బౌద్ధం లో వచ్చిన పరిణామాలు –2
బౌద్ధ సంప్రదాయం
ప్రతి జీవి బోధిసత్వుడు అవాలంటే జ్ఞానాన్ని మనసులో నిలుపు కోవాలి ప్రకనమ్ పోయే దాకా శ్రమ చేస్తూ ఆ” బోధి ”ని అంటే జ్ఞానాన్ని పొందుతానని శపథం చేయాలి .ప్రాణుల కోసం సర్వస్వం త్యాగం చేసి ,జనుల బాధలను తీర్చి ,వాళ్ళను నిర్వానుల్ని చేయాలి.ఇలాంటి బోధి సత్వుడు గృహస్తుడు గా నైనా ఉండ వచ్చు లేక భిక్ధువు గా జీవించ వచ్చు .
” బుద్ధులు ”అంటే సర్వ ధర్మ విరక్తులు ,అనంత శక్తి ,ఆయుస్సు వున్న వారు .నిద్ర ,స్వప్నం లేని వారు .ఎప్పుడూ సమాధి లో వుండే వారు .కొన్ని సమయాల్లో కొన్ని లోకాల్లో కని పించేవారు .
”బోధి సత్వులు ”పూర్తి జ్ఞానం తోనే మాత్రు గర్భం లో ప్రవేశిస్తారు .దీన జనోద్దరణ కోసం హీన జీవులు గా పుడతారు .కఠిన శ్రమ తో ,గురువుల వద్ద విద్య నేరుస్తారు .ప్రకృతికి విరుద్ధం గా చుండే అద్భుతాలను చేస్తారు .
”అర్హతులు ”అంటే బుద్ధులకు ఉన్నంత జ్ఞానం లేని వారు .అజ్ఞాన బంధాల నుంచి విముక్తి కాని వారు .అర్హత్వం నున్చిన్క్రింది దశలకు జారి పోయే ప్రమాదం వున్న వారు .ఈ విధం గా ,సాంఘిక సిద్దాంతా లలో మార్పు రావటం వల్ల మహా యాన బౌద్ధం ఏర్పడి నట్లు భావిస్తారు .
బౌద్ధ మత శాఖలు
మహా సాంఘిక సిద్ధాంతాలు మూడు దశలు గా వుంటాయి .01 -పుట్టుట ,గిట్టుట లను దాటి పోయిన దశ ను తిరిగి రాని దశ అంటారు .02 -నిర్వాణం దాటటానికి పూర్వం జన్మించే దశ .03-జననం ,మరణం అనే ప్రవాహం లో కొట్టుకు పోయే దశ .ఈ పరిస్థితుల్లో బౌద్ధం లో రెండు శాఖలు ఏర్పడ్డాయి .అవి హీన యానం ,మహాయానం .పాళీ పితకాలలో వీటి ప్రస్తావన వుంది .హీన యానానికి శ్రావక యానం ,ప్రత్యెక బుద్ధ యానం అనే పేర్లు వున్నాయి .మహాయానానికి బుద్ధయానం అనీ ,తదాగత యానం ,బోధిసత్వ యానం అనీ పేర్లు .ఈ పేర్లు ఎందుకు ఏర్పడ్డాయో మహా యాన గ్రంధాలలో చెప్పబడింది .
” హీన యానం ”అంటే –సామాన్య బుద్ధి వున్న వారు ధర్మాన్ని ,మతాన్ని శ్రద్ధగా విని ,తెలుసు కోని ఆచరించి ,బుద్ధుడు చూపిన మార్గం లో పరిపూర్ణత సాధించటం .ఇది శ్రావకులకు ఏర్పడిన ప్రత్యెక మార్గం .
