బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-1
ఏ మతమైనా ,సమాజం లో వచ్చిన మార్పులకు ,వత్తిళ్ళకు ,ఇతర మతాల ప్రభావాలకు , ,అవసరాలకు మార్పు పొందుతూనే వుంటుంది .ఈ మార్పులు ఆ మతానికి కొన్ని సార్లు లాభదాయకం గా ,కొన్ని సార్లు కష్టం కలిగించేవిగా వుంటాయి .లాభం వుంటే మతం పుంజుకుంటుంది .నష్టం కలిగితే కుంగి పోతుంది ఒక్కో సారి స్వార్ధ శక్తుల ప్రభావం వల్లచీలికలు ,పేలికలు అయి అసలు స్వరూపమే మారి పోతుంది .దీనికి ఏ మతము అతీతం కాదు .బౌద్ధం కూడ ఎంతో ఆదర్శ ప్రాయంగా వచ్చింది కాలక్రమం లో అనేక మార్పులు పొందింది .చివరికి గుర్తు పట్టటానికి వీలు లేని రూపం గా మారింది .ఆ పరిణామాలను పరా మర్శించ టమే ఈ వ్యాసం ధ్యేయం .
ఆదర్శ బౌద్ధం
ప్రాణులను చంపరాదని ,అన్ని జీవాలపై జాలి చూపించటం ముఖ్యమని బోధిసత్వుడైన బుద్ధుడు బోధించాడు .ధనం కోసం వంచన వద్దన్నాడు ,.పరస్పర ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటం తో వృద్ధి చెందుతుంది .కూట సాక్ష్యం,నిందా ,అసత్యాలను దగ్గరకు చేర నీయ రాదు .సత్వ సంశుద్ధికి సత్యమే సరైన భాష .మోహ పరవశత్వం లో పరభార్యలను చేరితే శీలమే కాదు ,ధర్మ త్చ్యుతి కలిగి సమాజ వినాశన హేతువు అవుతుందని బుద్ధ భగ వానుని వాణి .బుద్ధుని విధానం వైరాగ్యం కాదు .ఆయన యోగ విధానానికి ఆధారం కరుణ .లోకం పట్ల జాలి కరుణ ,అనుకంప ఆయన్ను ఒక మహా శక్తి సంపన్నుని గా చేశాయి .అందుకే సంసారాన్ని త్యజించి ,జ్ఞాన సాధనకుఅడవులు పట్టాడు .విశ్వ వ్యాపితమైన జాలితోనే బంధువు లందర్నీ వదులు కున్నాడు .మనశ్శాంతి కోసం తపస్సు చేశాడు .చివరకు నిర్వాణం పొందాడు .ఆ నిర్వాణం ఒట్టి కాంతి మాత్రమే కాదు .అది కరుణ రస సాక్షాత్కారం .మనిషి మనుగడ అర్ధవంతం కావ టానికి గౌతముడు ”పంచ శీల ”ను బోధించాడు .దాన్ని సమష్టి పరం చేయ గలిగితే లోక కళ్యాణమే .అసుర స్వభావం అయిన విరోధాన్ని పూర్తిగా వద లాలి .మానవ స్వభావ మైన స్నేహాన్ని సాధించాలి .భగవద్గీతలో భగవానుడు కృష్ణుడు చెప్పిందీ ఇదే కదా .సర్వభూతాల మీద ఎవరికి వైరం ఉండడో ,వారే తనను t పొందుతారు అని చెప్పాడు అదే గీతా సారం .కృష్ణుని సర్వ భూత ప్రేమ ,గౌతముని అహింస అన్ని కాలాలకు శ్రేయో దాయకమే .సంక్షుభిత స్థితి లో సమాజం వునప్పుడు వీటికి ప్రత్యెక అవసరం వుంటుంది .
