మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —–2

            మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —–2
                                                                 స్టాయిసిజం
                  స్టాయిసిజం అంటే ఏమిటో తెలిసింది .ఇప్పుడు అది వ్యాపించినవిధం  చూద్దాం .గ్రీకు దర్శన చరిత్ర లో చివరి యుగం లోనిదే ”స్టాయిసిజం ”నైతికం ,దార్శనికం ఇందులో ముఖ్య భాగాలు .క్రీ.పూ.300  లో ఎతేన్సు లో ”జీనో ”అనే వేదాంతి దీన్ని ప్రారంభించాడు ”.స్టోవా ”అంటే చిత్రాలు వేసే చోటు .యా చోటులో ప్రారంభించారు కనుక ”స్టాయిసిజం ”అనే పేరు వచ్చింది .సినిక్ దార్శనికుడైన క్రేటాస్ శిష్యుడే జీనో .అందులోని సిద్ధాంతాల ఆధారం గానే దీన్ని అభివృద్ధి చేశాడు .హిరక్లైటాస్ అనే వేదాంతి మన విశ్వాన్ని విశ్వాగ్ని అనీ ,అంటే లాగోస్ అనీ ,–కాలమ్ అనీ సిద్ధాంతం చేశాడు .క్రిసిప్పాస్ అనే ఆయన దీన్ని అందరికి అందుబాటు లోకి తెచ్చాడు .క్రీ.పూ.189 -109  లో పేనేటియాస్ ఈ సిద్ధాంతాన్ని రోమన్ సామ్రాజ్యం లో ప్రవేశ పెట్టాడు .దీన్నే ”మిడ్ -స్టోవా ”అన్నారు .రోమన్ ఉన్నత కుటుంబాలలో ,ఈ సిద్ధాంతం బాగా వ్యాపించి రెండు శతాబ్దాలు జీవించింది .క్రీ శ.ఒకటవ శతాబ్దం లో సేనేకా ,ఎపిక్తేతాస్  ,ఒరీలియాస్ లు బాగా వ్యవస్థీకరించారు .మూడవ శతాబ్దం లో ఈ భావాలన్నే క్రైస్తవ మతం లోకి చేరి పోయాయి .రోమన్ ధర్మ శాస్త్రం పై స్టాయిసిజం ప్రభావం ఎక్కువ గా వుంది .ఇందులో తర్కం ,భౌతిక,నీతి శాస్త్రాలు
                     తర్క శాస్త్రం —-దీనిలో గుణాలు ,సంబంధాలు మనసు చేత సంకల్ప మైనవి కావు .ప్రకృతి సహజాలు .సత్య దర్శనానికి అనుమాన ప్రమాణం మార్గమే .అరిస్టాటిల్ న్యాయ ప్రయోగ సిద్ధాంతాలు దీనికి మూలం
             భౌతిక శాస్త్రం —-ఇందులో విశ్వానికి కారణం అగ్ని అంటారు .అదే ఈశ్వరుడు .సత్తా లో రెండు సత్వాలు వున్నాయి .ఒకటి సచేతన మైనది  –ఇదే కార్య కారకం .రెండు స్వయం చాలకం . –ఇతర వస్తువుల్ని రూప కల్పన చేస్తుంది .అలాగే వీరి దృష్టిలో జడం కూడా మార్పు పొందుతుంది .-ఆలోచనల తో విడదీయ వచ్చు .నియత వాదాన్ని( Determinism )సమర్ధించారు .ప్రతి విషయం కూడా ఇది వరకే నిర్ణ యిమ్పబడి వుంటుంది .మన మహా భారతం లో కూడా కురుక్షేత్ర యుద్ధం ముందే పైలోకాలలో జరిగింది.ఇక్కడ మళ్లే జరుగు తోంది అని వ్యాసుడు చెప్పాడు .విధిని అంగీకరించాలి .దీనికీ స్వేచ్చ వుంది .
