శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లో అద్వైతా మృతం ——6
క్రిష్ణామృతం
బ్రహ్మేన్ద్రులు శ్రీ కృష్ణుని ఉద్దేశించి రాసిన కీర్తన లలో ఆరవ దాన్ని గరించి ముచ్చటించు కుందాం
06 —-పల్లవి —-క్రీడతి వన మాలీ ,గొష్టే –క్రీడతి వనమాలీ ||
చరణాలు —01 —ప్రహ్లాద పరాశర పరిపాలీ –పవనాత్మజ జామ్బవదను కూలీ ||
02 -పద్మా కుఛ – పరిరంభన శాలీ —పాటు తరశాసిత మాలి సుమాలీ |
03 –పరమ హంస వర కుసుమ సుమాలీ — ప్రణవ పయోరుహ గర్భక పాలీ
భావం ——తోట మాలి అయిన శ్రీ కృష్ణుడు గోశాలలో ఆడుతున్నాడు .ప్రహ్లాద ,పరాశారులను పాలించే వాడు ,ఆంజనేయ ,జాంబ వంతులకు అణు కూలుడు ,శ్రీ లక్క్ష్మి వక్ష స్థలం లో విహరించే వాడు ,మహా బల వంతు లైన మాలి ,సుమాలీ అనే రాక్షసులను సంహరించిన వాడు ,పరమ హంసల చేత కూర్చినఅందమైన పూల హారం కాంత సీమ లో వున్న వాడు ,ఓంకారం అనే తామర పుష్పానికి విత్త నాన్ని కాపాడే వాడు , అయిన్క వన మాలి గోవుల కొష్టం (శాల )లో ఆనందం గా క్రీడిస్తున్నాడు ఆయన్ను భజించి తరించమని చెబుతున్నారు .,
విశేషం —–వనమాలీ అనేది చక్కటి పదం .వనం అంటే కోరిక అనే అర్ధం వుంది కొష్టం అంటే గోవుల శాల .గోవు అంటే ఇంద్రియాలు అనే అర్ధం వుంది .కోరికల మాల ధరించి ,ఇంద్రియ విషయాలతో పరిగెత్తే జీవుడు కూడా దేవుడే .ఆ రూపం లో వున్న భగ వంతుడే పరిగెత్తు తున్నాడని భావం .ప్రహ్లాద ,పరాశారులు అనటం లోను లోతు వుంది .ప్ర్కహ్లాదుదు మహాభక్తుడు .పరాశరుడు జ్ఞాని .సాకార ,నిరాకారా లతో ఇద్దరినీ పాలించేది ఒకే భ్క్యగా వంతుడు అని నిగూఢ రహశ్యం .పద్మ అనేది సంపద కు చిహ్నం .ప్రాపంచిక ,పార మార్ధిక సంపద అంతా లక్ష్మీదేవియే ..ఈ సంపదను అంతా కాపాడేది భగ వంతుడే .
రావణాసురుని తల్లికి తండ్రి సుమాలీ .వాడి తమ్ముడు మాలి .మాల్య వంతుడు అనే ఇంకో తమ్ముడు వున్నాడు .ఈ ముగ్గురు లంకలో ఉంటూ ,స్వర్గం మీదికి దండెత్తితే శ్రీ మహా విష్ణువు వాళ్ళతో యుద్ధం చేశాడు .వాళ్ళు తట్టు కో లేక పారి పోయారు .లంకలో తల దాచుకున్నారు .మాల్య వంతుడు చచ్చాడు యుద్ధం లో .మిగిలిన ఇద్దరూ పాతాళం లోకి పారి పోయి దాక్కున్నారు .ఇంత కధను వాళ్ళిద్దరి పేర్లు చెప్పటం తో బయట పెట్టారు సదా శివులు .ఇదివరకటి కీర్తన లో ”ప్రణవ పయోధర ”అని రాస్తే ,ఈ కీర్తన లో ”ప్రణవ పయోరుహ ”అన్నారు .ప్రణవం తామర పువ్వు లాంటిది .ప్రపంచ రూపం గా వికశిస్తుంది .మళ్ళీ బీజ రూపం లోకి మూసుకు పోతుంది .బీజ (విత్తనం )రూపం లో ప్రపంచం అవ్యక్త మైన పుదు ,దాన్ని రక్షించి వుండేదీ పరమేశ్వరుడే .అందుకే ”ప్రణవ పయోరుహ గర్భక ,పాలీ ”అన్నారు .శివేంద్ర యోగి .గర్భక అంటే విత్తనాన్ని ,పాలి అంటే రక్షించే వాడు అని అర్ధం ”.కపాలి ”అని కలిపి చదవ కూడదు .గర్భక ,పాలి అని చద వాలి విత్తనం . లో సర్వ వృక్షం దాగి వున్నట్లు చిన్న మాట లో విశ్వ మంత భావాన్ని ఇమిడ్చిన మహా కవి శేఖరులు ,పరమ హంస శ్రీ బ్రహ్మేన్ద్రులు .ఇవి ఏదో బుద్ధి తో రాసినది కాదు .ఒక తన్మయా వస్థ లో ,సమాధి స్థితి లో రాసిన మహత్తర కీర్తనలు ఇవన్నీ .అందుకే అంత మధురం ,అంతటి లోతు .
