సాఫ్ట్ కార్నెర్ నియంతలు
ఈ మధ్యనే జనం చేతిలో ,అమెరికా వాళ్ల సాయం తో హత్య చేయ బడ్డ లిబియా అధ్యక్షుడు గడాఫీ కల్నల్ మాత్రమే కాదు ,ప్రజల యోగ క్షేమాలను పట్టించుకున్న వాడూ అని తెలుస్తోంది .అతను ఎంత సంపాదించుకుని దాచుకుని ,పిల్లా లిద్దరికీ పంచి ,దోచ్కోన్నాడని అందరు చెప్పుకుంటున్నారు .అయితే ఆ దేశం లోని ప్రజలపై అతడు చూపిన శ్రద్ధా ,వాళ్ల సంఖేమానికి తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే నియంతల్లో ను మంచి వాళ్ళు అంటే సాఫ్ట్ కార్నెర్ వున్న వాళ్ళు వున్నట్లు తెలుస్తోంది ”కన్యాశుల్కం లో చెప్పినట్లు ”బ్రాహ్మల్లోను ,మంచి వాళ్ళుంటారు ”అన్నది రుజువు అవుతోంది .ఇంతకీ ఈ సుత్తి అంతా ఎందుకు అసలు విషయానికి రాకుండా అంటారా .వచ్చే ముందు ఒక చిన్న మాట .మన పంచ కట్టు పెద్దాయనా పావలాలు జనం మీదికి విసిరి కోట్లు ఎరుకున్నాడని ప్రతి పక్షాల ఆరోపణ -అయితేనేం ,జలయజ్ఞం ,రాజీవ్ ఇందిరా సంతర్పణలు బాగానే చేశాడు కదా అని ఆ యన వత్తాసు దార్ల ఎదురు సమాధానం .
గద్దాఫీ పాలన లో లిబియా దేశం అక్షరాశ్యతా శాతం 83 శాతం ట. అదీ యువకుల్లో అయితే 100 శాతం ట .ఆశ్చర్యం గా లేదా .మరి ఎక్కడైనా అలా ఉందా ?లేదనే దాప్పు చెప్ప వచ్చు .రెండోది లిబియా లో విద్యార్ధులు ఎంత వరకు చదువు కున్నా ,ఎన్నేళ్ళు చదువు కున్నా ప్రభుత్వామీ ఆ ఖర్చు అంతా భరిస్తుంది ట .చదువు పూర్తి క్యినా తర్వాత మన దేశస్తులు లాగానో ఇతర దేశస్తులు లాగానో ,దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలకు ఒకారు గాక ఒక్కరు కూఫా వెళ్లారట.వారందరికీ అక్కడే ఉద్యోగాలు దొరుకు తాయట .ఇతర దేశాల్లో ఉద్యోగం చేసే లిబియా వాళ్ళు ఒక్కరు కూడా లేరంటే నమ్మ శక్యం గా లేదా ?ఇది ముమ్మాటికీ నిజం ..జబ్బుచేసి ఆస్పత్రికి వెళ్లి తే చేరిన్దగ్గర్నుంచి నయం అయి ఇంటికి తిరిగి వచ్చే దాకా ఖర్చు అంతా ప్రభుత్వమే భారిస్తుందట .ఒక వేలా లిబియా నయం కాని జబ్బు వుంటే ఏ దేశం వెళ్లి నయం చేసుకున్నా కూడా ప్రభుత్వమే మొత్తం ఖర్చు భారిస్తుందట .ఇక్కడ కుటుంబానికి నెలకు 2500 డాలర్లు ఇచ్చి కుటుంబ పోషణకు సాయ పడుతుందట .
