శ్రీ సదశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ——9
బ్రహ్మా నందం
శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో ఇప్పటి వరకు ”రామ రసం ”,”కృష్ణా మృతం ”ఆత్మ బోధ ”శీర్షికల లో వున్న కీర్తన లను గురించి తెలుసు కున్నాం .ఇప్పుడు ”బ్రహ్మా నందం ”లోకి చేరి అందులోని కీర్తన వైభవాలను అర్ధం చేసు కుందాం.
పల్లవి —– —నహిరే నహి శంకా చిత్ –నహిరే నహి శంకా ||
చరణాలు ———-01 –అజమక్షర మద్వైత మనంతం –ధ్యాయంతి బ్రహ్మ వరం శాంతం ||
02 —ఏ త్యజ్ఞాతి బహుకర పరితాపం –ఏ భజన్తి సత్చిత్చుఖ రూపం ||
03 —పరమ హంస గురు భనితం గీతం —ఏ పథంతి నిగమార్ధ సమేతం ||
భావం ——–”ఎవరు అనేక లౌకిక దుఖాలను వాది లేస్తారో ,సచ్చిదానంద రూపానీ సేవిద్తారో ,పరమ హంస గురువు లైన వారిచే స్తోత్రం చేయబడిన గీతాలను ,వేదార్దాల సాయం తో అధ్యయనం చేస్తారో ,వారంతా ,ఆది అంతం లేని ఏకమైన ,పరమ శాంత స్వరూపమైన బ్రహ్మాన్నే ధ్యానిస్తారు ,ఇందులో అనుమానం లేదు ,శంక కూడా లేదు ”
విశేషాలు —–స్థూల సూక్ష్మ శరీరాలను సాధన ద్వారా స్వాదీనక్మ్ చేసు కోవాలి .వాటి దుఖాలను వదిలి నప్పుడు ,వాటి లోని సత ,చిత్ ,సుఖం స్పష్టమవుతై .ఆ సుఖం పరమాత్మ స్వ రూపమే కాని వేరే కాదు .పరితాపాలు అనేవి శరీరం నుంచి ,మనసు నుంచి ,బయటికి తొంగి చూసి పొందేవి .ఇవి స్వతహాగా జీవుడికి వుండవు .మనసు వాటిని వదిలేస్తే ,మనసు అనేదే వుండదు .మనసుకు ఆధార మైన పరమ శాంతమైన బ్రహ్మమే దర్శనం అవుతుంది .మోక్షానికి కారణమైన ప్రతిదీ గురు కృప వల్లనే సాధ్యం .ఆ గురువు పరమ గురువు అయి వుండాలి .పరమ హంస లా వుండాలి .అప్పుడే తరుణోపాయం లభిస్తుంది .తాను పరమ హంస కనుక అందరు ,పరమ హంస స్థితి ని పొందాలని ప్రతి కీర్తన లోను ఎరుక గా తెలిపారు పరమ హంస అయిన సదాశివ బ్రహ్మేంద్ర యతీశ్వరులు .
రెండవ కీర్తన ——–
o2 —–పల్లవి —–ఖేలతి పిండాందే భగవాన్ –ఖేలతి పిండా న్డే ||
చరణాలు —01 —-హంసః సోహం హంస సోహం –హంస సోహం సోహమితి –పరమాత్మాహం పరిపూర్నోహం —బ్రహ్మివాహం బ్రహ్మేతి ||
02 –త్వక్చాక్షు శృతి జిహ్వ ఘ్రానే –పంచ విధ ప్రానోప స్థానే –శబ్ద స్పర్శ రసాదిక మాత్రే —సాత్విక రాజస తామస మిశ్రే ||
03 –బుద్ధి మనస్చిట్టా హన్కారే –భూజస తేజో గగన సమీరే –పరమ హంస రూపేన విహార్తా –బ్రహ్మ విష్ణు రుద్రాది క కర్తా ||
భావం ——–”శరీరం లోనే భగవంతుడు ఆడుతున్నాడు .హంసను నేనే .నేనే హంసను .పరమాత్మను .పరిపూర్ణ బ్రహ్మం నేనే .పంచేంద్రియ గోళాలలో ,పంచ ప్రాణ స్థానాలలో ,శబ్ద ,స్పర్శ తన్మాత్రలలో ,త్రిగుణాల కలయిక లో ,శరీరం లో క్రీడా ఖేలనం చేస్తున్నారు పరమాత్మ.నాలుగు అంతః కరనలలో ,పంచ భూతాలలో ,పరమ హంస లా విహరిస్తూ ,త్రిమూర్తుల సృష్టి కర్త గా శరీరం లో ఆడి ,పాడి ,రమిస్తున్నాడు ”
విశేషం —ప్రపంచం అనేది దేశ ,కాలాలో కదుల్తుంది .ఇది పరమాత్మ పరిపాలన వల్లనే సాధ్యం .ప్రపంచాన్ని చూసే పరికరాలు అన్నీ ఆయన స్వరూపాలే .వేరు కాదు .సృష్టి ,స్థితి ,లయలుజీవుని అనుభవాలే .వాటిని అనుభవానికి తెచ్చేదీ పరమాత్మ ఏ .
