శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలో అద్వైతా మృతం —3

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలో అద్వైతా మృతం  —3
                                                                           రామ రసాయనం
                     సదాశివ బ్రహ్మేన్డ్రుల కీర్తనలలో రామ రసాయనం లో మొదటి కీర్తన గురించి తెలుసు కున్నాం.ఇప్పుడు రెండో కీర్తన వివరిస్తాను
02 -పల్లవి –ప్రతి వారం వారం మానస -భజరే రఘు వీరం
      చరణం —కాలామ్బోధర కాంత శరీరం —-కౌశిక శుక శౌనక పరి వారం-||
                  కౌశల్యా దశరధ సుకుమారం –కలి కల్మష భయ గహన కుథారిం ||
                  పరమ హంస హ్రుత్పద్మ విహారం -ప్రతి హత దశముఖ బల విస్తారం ||
                  భావం ——నీల మేఘం వంటి శరీరపు రంగు కలవాడు ,శుకుడు శౌనకుడు,కౌశికుడు  (విశ్వా మిత్రుడు )అనే పరివారం కలవాడు ,కౌసల్యా దశరదుల  గారాబు పట్టి ,కలి చేత కల్మషం (మురికి )అయిన భయం అనే అరణ్యాన్ని చేదించే (నరికే )గొడ్డలి అయిన వాడు ,సదా పరమ హంసల హృదయ పద్మ విహారుడు ,రావణ ,బల దర్పాన్ని నాశనం చేసిన వాడు ,అయిన ఆ  రాఘవుడిని
భజించు అని మనసుకు సలహా ఇస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .
                      వారం వారం అంటే వారానికో సారి అని కాదు అర్ధం .ప్రతిక్షణం అంటే యెడ తెరిపి లేకుండా .”పరమహంస హ్రుత్పద్మ విహారం-ప్రతి హత దశముఖ బల విస్తారం ‘అనటం లో ఆనందానుభూతి  ఉంది . ,అధర్మం చేసిన వాడు పదిముఖాలున్న వాడైనా ,ఎంత మొనగాడైనా ధర్మం చేతి లో చని పోవాల్సిందే అని సూచన వుంది .రాముడు పరబ్రహ్మ స్వరూపుడే మాయామానుష విగ్రహ రూపం గా అవతరించాడు .యోగుల హృదయాలలో ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాడు .వాళ్ళు కూడా ఆయన దర్శనం తో పులకిస్తూనే వుంటారు .దశేన్ద్రియాలను అదుపు లో ఉంచుకున్న వాడు శ్రీ రామ చంద్రుడు .ఇంద్రియ వ్యామోహం తో చెలరేగిన వాడు రావణాసురుడు .అలాంటి ఇంద్రియ గర్వాన్ని బ్రహ్మాస్త్రం తో నాశనం చేసిన వాడు రాముడు .ఇంద్రియాలు అదుపు లో వుంటే మోక్షం అదుపు తప్పితే వినాశం .అనే గొప్ప సత్యాన్ని అనుకూల మైన పదాలను ఉపయోగించి భావ గర్భితం గా రాశారు సదాశివులు .ఎక్కడా ఒక్క అనవసర పదం వుండదు .ప్రతి మాట లో జరిగిన కధను గుర్తు చేసే వైనం వారిది .
                     ఇప్పుడు రామ రసాయనం లో మూడవ కీర్తన
03 —         పల్లవి –చేతః శ్రీ రామం చిన్తయ జీమూత శ్యామం “”
              చరణాలు —-01 -అంగీకృత తుంబురు సంగీతం — హనుమద్ గవయ గవాక్ష సమేతం ||
                               02 -నవరత్న స్థాపిత కోటీరం —-నవ తులసీ దళ కల్పిత హారం .
                               03 -పరమ హంస హృద్గోపుర దీపం —చరణ దళిత ముని తరుణీ శాపం ||
                 భావం —-మేఘశ్యామల దేహం కలవాడు ,తుమ్బురునిసంగీతానందాన్ని పొందిన వాడు ,హనుమ ,గవయ గావాక్షులతో నిత్యం సంచరించే వాడు ,నవరత్నాలు పొదిగిన జటాజూటం (కోటీరం )వున్న వాడు ,తులసి మాలలచే శోభించే వాడు ,పరమ హంసల హృదయ దీపం అయిన వాడు ,పాద స్పర్శ చేత అహల్యకు శాప విమోచనం చేసిన వాడు అయిన శ్రీ రాముని ధ్యానించమని మనసుకు బోధ చేస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .”నవ రత్న స్థాపిత కోటీరం ,–నవ తులసీదల కల్పిత హారం ,”–”పరమ హంస హృద్గోపుర దీపం –చరన దళిత ముని తరుణీ శాపం ‘పదాలను అర్ధవంతం గా అవుచిత్యం గా ,పొదుపుగా వాడి బంధం సడలకుండా నిండుదనం చేకూర్చే నేర్పు ప్రతి పాదం లో ప్రస్ఫుటం గా కన్పిస్తుంది .హనుమ ఎంతటి భక్తుడైనా ,daggari వాడైనా ,నారద ,తుంబురుల సంగీతా జ్ఞాన పరీక్షలో తుమ్బురుని సంగీతమే గొప్పదని నిష్కర్ష గా చెప్పాడు శ్రీ రాముడు .సామర్ధ్యమే ముఖ్యం కాని స్వామి భక్తి మాత్రమే కాదని చెప్పే సంఘటన ఇది .అయినా హనుమతో సదా విహరిస్తూనే ఉంటాడు రాముడు .ఆయనా శ్రీ రాముని అనుసరించే ఉంటాడు .ధర్మమేరిగిన మహానుభావులు వారిద్దరూ అని మరో సారి గుర్తు చేస్తున్నారు సదాషేన్ద్రులు .
