బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-3 గుహ్య సమాజ తంత్రం

       బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-3
                                                                         గుహ్య సమాజ తంత్రం
                      ”  శరీరాన్ని కష్ట పెట్టటం వల్ల ,ఇంద్రియాలను నిగ్రహించుకోవటం వల్ల మోక్షం రాదు ,.ఇలాంటి కష్టతర మార్గాల వల్ల పరి పూర్ణత రాదు .కోరికలన్నీ పూర్తిగా అనుభవిస్తేనే మోక్షం ”అని గుహ్య సమాజ తంత్రం చెబుతుంది .బుద్ధుడు జీవ హింస ,మద్య ,మ్మాంసాలు విసర్జించమని కోరితే ,ఈ తంత్రం మాంసమే కాదు ,నరమాంసము భక్షణ చేయమన్నది .ఇష్టమైన స్త్రీ తో భోగించమన్నది .నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ మన్నది .”నువ్వు యోగివి .సమాజం అసంపూర్నులతో నిండి వుంది .అసంపూర్నుల కోసమైన సామాజిక నియమాలు యోగులకు చెల్లవు ”అని తీర్పునిచ్చింది . .యదేచ్చా విహారానికి తెర లేపింది మంత్రాలు ,ముద్రలు ,మండలాలు వ్యాప్తిప్లోకి వచ్చాయి .జనాకర్షణ పెరిగింది .ఆ కాలమ్ లోనే ఉత్కళ దేశం లో” ఇంద్ర భూపతి ”అనే ఆయన ”మహా సుఖ వాదం ”తో ”వజ్ర యానం ”
అనే శాఖ ను ఏర్పరచాడు .ప్రాంచిక భోగాలన్నీ అనుభ వించ మన్నాడు .బోధి సత్వుని పురుషునిగా ,నైరాత్మ లేక శూన్యాన్ని స్త్రీ గా చెప్పాడు .స్త్రీ ని ఆలింగనం చేస్తేపురుషునికి ఎంతటి సుఖానందం కలుగు తుందో ,శూన్యాన్ని ఆలింగనం చేస్తే అంతటి సుఖానందాలు కలుగు తాయి .ఇంతకీ శూన్యం అంటే ఏమిటి ?అన్న దానికి సమాధానం చూద్దాం .నిర్వాణత్వం పొందిన మనస్సునుబోధి చిత్తం  అంటారు .ఆ స్థితి లో ఆ చిత్తం ఊర్ధ్వ లోకాలకు ఎగురు తుంది ..ఈ లోకాలలో బోధి సత్వుని రూపం వుంటుంది .అరూప లోకం లో రూపం నశించి పోతుంది .ఇదే చివరి లోకం .ఇక్కడ ”నమితా బుద్ధుడు ”దివ్య తేజస్సు తో ఉంటాడు .దాని పైన సుమేరు శిఖరం వుంటుంది .ఇక్కడికి చేరిన బోధి సత్వుడు శూన్యం లోకి ప్రవేశించి ,దానిలో లీనమైపోతాడు .ఇంకో చోట మహా సుఖ వాదమే ,తదాగత జ్ఞానం గా చెప్పాడు .
                      ఇంద్ర భూతి రాసిన ”జ్ఞాన సిద్ధి ”గ్రంధం లో జ్ఞానం వల్లే నిర్యాణం వస్తుందని చెప్పాడు .అన్ని విధాల్లో వజ్ర యానమే చాలా మేలైనదని అన్నాడు .ముద్రలు ,పాండిత్యాల వల్ల మోక్షం రాదు అన్నాడు  .వజ్ర యానం టిబెట్ దేశం లో ”రహష్య మంత్రం ”పేరుతొ ప్రచార మైంది .గురు పద్మ నందుడు టిబెట్ లో దీన్ని ప్రచారం చేశాడు .భారత్ నుంచి ఇతను టిబెట్ కు చేరి ”లామా ”పీఠం స్థాపించాడు .గురు పద్మ నందుడే మొదటి ”లామా.”.ఈయన శాంతి రక్షితుని బావ మరిది .
                                                                 సహజ యానం
                          క్క్రీ.శ.729  ప్రాంతం లో ఉద్యాన దేశ రాని ”లక్ష్మీ కర దేవి ””సహజ యానం ”ప్రవచించింది .వజ్ర యానానికి ఇది ఉప శాఖ .దీని ప్రకారం ఎవరూకష్ట పడక్కర లేదు .మోక్షం కోసం వేమ్పర్లాదక్కర లేదు .దేనికీ నిషేధమే లేదు .సత్యం తెలిస్తే ,యెట్లా తిరిగినా ఫరవాలేదు .సహజ యానం నుంచి ,కాల చక్ర యానం ,ముమ్నుగా యానం ,వచ్చాయి .