”మహా యానం ”అంటే ఉత్తములు ఇంకెవరి సహాయం లేకుండానే ,తమ ముక్తిని తామే సాధించి ,ఇతరులకు దారి చూపిస్తూ ,సహాయం చేసే విధానం . హీన యానం పరిపూర్నులైన అర్హతులను తయారు చేస్తే ,మహాయానం సిద్ధార్ధుడు పొందిన అత్యున్నత మైన బోధి సత్వాన్ని పొంద టానికి మార్గం చూపించింది .ఇంకాస్త వివరం గా చెప్పాలంటే ,ఇతరులు కూడా మోక్షం పొందనిదే తాము ముక్తిని కోరు కోని వారు మహాయానులు .తమ స్వీయ ముక్తి కోసమే పాటు పడే వారు కనుక హీనులు అయారు .మొదటి దాని కంటే ఇది తక్కువ స్థాయి .అది లోకోద్ధారణ .ఇది స్వీయోద్ధారణ అన్న మాట . , సత్యాన్ని అనుభవించటానికి రెండు ఆవరణలు వుంటాయి .మొదటిది దుఃఖ (క్లేశ )ఆవరణ .రెండవది జ్ఞేయ ఆవరణ .నైతిక నియమాలను అనుసరించటం వల్ల నడ వాది మార్చుకొని క్లేశావరనాన్ని పోగొట్టు కో వచ్చు .క్లేశం తొలగితే” వ్యుద్గల శూన్యత ”,వ్యక్తిత్వ శూన్యత మాత్రమే తెలుస్తాయి .జ్నేయావరనాన్ని కూడా తొలగించుకుంటే ,పై ఎందితి తో పాటు ,ధర్మ శూన్యత అంటే ప్రపంచ విషయాలు మిధ్య అన్న భావం కూడా తెలుస్తుంది .ఈ రెండు ఆవ రాణాలు ఎవరు ,సాధన ద్వారా తొలగించు కొంటారో ,వారికి సత్య సందర్శన యోగం లబ్భిస్తుంది .మహాయానాన్ని బాగా వ్యాప్తి చెందించిన వాడు ఆచార్య నాగార్జునుడు .అ తర్వాత ,ఆర్యదేవుడు ,మైత్రేయ నాభుడు ,అసంగుడు వంటి పండితులు ,తార్కికులు దీని ఆదరించారు .దీనితో ఈ రకమైన బౌద్ధానికి తత్వ దృష్టి ఏర్పడింది .మహాయానానికి ”ప్రజ్ఞాపారమిత ”గ్రంధం ప్రమాణ మైనది .వీరంతా బుద్దున్ని దేవుణ్ణి చేశారు .వీరి ద్రుద్తి లో బుద్ధుడు పిపీపిలికాది సర్వ ప్రానుల్లోను ,ప్రచ్చన్నం గా వుంది ,జ్ఞానం కలిగిస్తూ ,దాన్నిని పెంచుతూ ఉంటాడని ”కారండ వ్యూహం ”అనే గ్రంధం తెలియ జేస్తోంది .బుద్ధ భగ వానుడు తన లక్ష్యం నిర్వాణం అని మాత్రమే చెప్పాడు .అయితే దాన్ని ఖచ్చితం గా నిర్వచిన్చలేదని ,ఈ ఆలోచనలు బయలు దేరినట్లు కని పిస్తుంది .నిర్వచించమని బుద్ధున్నే అడిగితే మౌనమే ఆయన సమాధానం .మహాయాన ప్రచారకుడు నాఆర్జునుడు మాత్రం ఉన్నదీ ,లేనిదీ ఈ రెంటి నుంచి ,ఆ రెండు కాని వాటి నుంచి ,ఏది విడిచి పెట్ట బడు తుందో ,దాని రూపం అని ,అదే ”శూన్యం ”అనీ నిర్వ చించాడు .(ఆస్థి నాస్తి తదుప యాను భయ వినిర్ముక్త స్వరూపం ).అశ్వ ఘోషుడు మాత్రం ”దీపం ఆరి పోయే స్థితి వంటిదే నిర్వాణం ”అని చక్కగా చెప్పాడు .