                    రామ రసం లో నాల్గవ కీర్తన సౌభాగ్యాన్ని దర్శిద్దాం
04 —-పల్లవి –పిబరే రామ – రసం,రసనే –పిబరే రామ రసం ||
          చరణాలు —౦౧-దూరీకృత పాతక సంసర్గం —పూరిత నానావిధ ఫల వర్గం ||
                         02 -జనన మరణ భయ శోక విదూరం–సకల శాస్త్ర నిగమాగమ సారం ||
                          03 -పరిపాలిత సరసిజ గర్భాండం —పరమ పవిత్రీకృత పాషండం ||
                          04 -వ్శుద్ధ పరమ హంస ఆశ్రమ గీతం -శుక శౌనక కౌశిక ముఖ పీతం |\
          భావం —-రుచిని గ్రహించే నాలుక కు రామ రసాయన పానం రుచిని ఎరుక పరుస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .”పాపాల పొత్తును నాశనం చేసేది ,కర్మ ఫలాలను దూరం చేసేది ,జనన ,మరణ భయం పోగొట్టేది ,శాస్త్ర నిగమ ,ఆగమాల సరం అయినది ,బ్రహ్మాండాన్ని రక్షించి కాపాడేది ,పరమ నాస్తికులను కూడా పవిత్రం చేసేది పరమహంసలైన యోగుల ఆశ్రమాలలో అణు నిత్యం గానం చేయ బడేది ,శుక శౌనక ,కౌశిక మహర్షులచేత పానం చేయ బడే మధుర రసమే రామ నామం .నాలుకా  ! నువ్వు కూడా ఆస్వాదించి తరించు .’
                    విశేషాలు —ముఖ అంటే శుకుడు అని అర్ధం .వ్యాసుని కుమారుడే శుకుడు .పరమ వైరాగ్యం తో భాసించే వాడు .పుట్టుక  ,చావు వల్ల భయం ,శోకం కలుగు తాయి .పార్వతీ దేవి గురు స్థానం లోవుంది   బోధించినవి” నిగమాలు” .మహేశ్వరుడు గురువు గా బోధించినవి ఆగమాలు (శాస్త్రాలు).ఈ రెండింటినీ వేదాలు అనటం లోక రీతి .సరసిజ గర్భాండం అంటే హిరణ్య గర్భుడు -అంటే బ్రహ్మాన్డమే .పరమ పవిత్రీకృత పాషండం అన్నారు వాల్మీకి మహర్షిని .అంటే ఆటవికుడు గా వుండి  దేవునిపై ధ్యాసే లేకుండా  అనేక పాప కార్యాలు చేస్తున్నా ,ఉపదేశం పొందినా రామా అనటానికి బదులు తిరగేసి ”మారా ”అన్నఅజ్ఞాని ,వివేకం లేని వాడు .అలాంటి వాడిని ఉద్ధరించి మహర్షి వాల్మీకి గా మార్చిన దయాళువు శ్రీ రాముడు .అతని ఆంతర్యాన్ని గ్రహించి అనుగ్రహించాడు కాని ,అతని శబ్దోచ్చారణ చూసి కాదు అని భావం .జన్మతోనే తండ్రిని మించిన జ్ఞానం తో అవధూత అయిన వాడు శుక మహర్షి .కర్మ ద్వారా జ్ఞానం పొందిన వాడు శౌనకుడు .క్షత్రియత్వాన్ని వదిలి తీవ్ర తపస్సు తో బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మర్షి ఐన వాడు కౌశికుడైన విశ్వా మిత్రుడు .వీరంతా తర తమ భేదాలు లేకుండా రామ పరబ్రహ్మ నామామ్రుతాని కడుపారా గ్రోలారు .రామ రసాయనాన్ని ఆస్వాదించి ధన్యులయారు .మనమూ ,ఆ రామ రసాయనాన్ని జిహ్వాగ్రం తో రుచి చూస్తే ,పునరా వ్రుత్తి రహిత బ్రహ్మ పదమే లభిస్తుంది
                 రామ రసాయనం లో అయిదవాదీ  చివరిదీ అయిన కీర్తన  గురించి తెలుసు కుందాం
   05 –  పల్లవి —ఖేలతి మమ హృదయే రామ –ఖేలతి మమ హృదయే |
 చరణాలు —-01 –మోహ మహార్నవ తారక కారీ —రాగ ద్వేష ముఖాసుర మారీ |||\