లిబియన్ ప్రజలకు కరెంట్ బిల్లంటే ఏమిటో తెలీదట .అంటే కరెంట్ బిల్ కట్టే పని ప్రజలకు లేదు .అంతా ఉచిత విద్యుత్తే .తేవరైనా పెళ్లి చేసుకుని ,ఇల్లు కట్టు కోవాలను కుంటే ప్రభుత్వం వాళ్లకు 50000 డాలర్లు గిఫ్ట్ గా ఇస్తుందట .స్వంత కార్ కొనుక్కో వాలనుకుంటే సగం ఖర్చు ప్రభుత్వమే భారిస్తుందట .పెట్రోల్ 15 సెంట్లకే గాల్లోన్ లభిస్తుందట ..యువకులు వ్యవ సాయం చెయ్యాలను కుంటే భూమి ని ఉచితం గా ఇవ్వటమే కాదు ,వ్యవ సాయానికి కావాల్సిన విత్తాలు ,ఎరువులు ,యంత్రాలు అన్నీ ఉచితం గా అందిస్తుందట ప్రభుత్వం .అవసరం వచ్చి ఋణం తీసు కోవాలంటే నిముషాల మీద బాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయట .వడ్డీ అసలు ఉండనే వుండదట .లిబియా పెట్టు బదులు అమెరికా లో 100 బిలియన్లు ,ఇతర దేశాల్లో 50 బిలియన్ డాలర్లుట .ఇవన్నే చేయటానికి ,ఇంత ప్రజా సంక్షేమం ఆలోచించటానికి నియంత గడాఫీ కి ఎంత సాఫ్ట్ కార్నెర్ హృదయం వుందో ?అతను దాచుకున్న డబ్బు 200 బిలియన్ డాలర్లని అంచనా .అతని దగ్గర చచ్చే సమయానికి వున్న బంగారం 140 టన్ను లట . .కిలోలుకాదండోయ్ బాబు అక్షరాలా టన్నులు టన్నులు .కిలోలు మయితే ఇండియా లో మన వాళ్ళు చాలా మంది ఆ జాబితాలో చేరుతారు .ఇంత సంపాదించినా ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్ప లేదు .ఇంత ప్రజా సేవ చేసినా ,విదిలించింది చిటికెడు ,నొక్కేసింది గుప్పెడు అనుకున్నారు ప్రజలు .అందుకే అంత విప్లవం వచ్చింది .దీనికి వత్తాసు బయటి నుంచి లభించింది .అక్కడ అస్తిరత్వం ఏర్పడాలి .ఆయిల్ అంతా తమ చేతి కిందకు రావాలి .నెమ్మది గా ఉక్కు పాదం మోపాలి .అని” డేగ ”వ్యూహం . .ఇదేదో గడాఫీ ని నేను వెనకేసు కొచ్చి రాసిన మాటలు కావు .పేపర్ ,చానెళ్ళ వాళ్ళు చెప్పినవే
1162 లో పుట్టిన మంగోలియా దేశ నాయకుడు ”చెంఘిజ్ ఖాన్ ”ప్రపంచాన్ని గద గద లాడించి విశాల మంగోలియన్ సామ్రాజ్యాన్ని ఏర్పర చదువు .ఎదిరించే మొన గాదె లేకపోయాడు ఆ నాడు .అతని క్రూరత్వానికి రాజులు ,చక్ర వర్తులు పారిపోయి ఎక్కడో తల దాచు కున్నారు .ఇంత గోపా విజయం సాధించిన ఖాన్ గారికి అక్షరం ముక్క కూడా రాదు అంటే ముక్కున వేలు వేసుకో వాల్సిందే .చదువు కో లేక పోయినందుకు బాధ పది తన పిల్ల లకు చదువు బానే చెప్పించాదట .అతని మతం ”షామా ఇజం ”.వీళ్ళు ఆకాశాన్ని ఆరాదిస్తారట.అయితే చెంఘిజ్ ఏ మతాన్ని ద్వేషించ లేదట .
అన్ని మతాల వారు అతన్ని తమ మతం లో చేరమని ప్రార్దిన్చారట .దేని లోను చేరా లేదు .ఎంతో సంపదను దోచుకున్నా ,దేశానికి రాజా మందిరం కట్టు కోలేదట .తాను ఏ తెగ నుంచి వచ్చాడో ,ఆ తెగకు చెందిన గుడారం లో నే వుండే వాడట .పట్టణాలు ,నగరాలు అంటే ఇష్టం లేదు అతనికి .సామాన్యులు తినే తిండే తినే వాడు .విలాసాలకు ,ఆడంబరాలకు దూరం .అతని సామ్రాజ్యం లో దొంగ తనం మహా నేరం .అక్రమ సంబంధం వుంటే ఉరితీతే .నెలకు మూడు సార్లే మద్యం తాగే వాడు .అతడి సామ్రాజ్యం నల్ల సముద్రం నుండి పసఫిక్ సముద్రం వరకు విస్తరించిన ఘనుడు చెంఘిజ్ ఖాన్.అందర్నీ అణచి వేసినా పరమత సహనం అతని లోని సాఫ్ట్ కార్నెర్ .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -10 -11 .