                 నీతి శాస్త్రం —-సృష్టి ణియమం అంటే లోగోస్ దాని క్రమ హేతువును తెలుసు కోవటం మానవ కర్తవ్యం .హేతు బుద్ధి తో ఉన్నత జీవితాన్నిగడపాలి  .సుఖం ధర్మానికి భిన్న మైనది .సుఖం ఒక రాగమే .స్తాయిక్ అంటే ఆ సిద్ధాంత అవలంబకుడు రాగాలను లోబరచు కోవాలి .రాగాల వల్ల బాహ్య పరిస్థితులకు లోబడ తారు .ఆరోగ్యం ,జీవితం ,మర్యాద ,ధనం ,హోదా ,అధికారం స్నేహం ,విజయం స్వతస్సిద్ధాలే .అవి శ్రేయస్కరాలు శ కావు .వీటి ఆచరణ మన లక్ష్యం కాదు .స్వేచ్చ ,ఆనంద సాధన మన శక్తికి మించినవి .వాటి పై దృష్టి మార్చుకో వచ్చు .వాటి విలువ మన ”శీలం ”పై ప్రభావం చూపు తుంది .ధర్మమే అన్నిటిలోనూ ఉత్తమ మైనది .అదే ఆనందాన్ని ఇస్తుంది .విచక్షణ తో జీవించాలి .వైరాగ్యం ,రాగ సంబంధ విమోచానాలే వీళ్ళ నైతిక లక్ష్యం .వీళ్ళు ఆత్మ హత్యను సమర్ధించారు .
                                       నీరో –హీరో —జీరో
                రోమన్ సామ్రాజ్యం లో చక్ర వర్తి నీరో కు ,వేదాంతి సేనేకా కు చాల ప్రాముఖ్యం వుంది .నీరో ను హీరో ను చేసింది ఈయనే చివరికి శిష్యుడి చేతి లో జీరో అయి పోయాడు పాపం.వాళ్ళిద్దరి హవా సరదాగా నేసాగింది  మొదట .తర్వాత ఆది పత్య పోరు మొదలైంది .రాజా కీయం లో ఎవరు పాచికలు చురుకు గాఆడితే   వాళ్ళే గెలుస్తారు .మన దేశం లో కూడా నెహ్రు కుటుంబం లో ఇందిరా గాంధికి ,విజయ లక్ష్మి పండిట్ కు రాజకీయ  పోటీ వస్తే పావులు చక చకా కదిపి మేనత్తకు చెక్ పెట్టింది ఇందిరా అన్న సంగతి మనకూ తెలిసిందే .”మీ ఓటమికి కారణం ఏమిటి “?అని పండిట్ ను అడిగితే”’ నా కంటే నా మేన కోడలు వేగం గా పావులు కదపటమే ”అంది పాపం విజయ లక్ష్మి చేజార్చుకున్న విజయం పై ..అలాగే సేనేకా ,నీరోలు .
                    రోమన్ సామ్రాజ్యం లో ఒక వెలుగు వెలిగిన వేదాంతి గా సేనేకా ను చెప్తారు .క్రీ.పూ.ఏడవ శతాబ్దం లోనే ”వర్క్స్ అండ్ డేస్ ”అనే ”హిసాయిడ్” కవిత రాశాడు .ప్రపంచ విప్లవ చరిత్ర లో ఇదే మొదటి విప్లవ కవిత .రైతులు పొలం పనులు ,ఇంటి పనులు ఎలా చక్క దిద్దు కోవాలో ఇందులో వివ రించాడు .ఏది చెప్పినా సహజ పధ్ధతి లో చెప్పటం సేనేకా ప్రత్యేకత .సి -ఫారింగ్ (sea  faring) అంటే  సముద్ర   వ్యాపారం  గురించి  ఇందులో వివరం   గా చెప్పాడు .సమాజం లో నీతి ,న్యాయం వుంటే మనుష్యులు సముద్రం జోలికి వెళ్ళ నక్కర లేదని అప్పుడు భూమి సస్యశ్యామలమై ,అధిక పంటలను అందిస్తుందని చెప్పాడు .