేధావి అయిన రచయిత ,కళా కారుడు ఆవిష్కరిస్తాడు అతను చారిత్రాత్మక నాయకునితో సమానం .హీరో లకుగొప్ప శక్తి వుంటుంది .అది వారికి మాత్రమే చెందినది కాదు కలాక్రుతిలో సౌందర్యం ముఖ్య కారణం గా వుంటుంది .కళ అమరత్వానికి అవతార స్వరూపం అది అనంతత్వానికి ,తిరుగుబాటు కు ,విప్లవానికి ,మానవ జీవితం లో రోజూ అనుభవించే దాని తిరస్కారానికి ప్రతీక .మనం కాలాన్ని మోయటానికి జన్మిస్తునాం.దాని నుంచి తప్పించుకోవటానికి కాదు .”అని చాలా అనుభవ పూర్వకం గాఅనుభూతి కలిగిస్తాడు .ఇవి చాలా విలువైన మాటలు అతని విశ్లేషణ శక్తికి ఆనవాళ్ళు ..ఇవన్నీ ఆయన నిర్దుష్ట అభిప్రాయాలు .”నా జీవితమే ఒక నవల ”అని challenge చేసి చెప్పిన రచయిత ,చిత్రకారుడు ,వార్ హీరో ,రాజకీయ చతురుడు ,మంత్రిసత్తముడు ,మాటల మార్మికుడు ,మహత్తర ఆలోచంనాపరుడు ,మేధావి ,కళా సౌందర్య పిపాసి ,వ్యాఖ్యాత ఆండ్రీ . మాల్ రక్స్
అయిపొయింది
మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -10 -11