                          02 -శాంతి విదేహ సుతా సహ చారీ  –దహరాయోధ్యా నగర విహారీ |||\
                          03 -పరమ హంస సామ్రోజ్యోద్ధారీ –సత్య జ్ఞానా నంద శరీరీ ||
                 భావం —సదాశివ బ్రహ్మేన్ద్రులు తన హృదయం లో ఆనంద తానడవం చేసే శ్రీ రామ పరబ్రహ్మాన్ని తనివి తీరా కీర్తిస్తున్నారు .”మొహం అనే సముద్రాన్ని దాటి రాగ ద్వేషాలు అనే రాక్షసులనుసంహరిం చే రాముడు –నా హృదయం లో హాయిగా ,చిదానందం గా ,ఆడుతున్నాడు .దేహభావం నశించటం వల్ల పుట్టిన పరమ శాంతి అనే సహచరిణి తో ,లోపల వుండే (దహర )అయోధ్యా నగరం లో శ్రీ రాముడు వున్నాడు .పరమ హంసలైన యోగుల ఆత్మ సామ్రాజ్య ఉద్ధరణ కోసం శ్రీ రాముడు సచ్చిదానంద రోపం లో ,నా హృదయం లో ఆడుతూ (ఖేలతి )వున్నాడు .
              విశేషాలు —-ఇదే ఆధ్యాత్మ రామాయణ అనుభూతి .ఆత్మా రాముణ్ణి తన హృదయం లో దర్శించుకునే పరమ ఉత్కృష్ట స్థితి .శ్ర్ర్ మద్రామాయణ  .కధ ఆధ్యాత్మిక మైన సాధన లో అనుభూతికి వస్తుంది .అని బ్రహ్మేన్ద్రులు తెలియ బరుస్తున్నారు .రాముడు రాముడు మాత్రమే కాదు రామ పరబ్రహ్మమనే భావన .మొదటి కీర్తన లో మనసుకు శ్రీ రామ తత్వాన్ని బోధించారు .మనసులో రామ ముద్ర వేశారు .ఆ ముద్ర స్థిరం గా నిలిచి పోవాలంటే అణు క్షణం రామ నామ స్మరణ చేయాల్సిందే నని రెండవ కీర్తన లో చెపారు .మనసు లో సదా శ్రీరాముని ధ్యానించి ,కాయన తత్వాన్ని ఆకళింపు చేసుకొని ,ఆరాధించమని మూడో దానిలో బోధించారు .నాల్గవ కీర్హన లో రామ రసాయనం కలి కల్మష నాశనం అని ,నిగమాగమ సారం అని ,అంతకు మించి ఇంకేమీ లేదని యోగుల హ్రుత్పద్మ నివాసి గా వుండి ,ఆనందాన్ని పంచె వాడు రాముడే నని తెలిపారు .అయిదవ కీర్తన లో –ఇవన్నీ ఆచరిస్తే -శ్రీ రాముడు మన హృదయం లోనే నిలిచి వుండి ,ఆనంద ఖేలనం చేసి తరింప జేస్తాడు .దేహభావం   నశించి ,పరమ ఉత్కృష్ట కాంతి భాసించి ,దహరా కాశం లో ఆత్మా రాముడు గా వెలుగు లీనుతూ ఆత్మను ఉద్ధరించి ,సచ్చిదానంద స్వరూపుడై ,ఆనందాన్ని అందిస్తూ ,తాను పొందుతూ రమిస్తూ ,, ,మోక్షాన్ని కల్గిస్తాడని సోపాన (మెట్లు) ప్రక్రియ గా తెలియ జేశారు సదా శివ బ్రహ్మేన్ద్రులు .అర్ధం కాక పోయినా ,ఆ శబ్ద మాధుర్యం ,నడక ,కూర్పు ,ధ్వని  ,రవళి ,దైహిక ,మానసిక ఆరోగ్యాన్ని ,ఆనందాన్ని అందాన్ని ఇచ్చి శ్రేయో దాయకం అవుతుంది .లలిత మైన పదాలు ,చెవులకు ఇంపైన మాటల ధ్వని ,మనోహర మైన శైలి భావ గాంభీర్యం ,తరచి చూస్తె లోతైన భావం సదాశివుల కీర్తన లలో నిండి వున్నాయి.వింటే చాలు పరమానందం ,పరమాద్భుతం .
                    ఇప్పటి దాకా రామ రసాయనం గ్రోలాం.ఇక క్రిష్ణామ్రుతం ను సేవిద్దాంవచ్చే భాగం నుండి .
                                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —17 -10 -11 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.