రోమన్ సామెత ఒకటి వుంది ”ఎవరి అదృష్టానికి వారే కర్తలు –ధైర్యే సాహసే లక్ష్మి ”.రోమన్ యోధులు అదృష్టానికి పరికరాలు .కాలమ్ లో ప్రతిదీ పుట్టి ,కాలమ్ లోనే కలిసి పోవటం సహజం .ఇది ఒక జీవన వృత్తం (లైఫ్ సైకిల్ ).బయటి దాని వల్ల నాశనం కాక పొతే ,లోపలి పరిస్థితుల వల్ల నైనా నశిస్తుంది .ఇదే విధం గా రోం ఉత్థానం ,పథనం చెందింది .డబ్బు కాంక్ష మొదలై ,దాన్ని అధికార కాంక్ష ఆవహిస్తుంది .ఈ రెండే చెడుకు ఆధారాలు అవుతాయి .జూలియస్ సీజర్ 365  రోజుల సంవత్చర కాలెండర్ ను ప్రవేశ పెట్టాడు .రోం ఏర్పడిన 365  సంవత్చ రాలకు” gauls ”రోం ను జయించి క్రీ.పూ.388 లో స్వాధీనం చేసు కున్నాడు .క్రీ .పూ. 23 న రోం లో మళ్ళీ సంక్షోభం ఏర్పడింది .సీజర్ మరణం తో 44 బి సి.లో మళ్ళీ అంతర్యుద్ధం చేల రేగింది .
                     రోమన్ రాజు క్లాడియస్ ,అగ్రిపీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .ఆమె కొడుకు లూసియాస్ దోమితాస్ ను దత్తత చేసు కొన్నాడు .అతనికి ”నీరో క్లాడియస్ ద్రూసాస్ జేర్మేనికాస్ సీజర్ ”గా పేరు మార్చాడు .ఇతడే మన హీరో ”నీరో ”.అతనికి తన కూతురు ఆక్టేవియ తోనిశ్చి తార్ధం   జరి పించాడు .క్లాడియస్ తర్వాత నీరో ను వారసునిగా తెచ్చే ప్రయత్నం లో తల్లి అగ్రి పీన వుంది .అడ్డం వచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యం గా తొలగించే ఏర్పాట్లు చేస్తోంది కూడా .నీరో కు మాత్రం ప్రజలకు దగ్గర అవాలన్న కోరిక బలీయం గా వుంది .అతను రాచ మర్యాదలు దాటు తాడేమో నని తల్లి ఆరాట పడేది .కొడుకును గుప్పిట్లో పెట్టుకుంది .నీరో ను ఇతరుల కంటే మహా బల వంతునిగా ,సృజన కారుని గా చేయాలనే కోర్కె సేనేకా కు వుండేది .గురు భక్తీ ప్రదర్శించి నీరో సేనేకా మనసు గెలిచాడు .కళా ,శాస్త్ర విషయాలను నీరో కు బోధించాడు గురువు సేనేక.తల్లికి ఇష్టం లేని తర్క శాష్ట్రాన్ని మాత్రం నేర్చుకో లేదు .నీరో కళ కళ కోసం కాకుండా జీవితం కోసం నేర్చాడు .అవసరం వస్తే ,సందర్భాన్ని బట్టి తన వాగ్దాటిని ప్రదర్శించే వాడు .అతని ప్రసంగాలను సేనేకా నే రాసి పెట్టె వాడు .సేనేకా సూచించిన విధం గా ఆసియా మైనర్ లో వున్న ”ఇలీయం ”కు ట్రాయ్ లో లాగా పన్నులు లేకుండా స్వతంత్రాన్ని ఇప్పించాడు నీరో చక్ర వర్తి చేత గురువు సేనేక ..