అశోక చక్ర వర్తి –హీన ,మహాయాన మార్గాలకు మధ్య మార్గాన్ని ఆచరించాడు .వైరాగ్యాన్ని అశోకుడు ఒప్పు కో లేదు .దానితో బుద్ధుల ఆలోచనలలో కొంత మార్పు వచ్చింది .సన్యాస స్వీకారానికి వ్యతి రేకం గ అశోకుని కాలమ్ లో ఒక ఉద్యమమే బయల్దేరింది .దీని ఫలితం గా ,బౌద్ధం ప్రజా జీవితానికి దగ్గరైంది .పల్లె ,పట్ణనాలకు వ్యాపించింది .కఠిన నియమా లన్నీ ,స్వార్ధ త్యాగంతో ,జయించటం ప్రారంభ మైంది .దీనితో ,ప్రజల్లో విశ్వాసం ,భక్తి పెరిగాయి .చైత్యం నిర్మించాలనో ,బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయాలనో ,కోరిక జన సామాన్యం లో పెరిగింది .ఆ ప్రతిమను భక్తి తోపూజించి ,ధన్యత చెందాలన్న తీవ్ర వాంచ ప్రబలింది .క్క్కడ మతాలలోను ,చైత్యాల్లోను భిక్షువులు సాధన చేస్తుండగా ,ఇక్కడ సామాన్యులు బుద్ధుని ఆరాధిస్తూ ధన్యత చెందు తున్నారు .నిత్య ప్రార్ధన ,పూజాదులతో ,ప్రజలు ప్రజలు బుద్ధుని ,తమ ముందు వున్నట్లు గా భావించారు .అప్పటి దాకాఆయన శాక్య ముని .ఇప్పటి నుంచి బుద్ధుడు సర్వ సమర్ధుడైన దేవాది దేవుడైనాడు .బుద్ధ జీవిత కధలను శిపాలుగా ,మలచి ,స్ఫూర్తి పొందారు .తెల్లటి నాప రాయి మీద ఉబ్బెత్తు ఆ బుద్ధుని శిపాలు చెక్కారు .అందు లో ఎన్నో భావాలను ఆవిష్కరించారు .వాటిని చూసి జనం తన్మయులయారు .శిల్పులు ,చిత్రకారులు ,తమ కళలను బుద్ధ జీవిత కధలలో నిక్షిప్తం చేసి ధన్యత చెందారు .ఈ శిల్పులు ఆంద్ర దేశం లోను బహుళ వ్యాప్తమైన శిపాలు చెక్కారు .ఇదంతా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ది లో జరిగి పోయిన విషయాలు .జనం లో బాగా వ్యాప్త మైంది కనుక మహాయానాన్ని ”జన బౌద్ధం ‘అన్నారు .అంత మాత్రం చేత హీన యానం కనుమరుగు కాలేదు .హీన యాన సూత్రాలు జన బౌద్ధం లో చేరి పోయాయి .భక్తీ ,శ్రద్ధ ,పూజలు అదనం అయాయి అంతే . దీనితో మహాయానం కొత్తరూపు దాల్చింది .ఖచ్చ్తం గా చెప్పా లంటే బాహ్య రూపం మహాయానం ,జీం మాత్రం హీనయానం గా వునదే జన బౌద్ధమయింది .దీనికే ఆదరణ బాగా పెరిగింది జన సామాన్యం లో .ఏ యానమైనా ,నైతికత కు వదిలి పెట్ట లేదు ”శేలాన్ని జీవం గా ,కరుణ ఉగ్గుతో బెట్టిన విద్య గా” భావించాయి
కాలమ్ ఎన్నో మార్పులు తేవటం సహజం .అభి రుచులు మారుతాయి .కఠోర నియమాలు కొందరికి ఇబ్బంది కలిగించాయి .బోధిసత్వ సాధన దుర్లభామని పించింది .దీనికి ఉపాయం వెదికారు .ప్రజలను ఆకర్షించాతమే బౌద్ధం ధ్యేయం అని పించింది .’అసంగు ”మొదలైన బౌద్ధ పండితులకు. .క్రీ శ.నాల్గవ శతాబ్దం లోనే .తంత్ర సంప్రదాయాలు వచ్చేశాయి .దీనికి మూలం .దీనికి మూలం ”వజ్ర భూతి ”అంటారు .”శాంతిదేవుడు ”మాత్రం మొదట ఈ ప్రస్తావన ను గ్రంధాలలో చేశాడు .అసంగుడు మహాయానానికి భాష్యం గా తంత్ర సిద్ధాంతాన్ని చొప్పించాడు .దీనితో మహాయానం లో అనేక మార్గాలు ఎర్పడాయి .అసంగునికి ఆధారం ఒకటి ,రెండు శతాబ్దాలకు చెందిన మంజుశ్రీ రాసిన ”మూల కల్పం ”అంటారు .తంత్రాలు పైకి కనిపించేవి .గూదార్ధం తో వున్నవి అని రెండు రకాలు .కనిపించని అర్ధం కలదే యదార్ధం అంటారు .ఇది ”సంధ్య ”భాష లో వుంటుంది .అంటే జ్ఞానంతో ఆలోచిస్తే జ్ఞానం ,అజ్న్నానం తో ఆలోచిస్తే అవినీతి అందులో కని పిస్తాయి .
సశేషం
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —02 -11 -11 .