” అర్హతునికి ”అర్హతలు
బౌద్ధ మతం లో సాధకులు” అర్హతులు ”అవుతారు .అన్నిటి లోను వున్న ”అతి ”ని విసర్జించి ,మధ్యమ మార్గం గా నడిస్తే నే అర్హతుడవు తాడు .దీనికి బుద్ధుడే ఆదర్శం .బుద్ధుడు జితేంద్రియుడు,గొప్ప ఆధ్యాత్మిక అనుభవం వున్న వాడు .ఆయనకు మంచి శరీర సౌష్టవం వుంది .అధిక క్రియా,శక్తి సంపన్నత కూడా వుంది .మంచి భోజనం చేసే వాడు .మంచి దుస్తులూ ధరించే వాడు .మధ్యమ మార్గం లో నడ వాలంటే ”అష్టాంగ సాధన ”చేయాలి .మానవుల్ని బంధించే దశ బంధాల నుంచి విముక్తి చెందాలి .అంటే వాటిని చేదించు కోవాలి .”నేను ”అన్న భ్రాంతి అందులో మొదటిది .సందేహం రెండోది .బాహ్యం గా చేసే మంచికర్మలె ప్రయోజనం అనే భావం ,విషయ వాంచ ,దుస్చింత ,ఐహిక సుఖం పై మమకారం ,ఈ శరీరం వదిలి స్వర్గసుఖాలు అనుభవించాలన్న ఆరాటం ,స్వాతిశయం ,దురహంకారం ,అవిద్యఅనే వాటినన్నిటినీ వదులు కోవాలి .అప్పుడే మార్గం తేలిక అవుతుంది .అష్టాంగ విధానాలతో సాధన చేశ్తే గమ్యం చేర గలరు .అవి సమ్యక్ దృక్పధం ,సమ్యక్ ఆశయం ,సమ్యక్ భాషణం ,సమ్యక్ప్రవర్తన ,సమ్యక్ జీవనం ,సమ్యక్ కృషి ,సమ్యక్ భావం ,సమ్యక్ అను భూతి ఇవే అష్టాంగాలు .ఇంతకు ముందు చెప్పిన పది బంధనాలలో మొదటి మూడింటినీ వదిలేస్తే ,అతని లో గొప్ప శక్తి ఏర్పడి ,”అర్హతుడు ”ఆవ టానికి దారి సుగమం అవుతుంది .సత్వ గుణం తో ,తామసిక ,రాజ సిక ,గుణాలను జయించి ముందుకు అడుగు వేయాలి .అప్పుడు ఏర్పడే ప్రత్యెక వ్యక్తిత్వాన్ని ప్రశాంతత లో లీనం చేసి,నిర్వాణం పొందటమే ఈ సాధన పరమార్ధం .
ఆధునిక భారత దేశం లో అహింసా మార్గం లో ,సత్య భాషణం లో జీవితాన్ని పునీతం చేసుకున్న జాతి పిత మహాత్మా గాంధి గారు బుద్ధుని జీవితాన్ని బాగా అధ్యయనం చేశారు .”బుద్ధుడు నాస్తికుడు కాదని నేను చెప్పటానికి సాహశిస్తున్నాను .తోటి వారి కోసం హృదయం గాయ పడక పోతే ,హృదయం లోంచి రక్తం ధారాళంగా ప్రవహించక పోతే ,అతనిని బుద్ధ భగ వానుడు తన వాడి గా గుర్తించడు .గర్వం లేని ప్రజలు నమ్రత తో ,దేవుని చేరు తారు .ఇదే బౌద్ధ మతం ముఖ్య ధర్మం అని నా అభిప్రాయం”ఆన్నారు గాంధిజీ .శ్రీ అరవింద మహర్షి కూడా ”కర్మ బంధనం నుంచి,వ్యక్తిత్వం నుంచి దుఖం నుంచి ,విముక్తి చెందటమే బుద్ధుని లక్ష్యం .అప్పుడే నిత్యమూ ,సత్యము అయిన స్థితి పొంది బంధ విమోచనం కలుగు తుంది ”అన్నారు .వ్యక్తిత్వాన్ని దాటి ,అంతరంగం లో ప్రశాంత స్థితిని అనుభ విస్తు ,శాశ్వతమైన సత్యం ,ధర్మం ,ప్రేమ లకు సంబంధించిన కర్మల్ని బాహ్యం గా చేయటమే బుద్ధుని సందేశం అని శ్రీ అరవిందుల భావం .దీనినే కవి ,సిని రచయిత ,నాటక రచయిత పింగళి నాగేంద్ర రావు ”కామాగ్ని జరిగేటి కామ దహనమురా –ఆనంద భోగమే అపరామ్రుతమురా —భువన భువనాలకు బుద్ధ గతి ఇదిరా ”అని చక్క గా వివరించారు .కక్షలు ,కార్పణ్యాలు అనంత మైన బాధకే దారి తీస్తాయి అందుకని మైత్రీ దీపమే రక్ష .అందుకే దీన్ని ఆవిష్కరిస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు బుద్ధుని హృదయ రాణి ”యశోధరా ”హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించారు కమ్మని పద్యంలో .
”లోకాలు వెలిగించురాకాసుదాకరు –నింటిలో బంధింప జేయుటేట్లు !
జగతికిఅత్యుజ్వల ప్రగతి జూపెడి ధ్రువ –జ్యోతి ని దాచుకో చూచు తేటలు !
విశ్వ జనీనమౌ నైశ్వర్యమును మేడ –గోడలలో నిల్పు కొనుట యెట్లు !
సర్వం కషంబైన జ్ఞాన వారాసిని –పైట కొంగున మాటు పరుచుటేట్లు !
భ్హువన బంధుని మణిమయ భవన మందు –పవలు రాత్రులు నిర్బంధ పరచుటేట్లు !
ప్రేమ మయు నిన్ను నా బాహు సీమల –పట్టు కోని చుట్టు కొని నిల బెట్టు టెట్లు !”
అని ఆ కరుణా మయుని విశ్వవ్యాప్తిత్వాన్ని ,ఆ ప్రేమ మూర్తి అనంతత్వాన్నిచక్కగా అర్ధం చేసుకోంది యశోధర .తన పేరు సార్ధకం చేసు కోని తన యశస్సు ధరామండలం అంతా వ్యాపింప జేసి ధన్యురాలైంది .
సశేషం
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —-02 -11 -౧౧.
వీక్షకులు
- 1,107,668 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