మూడవ కీర్తన లోకి చేరు కుందాం
03 —పల్లవి —-ఆనంద పూర్ణ బోదోహం—సతత మానంద పూర్ణ బోదోహం ||
చరణాలు —-01 —ప్రత్యగద్వైత సారోహం –సకల శ్రుత్యంత తలత్ర విదితోహం,అమ్రుతోహం ||
మత్యనంతర భావితోహం –విదిత నిత్య నిష్కల రూప నిర్గుణ పదోహం ||
02 —సాక్షి చిన్మాత్ర గాత్రోహం -పరమ మోక్ష సామ్రాజ్యాదిపోహం
పక్ష పాతాతి దూరోహం -అనవధిక సుఖ సాగరోహం ||
03 —స్వప్రకాశైక సారోహం –సదహమప్రపంచాత్మ భావోహం అభయోహం
చిదహమప్రమెయాఅఖ్య మూర్తి రేవాహం |\
భావం ——ఈ కీర్తన కూడా ఆత్మాను భూతి పొందిన ఒక సిద్ధ పురుషుని ఆనంద మయ ,చిన్మయ ,చిద్రూప అద్భుత వర్ణన .ప్రాపంచిక కొలతలకు పరిమానాలకు అందని ఉన్నతోన్నత ,ఉత్తమోత్తమ స్థితి అది .వేదం చదవక్కర లేదు .ఉపనిషత్తులు అధ్యనం చెయ్యక్కర లేదు ,శాస్త్రాల సారం పిండ నక్కర లేదు .ఈ కీర్తన చదివినా ,విన్నా ,అర్ధం చేసు కున్నా అంతా బ్రహ్మ జ్ఞానమే .హాయిగా సంగీతం తో మేళవించి ,అన్నీ రంగరించి అందించిన రస గుళిక .
నాక్ల్గవ కీర్తన లోకి చేరుకుందాం
04 —పల్లవి —-ఆనంద పూర్ణ బోదోహం –సచ్చిదానంద పూర్ణ బోదోహం ||
చరణాలు —-01 –సర్వాత్మ చరోహం –పరి నిర్వాన నిర్గుణ నిఖిలాత్మ కోహం —
గీర్వాణ వర్యానతోహం –కామ గర్వ నిర్వాపణ ధీరతోహం ||
02 –సత్య స్వరూప పరోహం –వర శ్రుత్యంత బోధిత సుఖ సాగరోహం
ప్రత్యగాభిన్న పరోహం –శుద్ధ మంతు రహిత మాయా తీతోహం |\
03 –అవబోధ రస సాగరోహం –వ్యోమ పవనాది పంచాభూతాతి దూరోహం
కవి వర సంసేవ్యోహం -ఘోర భవ సింధు తారక పరమసూక్ష్మొహం ||
04 –బాధిత గుణ కలనోహం –బుద్ధ శోదిత సమరస పరమాత్మాహం
సాధన జాతాతీతోహం –నిరుపాధిక నిస్శీమ భూమానందోహం ||
05 –నిరవయవోహం అజోహం –నిరుపమ మహిమని నిహిత మహితోహం
నిరవధి సత్త్వఘనోహం –ధీర పరమ శివేంద్ర శ్రీ గురు బోధి తోహం ||
భావం —–నేను ఎవర్ని ?అన్న దానికి సమాధానమే ఈ కీర్తన .”సచ్చిదానంద పూర్ణ చైతన్యాన్ని నేను .అందరి లోని ఆత్మ మూర్తిని నేను .మోక్ష స్వరూపుడైన నిర్గునున్ని .దేవతలు నన్ను అర్చిస్తారు .కామ గర్వాప హారిని .సత్య సుఖ స్వరూపుడిని .శాస్త్రాల చేత బోధింప బడిన వాడిని .భేదాలు లేని ప్రత్యక రూప మాయా తీతున్ని .జ్ఞానంద స్వరూపున్ని .పంచ భూతాలకు అతీతున్ని .రుషి గణ పూజితున్ని .ఘోర భవ సముద్రాన్ని దాటించే పరమాత్మను .గుణ క్రీడా లో ప్రబోధం చేత శుద్ధీ చేయబడిన సమ రస పరమాత్మను .సాధనాతీత మైన ,ఉపాధి పరిధికి అతీత మైన పరమానందాన్ని నేను .అవయవ రహితున్ని .పుట్టుక లేని వాడిని .నిరుపమ మహిమ లో నిలిచి న గొప్పదనాన్ని నేనే .నిరవధిక శుద్ధ సత్యాన్ని .శ్రీ గురు పరమ శివేంద్ర స్వామి చేత బోధితున్ని అయిన వాడిని నేనే ”
వేదాలలోనిరుక్కులు చదువుతున్న అనుభూతి లభిస్తుంది ఈ కీర్తనలో అంతా బ్రహ్మ మయమే .నేనే బ్రహ్మని”అహమాత్మా పరబ్రహ్మ ”సోహం ”బ్రహ్మ ఇవాహం ”అనే మహా వాక్య రహస్యాలన్నీ గుది గుచ్చి ,హాయిగా పాడుకుంటూ మనసారా అనుభవిస్తూ,ఆనంద పారవశ్యం కలిగించే రచన బ్రహ్మేన్ద్రులది .మాటల లో వర్ణించటం కష్టం .అనుభవించాలి తరించాలి ఆత్మాను భూతి పొందిన మహాత్ముని అనుభవమే ఈ కీర్తన .ఈ అనుభూతికి కారణమయిన శ్రీ గురువు పరమశివేంద్ర స్వామిని రెండో సారి స్మరించి సంప్రదాయాన్ని అవిచ్చిన్నం గా కాపాడారు శిష్యులైన సదా శివ బ్రహ్మేన్ద్రులు
ఇప్పటికి ”బ్రహ్మానందం ”పూర్తిగా అనుభవిన్చాము .