ఏడవకీర్తన లోకి చేరు కుందాం .
07 —-పల్లవి ——మానస సంచరరే ,బ్రహ్మని –మానస సంచరరే ||
అను పల్లవి — – –మద శిఖి పించ అలంకృత చికురే —మహనీయ కపోల విజిత ముకురే ||
చరణం — శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే –సేవక జన మందిర మందారే ||
పరమ హంస ముఖ చంద్ర చకోరే —పరి పూరిత మురళీ రవ దారే ||
భావం —-ఇదీ మానస బోదె .చాలా బాగా ప్రాచుర్యం చెందిన కీర్తన .”శంకరాభరణం సినిమా లో ఈ కీర్తనను దర్శకుడు విశ్వ నాద్ అద్భతం గా ,రసాత్మకం గా ,అత్యంత ఆర్ద్రం గా చిత్రీకరించి షాహ బాష్ అని పించారు .ఆ సన్ని వేశం చూసి ఆనంద బాష్పాలు రాల్చని వారు లేరు
వో మనసా !పరబ్రహ్మం లో సదా సంచరించు .లక్ష్మీ కుఛ విహారి శ్రీమన్నారాయణుని లో సంచరించు .సేవించే భక్త జనులకు మందారం ఆయన .నెమలి పించం తో వున్న ముంగురులు వున్న వాడు ,.ఆయన నున్నని చెక్కిలి అద్దాలకంటే దీతైనది .పరమ హంస ముఖ చంద్ర కాంతిని ఆస్వాదించే చకోరం శ్రీ కృష్ణ పరమాత్మ .మురళి ని పూరించి నాద రసాన్ని ప్రవహింప జేస్తాడు .అలాంటి శ్రీ కృష్ణ పరబ్రహ్మం లో సదా సంచరించు అని మనసుకుని కోరారు
విశేషం —-భక్తులకు ఇల్లు భగవానుని లోగిళ్ళు .చంద్రుని కోసం చకోరాలు తపిస్తాయి .చంద్ర కాంతిని ఆస్వాదించి సంతృప్తి చెందు తాయి .అలాగే జ్ఞానుల జ్ఞానం లో పరమాత్మ సంతృప్తి చెందుతాడు .శ్రీ కృష్ణుని దివ్య రూపం కళ్ళ ముందు సక్షాత్కారించేట్లు చేసిన రచన .విన్తునా ,ఆ మూర్తిని ఊహించుకున్నా మనసు ఆనంద పులకాన్కితం అవుతుంది .పరబ్రహ్మ సామీప్యం లో వున్న అనుభూతి లభిస్తుంది .అదీ ఈ కీర్తన వైశిష్ట్యం
క్రిష్ణామృతం లో ఎనిమిదవది ,చివరిది అయిన కీర్తన లో కి ప్రవేశిద్దాం రండి
08 —–పల్లవి —-భజరే యమునాతీరా విహారం ||భజ మన యదుకుల నంద కిశోరం ||
చరణాలు —01 –పరమానందం పరబ్రహ్మ రూపం –పావన గాత్రం –పుణ్య చరిత్రం ||
02 —నంద కుమారం నవనీత చోరం —నారద వందిత నారాయణం |\
భావం —-యమునా తీర విహారీ రసమయ మూర్తీ ,శ్రీ కృష్ణ మూర్తిని భజించమని మానస బోధ ఈ కీర్తన .”పరమానంద స్వరూపుడు ,పరబ్రహ్మ స్వరూపుడు ,శ్రీ కృష్ణ పరమాత్మ .పవిత్ర శరీరుడు .నంద కిశోరుడు పుణ్య చరితుడు .నవనీత చోరుడు,నారదుని చే అను క్షణం కీర్తింప బడే వాడు ,నారాయణుడు .భక్తి తో భజించి తరించు .
విశేషం —–శ్రీ కృష్ణుడు యమునా తీరం లో సామాన్యులకు కని పించడు .శరీర మనో ,బుద్ధుల్ని అణచు కున్నప్పుడే అంటే సంయమనం చేసిన తర్వాతే భగ వంతుని దర్శనం లభిస్తుందనివూహ చేశారు బ్రహ్మేన్ద్రులు ..ఈ విధం గా శ్రీ కృష్ణ గుణ గానాన్ని ,మురళీ రవామ్రుతాన్ని ,శ్రీ కృష్ణ పరబ్రహ్మ దివ్య దర్శనాన్ని ,కర్ణామృతం గా శ్రీ కృష్ణుని లీలల్ని ప్రదర్శించి కీర్తనల్ తో రసానందాన్ని కలిగించిన మహా పరమ హంస సదాశివ బ్రహ్మేంద్ర యోగి వరేన్యులు .
ఇంతటి తో కర్ణామృతం సమాప్తం .తరువాత ”ఆత్మ బోధ”ను గురించి తెలుసు కుందాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -10 -11 .

