నవ దీపావళి
నరకు లేక్కడో లేరు బాబూ
నీ నా మధ్యనే నక్కి వున్నారు
స్వార్ధం పెంచి ,దౌష్ట్యం నించి
విర్రవీగే వారంతా ఎవరనుకున్నావ్
బందులు చేయించే వాళ్ళు ,
స్కూళ్ళు మూయిన్చేవాళ్ళు
పసిపిల్లల్ని హత్యచేసే వాళ్ళు
ఆసిడ్ దాడితో జీవితాలతో
చెలగాటం ఆడే వాళ్ళు
అందరు నరకాసురులే
వీళ్ళను సంస్కారం అనే
మందుతో కూరి
కాల్చండి చిచ్చుబుడ్లు
కోపం గంధకం తో ,మార్పు
అనే రజను తో మతాబా కూరి
వెలిగించండి వెలుగు దివ్వెలు
చిటపట మనసులు కొరకొర చూపుల
సిసిన్ద్రీలతో కవ్వించే వారిని
క్షమాగుణంవెన్న ముద్దలు వెలిగించి
శాంతి కలిగించండి ,ఆనందం పంచండి
మనశ్శాంతి లేకుండా చేసే మానవ హంతకుల గుండెల్లో
ఔట్లు బాంబులు పెలేట్లు
మాటల తూటాలు పెల్చండి
.కాకరపువ్వత్తుల్లాంటి
కారుణ్య పు చిరు వేలుగులివ్వండి .
దుర్మార్గాన్ని ,హింసను
అవ్వాయిచువ్వాయిలు చేసి అంటించి
ఆకాశం లోకి వదలండి .
కాలి మసై పోతాయి
గుండె నిండు గా మంచి అనే
మతాబా వెలిగించండి
ఆ కాంతుల్లో జగతిని
వెలుగు వెల్లువతోనింపండి
ఈ దీపావళి నాడు శోకావలిని పోగొట్టి
జ్ఞాన జ్నోత్నావళి గా మార్చండి .
దీపావళి శుభా కాంక్షలతో
మీ— గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -10 -11 .