                                                           ప్రజ్నో పాయ నిశ్చయ సిద్ధి
                      ఇంద్ర భూతి రాసిన జ్ఞాన స్సిద్ధికి సారభూత మైనదే  అనంగ వజ్రుడు  క్రీ.శ.౧౦వ శతాబ్దం లో రాసిన ”ప్రజ్నో పాయ నిశ్చయగ్రంధం ” జైన మతం లోని ”నాద సంప్రదాయం ”కు అనుకూల మైన తత్ర శాఖ ఇది . .  .ప్రజ్న తో ఉపాయం కలిస్తే మోక్ష మార్గం తెలుస్తుంది .అద్వయత్వ సంయోగం లేనిదే మోక్షం రాదు .ప్రజ్ఞా పారమితత్వం లేక పోయినా మోక్షం రాదు .ఇది స్త్రీలు అందరిలో వుంది .కనుక వావి  వరుసలు లేకుండా స్త్రీలను అనుభవించాలి .భోగం తో యోగం యోగం తో మోక్షం వస్తుందట .అయితే మనస్సును చలిమ్పనియ్యకుండా ధ్యాన బుద్ధితో ఇదంతా చేయాలట .మనసు చాలిస్తే మోక్షం హుళక్కి .ఇలా తంత్ర సంప్రదాయం బౌద్ధం లో బాగా వెళ్ళు తన్నుకు పోయి వ్యాపించింది .దీనితో స్వైర విహారం పెరిగి పోయింది .క్రమ శిక్షణ మ్రుగ్యమయింది .శీలం గోడమీద మేకు కు తగిలించే శారు .వావి లేదు వరుస లేదు .అంతా సమానమే .శారీరక సుఖమే పరమ భాగ్యం అయి పోయింది .ఎంతో నియమ నిష్టలతో వర్ధిల్లిన బౌద్ధం ,బుద్ధి జాడ్య జనితోన్మాదం తో అధః పాతాళానికి పతనమైంది .భార్త్రు హరి పద్యం ”ఆకాశంబున నుండి శంభుని శిరంబు ——-పవనందోలోకమ్ము చేరె అనగా కూలం కష –పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్” గుర్తుకు వస్తుంది .దివ్య ఆపగ (నది )లాగా వుండే బౌద్ధం పాతాళానికి చేరింది .
ఇంకేముంది ?హిందూ మతస్తులకు గొప్ప అవకాశం చేతికి చిక్కింది .బౌద్ధం లోని చెడును భూతద్దం లో చూపించారు .మూడవ శతాబ్దం లో చొరబ్బడిన తంత్రం ఏడవ శతాబ్దం దాకా వ్యాప్తి చెందింది .44 సిద్ధులు ,పాటలు ఉపదేశాలతో ప్రచారం బాగా చేశారు .వజ్ర యానం టిబెట్ తో పాటు నేఆలు కు చేరింది .తాన్త్రికాలు టిబెట్ భాష లోకి అనువాదం చెందాయి .కొన్ని అనువాదాలు చైనా త్రిపితకాలలోను చేరాయి .వామాచారాలన్నీ ,భారత దేశం లోని ఆధ్యాత్మికతను ,విదేశీయుల అభిరుచుల్ని మేల వించి నవి గా విశ్లేషకులు భావించారు .ఇంత మహా ప్రయాణం సాగించి ,పరి వార్తన చెందింది బౌద్ధం .ఏ మార్గ మైనా సామాన్యుని దృష్టి లో పెట్టుకుని ఏర్పడిందే .
                           ఈ విషయాలన్నీ స్పృశిస్తూ ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ ఒక కమ్మని పద్యం చెప్పారు
                     ”కరుణ లూనెడు నహింసే స్థిరమగుత –నవని నదే శాంతి యదె దాంతి యదియె  నీతి —
                        స్వరము మొదలైనవో పునర్జన్మ కే ,ఇక –రూపు లేని నిర్వాణమే ప్రాపు మనకు ”
          అంతు బుద్ధ భగ వానుని సూక్తులు గుర్తుచేశారు .ఆ శ్రీ చరణాలే అప్పుడు ,ఇప్పుడు ,ఎప్పుడూ ,అనుసరనీయాలు అంతు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి మహోదయులు సెలవిచ్చిన పద్యం తో నమస్కరిస్తూ సెలవ్
                                ”ప్రియ యువతిం బ్రభుత్వమును వీడి ,యరణ్యము జేరె దత్వ ,ని
                                 శ్చయ మునకై మహా తపము సల్పి ,క్రుతార్ధత గాంచె నెల్లడాన్
                                  దయాయు ,నహింస యుం ,బరమ ధర్మములన్ నెల కొల్ప ,నమ్మహో
                                   దయుడగు బుద్ధ దేవుని పదంబుల కేను నమస్కరించెదన్ ..
                                                 అయి పోయింది
                                                                                                                                    ఆధారం —-1956  బుద్ధ జయంతి పత్రిక
                                                                                                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —02 -11 -11 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.