                    నీరో కలిగువా కుమార్తెను వివాహం చేసుకొని ,అగస్తస్ సీజర్ లాగ సంపూర్ణ అధికారాలు పొందాడు .క్రీ.శ.లో తండ్రి క్లాడియస్ మరణించాడు .శవ యాత్ర లో నీరో గొప్ప ప్రసంగం చేసి ప్రజల మనసు దోచాడు .ఈ ప్రసంగాన్నీ సేనేకా ఏ రాశాడు .క్లాడియస్ పరిపాలనా విశేషాలను ,అతను శాస్త్రీయం గా సాధించిన పురోగమనాన్ని ,వివరించాడు ప్రసంగం లో .అంతఃపురం లో రాజా కుట్రలు సాగుతున్నాయి .నీరో తన మాట వినటం లేదని తల్లి అతన్ని గద్దె  దించటానికి సేనేకా సాయం కోరింది .ఆ స్థితి లో ఆమెకు వ్యతి రేకులు బలం గానే వున్నారు .వాళ్ళను అడ్డు తొలగించ్కునీ ఏర్పాట్లు ముమ్మరం గా చేస్తోంది .నీరో హీరో ను చక్ర వర్తిని చేసేసింది కదా ముందే తన కున్న అధికారం ,ముందు చూపుతో .
                     క్రమంగా పరిస్థితులు మారి పోయాయి .తల్లికి కొడుకు దూరం అవుతున్నాడు .దీన్ని జీర్నిచుకో లేక పోతోంది తల్లి .తన స్వతంత్ర భావాలను ప్రకటించటం ప్రారంభించాడు .దేశం లో మొత్త మొదటి సారిగా ఆటలను ప్రోత్చ హించాడు .తన రధం తానే తోలు కుంటు ,ప్రజల మధ్యకు వచ్చే వాడు .దియేటర్లలో నాటకాలు ఆడే వాడు .కవిత్వమూ చెప్పే వాడు .సర్కస్ ప్రదర్శన ఏర్పాటు చేసి ,ప్రజలంతా వచ్చి చూసే వీలు కల్పించాడు .పై అంతస్తు లోని ప్రజలు కూడా వచ్చి పాల్గొనే టట్లు చేశాడు .గ్రీక్ ,లాటిన్ డ్రామాలను ఆడించాడు .గుర్రపు స్వారీ పోటీలు నిర్వహించాడు .ఆటలు ,క్రీడలు కు ప్రాధాన్యత నిచ్చాడు .ప్రతి అయిదు ఏళ్ళ కోసారి పోటీలు జరిపించే వాడు .ఈ పోటీల వల్ల సంఘం లో నైతిక పథనం ఏర్పడిందని తాక్తికాస్ అనే చరిత్ర కారుడు ఆనాడు .జిమ్నేసియం కూడా ఏర్పరచాడు .దిగంబర పోటీలూ నిర్వహించాడు .సెనెటర్లకు ,నోబుల్స్ కు కూడా అవకాశం కల్పించాడు .ఈ పద్ధతు లన్నీ గ్రీకుల నుండి సంకర మించినవే .నీరోయిక్ పోటీలు అని పిలువ బడే ఈ పోటీలలో గ్లాడియేటర్ పోటీలు అంటే మల్ల యుద్ధాలు లేవు .ప్రశాంత మైన ఆటలకే ప్రాధాన్యత హెచ్చు .హాని చేసే పోటీలు లేవు .పై అంతస్తు జనాన్ని అవమాన పరచటానికే వీటిని నీరో ఏర్పాటు  చేశాడనే విమర్శ వుంది .ఇవన్నీ ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసినవే .క్రీ;శ.65  వరకు నీరో వీటిలో ప్రత్యక్షం గా పాల్గొన్నాడు .ఈ రకం గా సాంస్కృతిక కార్య క్రమాలలో గొప్పమార్పులు  తెచ్చిన హీరో  నీరో చక్ర వర్తి .ఏది చేసినా సేనేకా తో సంప్ర దిస్తూనే వుండే వాడు .
                                     సశేషం
                                                           మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —03 -11 -11 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

1 Response to మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —–2

  1. endukoemo's avatar endukoemo says:

    Manchi amsaalu viluva kaliginavi, telusukuni teeravalasinavi andisthunnadulaku abhinandanalu

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.