శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం —8 ఆత్మ బోధ

              శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం —8
                                                                       ఆత్మ బోధ
                          శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతామృతాం లో ఆత్మ బోధ లో నాల్గవ కీర్తన గురించి తెలుసు కుందాం
           04 —-పల్లవి —-సర్వం బ్రహ్మమయం   రే రే –సర్వం బ్రహ్మ మయం  ||
                                     చరణాలు —01 –    కిం వచనీయం ,కిమవచనీయం –కిం రచనీయం ,కిమరచనీయం ||
                                                     02 —కిం పథ నీయం కిమ పథనీయం , –కిం భజనీయం ,కిమభజ నీయం ||
                                                      03 —కిం బోద్ధవ్యం ,కిమబోద్ధవ్యం —కిం భోక్తవ్యం ,కిమభోక్తవ్యం   ||
                                                      04 —సర్వత్ర సదా హంస ధ్యానం –కర్తవ్యం–భో ముక్తి నిదానం ||
                   భావం ——” వోరీ  !సర్వము బ్రహ్మమే .ఇందు లో చెప్ప తగినది ,చెప్ప తగనిది ఏమీ లేదు .వ్రాయ తగినది ,వ్రాయ తగనిది లేదు .చదవ తగినది ,చదవ కూడనిది లేదు .సేవింప తగిన్దీ ,సేవింప రానిదీ అంటూ ఏమీ లేదు .నేర్వ వలసిందీ ,నేర్వ రానిదీ లేదు .తిన తగింది ,తిన రానిది అనే భేదమే లేదు .సర్వ వేళల ,సర్వావస్థలలో ,”హంస ”ధ్యానం చేయటమే మన కర్తవ్యం .అదే మోక్షానికి సరైన దారి ”
                     విశేషం —భో అంటే అయ్యా అని అర్ధం .ఈ ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపమే అయినపుడు దేనిని స్వీకరించాలి ,దేన్నీ వదిలేయాలి అన్న సమస్యే లేదు .”సర్వం ఖిల్విదం బ్రహ్మ ”
               ఆయిద వ కీర్తనకు దారి తీద్దాం
                o5 –పల్లవి —–బ్రహ్మై వాహం –  కిలసద్గురు కృపయా   —బ్ర్సహ్మైవాహం ||
                                       చరణాలు —-01 —బ్రహ్మై వాహం కిల ,గురు కృపయా–చిన్మయ బోధానంద ఘనం తత్ –శ్రుత్యంతైక నిరూపిత మతులం –సత్య సుఖామ్బుది సమరస మనఘం ||
                                                       02 —కర్మాకర్మ వికర్మ విదూరం –నిర్మల సంవి దఖండ మపారం –నిరవధి సత్తాస్పద పద మజరం –నిరుపమ మహిమనినిహిత మనీహం ||
                                                       03 –ఆశా పాశ వినాశన చతురం –కోశ పంచకాతీత మనంతం –కారణ కారణ మేక మనేకం —-కాలకాల కలి దోష విహీనం ||
                                                       04 –అప్రమేయ పద మఖిలాధారం –నిష్ప్రపంచ నిజ నిష్క్రియ రూపం —స్వప్రకాశ శివ మద్వయ మభయం –నిష్ప్రతర్క్య మన పాయ మకాయం |\
              భావం ——-”సద్గురు కటాక్షం వల్ల నేను సాక్షాత్తు బ్రహ్మమే .గురు కృప చేత చిన్మయ ,జ్ఞానానంద ఘన స్వరూప బ్రహ్మమే నేను .ఉపనిషత్ నిరూపించిండీ ఎకమే అయినదీ ,సాటి లేనిదీ,పాప రహితమైనదీ ,సర్వ వ్యాపక మైనదీ ,సత్య,సుఖసముద్రం అయిన బ్రహ్మను నేనే .సత్కర్మకు ,ఆకర్మకు ,దుష్కర్మలకు దొరమైన ,అఖండ ,అపార ,నిర్మల ,శుద్ధమైన ,బ్రహ్మము నేనే .హద్దులు లేని సత్తా కు ఆధారం నేనే .జరాదూరమై ,నిరూప మానమై ,మహిమాన్వితమై ,కామనా రహిత బ్రహ్మను నేనే .ఆశాపాశాలను చేదించే శక్తి కలిగి ,పంచ కోశాలకు అతీత మైన ,అనంతమైన బ్రహ్మము నేనే ,.కారణాలన్నీ టికి మొదటి కారణమై ,ప్రపంచం లోని అనేకం అంతా తానే అయి ,నల్లని మృత్యు రూప కలి దోష రహిత బ్రహ్మం నేనే .కొలవటాని వీలు లేని పరమై ,సర్వాదారమై ,ప్రపంచం లో క్రియా రహిత పదం అయిన బ్రహ్మం నేనే .స్వయం ప్రకాశమై ,మంగళ ప్రదమై ,అద్వయం ,అభయం అయి ,తర్కానికి అతీత మై ,అపాయం లేని ,శరీర రహిత మైన బ్రహ్మం నేనే కదా .సద్గురు కృప వల్ల నేనే బ్రహ్మం కదా ”.