బ్రహ్మేన్డ్రుల కీర్తనల లో ఇరవై నాల్గవది ,చివరిది అయిన ది ”గంగా నది పైకీర్తన .ఆ పవిత్ర నదీమ తల్లి పావన తోయాన్ని తాగి మొక్షానందాన్ని పొందుదాం
24 —పల్లవి —–జయ తుంగ తరంగే గంగే –జయ తుంగ తరంగే ||
చరణాలు —01 –కమల భవాండ కరండ పవిత్రే —బహు విధ బంధచ్చేద లవిత్రే ||
02 –దూరీకృత జన పాప సమూహే –పూరిత కచ్చ స గుచ్చ గ్రాహే ||
03 –పరమ హంస గురు భణిత చరిత్రే –బ్రహ్మ విష్ణు శంకర నుతి పాత్రే ||
భావం ——-”ఉత్తుంగ తరంగ విరాజిత గంగా మాతా !నీకు జయం .బ్రహ్మాండాన్ని పవిత్రం చేస్తూ ,అనేక బంధనాలను విచ్చేదం చేస్తూ ,వుండే నీకు జయమగు గాక .ప్రజల పాపాలను ప్రక్షాళన చేస్తూ ,తాబెళ్ళను (కచ్ఛప ),మొసళ్ళను (గుచ్చ )నిండుగా కలిగిన వో నదీమ తల్లీ నీకు జయం .పరమ హంస పరివ్రాజక గురు పరంపర చేత కీర్తింప బడిన గంగా మాయీ నీకు జయం .త్రిమూర్తుల స్తుతికి పాత్రమైన పవిత్ర గంగా దేవీ !నీకు సర్వదా జయము ”
విశేషం —-భారతీయ సాహిత్యం లో గంగానదికి ప్రత్యెక స్థానం వుంది .ఆ నదీమ తల్లి త్రిపద గామి అంటే స్వర్గ మర్త్య ,పాతాళాలలో ప్రవహిస్తుంది .భూలోకాన్ని పవిత్రం చేయ టానికి దివి నుండి భువికి దిగిన భాగీరధి ఆమె .ఆమె పవిత్ర తీరాలలో నాగరకత విస్తరించింది .భూములను సస్య శ్యామలం చేసి ,బంగారు పంటలు పండించే అమృత జలాలను అందించే నదీ మాత .గంగా స్నానం పవిత్రం .మోక్ష ప్రదం .అంతటి శుద్ధ జలం ప్రపంచం లో లేనే లేదు .ఎన్నో పరీక్షలకు తట్టు కుంది .ఆమె తో సంబంధం లేకుండా రామాయణ ,భరత ,భాగవత కధ లేదు .ఆ పవిత్ర జలం స్వచ్చం ,పవిత్రం ,నిర్మలం .గంగా మాయి లేక పోతే భారతీయ లౌకిక ,ఆధ్యాత్మిక జీవనమే లేదని అందరి భావన .ఆ గంగా మాతను స్తుతిస్తూ అందుకే సదాశివ బ్రహ్మేన్ద్రులు జయ గానాన్ని వినిపించారు .ఆ జయం ఆమెకే కాదు లోకాలన్నిటికీ .ఇదీ ఉదాత్త భారతీయభావన .జయ మంగళం నిత్య శుభ మంగళం .
” శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ”అనే ఈ నవరత్నాల వ్యాసపరంపరకు ప్రేరణ ,పూర్తి ఆధారం ”స్వామిని శారదా ప్రియానంద ”గారు రచించిన గ్రంధం ”సంగీత వేదాంతం ”.ఆ స్వామినికి మనసులో సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ నా కృతజ్ఞతలను తెలుపు కుంటున్నాను .ఇందులోని విషయ వివరణ అంతా శారదా ప్రియానంద స్వామినిదే నని సవినయం గామనవి చేస్తున్నాను . నన్ను .ఎంతో ప్రభావితం చేసిన రచన ఇది .దీని ని మీకూ అందించాలనే తపన తో ఈ ప్రయత్నం చేశాను . సంపూర్ణం
నమస్తే
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -10 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్