                        విశేషం —వేదాలలో ఉపనిషత్ లలోని సారం అంతా ఇందులో ఇమిడ్చారు బ్రహ్మేన్ద్రులు .అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ ,విజ్ఞాన మయ ,ఆనందమయ ,అనేవి పంచ కోశాలు .అవి ఒకదాని కంటే ఒకటి వ్యాపన శక్త్హి కలవి .ఆనందమయ కోశానికి అవతల వున్న అనంత వస్తువే బ్రహ్మం .ప్రపంచం లోని ప్రతి వస్తువుకి ,ప్రాణికి ,ఒక కారణం వుంటుంది .కారణానికి వెనుక ఇంకో కారణం వుంటుంది .ఇలా అనంత కారణాలు .ఇన్ని కారణాలకు అసలు కారణం పరమాత్మ .ఆయన ఒక్కడే కారణం .ప్రపంచ వ్యాపిత అంతర్గత పరమాత్మను చూడ గలిగితే ,ఇంద్రియాలు మూగ పోయి ,ఇంద్రియాలకు కనిపించే ప్రపంచం మాయమవుతుంది
             ఆరవ కీర్తన గురించి చర్చిద్దాం
06 —పల్లవి —–పూర్ణ బోదోహం,సదానంద–పూర్ణ బోదోహం ||
               అను పల్లవి —-వర్నాశ్రమాచ్చార కర్మాతి దూరోహం –స్వర్నవదఖిల వికార గతోహం ||
                చరణాలు —01 —ప్రత్యగాత్మాహం ప్రవితత సత్య మనోహం –శ్రుత్యంత శత కోటి ప్రకటిత బ్రహ్మ హం —నిత్యో హమ మభాయోహమద్వితీయోహం ||
   02 –సాక్షీ మాత్రోహం,ప్రగలిత పక్ష పాతోహం —మోక్ష స్వరూపోహమొంకార గంయోహం —సూక్ష్మోహ మనఘోహ మద్భుతాత్మాహాం ||
    03 –స్వప్రకాశోహం విభురహం,నిష్ప్రపంచోహం —అప్రమేయోహమచాలోహమకాలోహం —నిష్ప్రతర్క్యాఖండైక రసోహం .||
     04 –అజ నిర్మమొహం ,బుధ జన భజనీయోహం –అజ రోహామమరోహమమ్రుత స్వరూపోహం —నిజ పూర్ణ మహిమని నిహిత మహితోహం ||      05 –నిరవయవోహం ,నిరుపమ నిష్కలన్కోహం —పరమశివేంద్ర శ్రీ గురు సోమ సముదిత —-నిరవధి నిర్వాణ సుఖ సాగరోహం ||
                     భావం —–ఆత్మానుభావం పొందిన అనుభవ స్థాయి నుంచి ఉద్భవించిన మధు మధుర గీతం,సంగీతముపనిశద్ ఉపదేశం ఈ కీర్తన
                                ”నేను పూర్ణ జ్ఞాన ఆనంద స్వరూపుడిని .వర్ణాశ్రమ ,ఆచార ,కర్మ ధర్మాలకు అతీతుడిని .బాంగారం లాగా అనేక మార్పులు పొందే వాణ్ని .అందరిలో వున్న ఆత్మను ,నామ రూప జగత్తు లో వ్యాపించిన సత్య స్వరూపున్ని .ఉపనిషత్ చెప్పిన పరబ్రహ్మను .నిత్య ,అభయ,అద్వితీయ ,బ్రహ్మను .అన్నిటికి సాక్షీ భూతుడను .పక్ష పాత రహితున్ని .ఓంకారంవల్ల   చేరదగిన వాడిని .సూక్ష్మమై ,పాప రహితమైన అద్భుత ఆత్మను .నేను స్వయం ప్రకాశ కుడిని .అన్ని రూపాలు నేనే .ప్రపంచాతీతుడిని నేను .కొలతలకు అందని వాడిని .సర్వ వ్యాపకుడిని .విభజన ,కదలిక లేని వాడిని .తర్కానికి అతీత మైన ఏక రసాన్ని.జన్మ ,మమకారం లేకుండా ,బుధ జన ఆరాధకుడిని .జనన ,మరణాలు లేని అమృత స్వరూపుడిని .నా మహిమ లోనే నిలిచి వుండే మహా మహితాత్ముడిని .అవయవాలు లేని ,అనుపమాన మైన ,నిష్కలంకున్ని నేను .శ్రీ పరమ శివేంద్ర గురు దేవుల నే ,చంద్రుని ద్వారా ఉదయించిన సుఖ సాగ రాన్ని నేను .”
            విశేషం —-ఇది ఆత్మను దర్శించే సందర్భం .అంటే ఆత్మ ఆవిష్కారం .ఈ సమయం లోనూ ,తన గురు పాదులు శ్రీ పరమ శివెంద్రులను సస్మరించారు . సదాశివ బ్రహ్మేన్ద్రులు .గురు కటాక్షం సంపూర్ణం గా పొందిన వారు కనుక ,గురు స్మరణే ముక్తి దాయకం గా భావించారు .రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు .గురువు చంద్రుడు అయితే గురువు నుండి ఆత్మ జ్ఞానం పొందిన శిష్యుడు చంద్రుని వెన్నెలకు ఉప్పొంగే అనంత సాగరం నిగూధం కూడా .కొందరు బాహ్య విషయాల వల్ల మహిమలు పొందు తారు ..వీరు సామాన్యులు తన మహిమతో తానే నిలిచే ఆత్మ స్వరూపుడుమహాత్ముడు .
                            ఇక్కడితో ఆత్మ బోధ పూర్తి అయింది .తర్వాత ”బ్రహ్మానందం ”అనుభ విద్దాం .
                                                              సశేషం
                                                                             మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -10 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.