మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —-3
rome is burning
కవిత్వం రాయటానికి నీరో ఉత్చాహం చూపించే వాడు .దీని వల్ల గ్రీక్ ,లాటిన కవులకు మంచి ప్రోత్చాహం కలిగింది .తల్లి అగ్రి పీనా మరణం తర్వాత ”నీరోనిమాయే ”కొత్త ఆవిష్కారం గా మారింది . క్రీ..శ.64 జూన్ 18 న రోం లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది .ఆరు రోజులు పాటు సాగింది .రోం లోని 14 ప్రాంతాలలో మూడు పూర్తిగా మాడి బుగ్గి అయ్యాయి .క్రీ .పూ.388 లో గాళ్స్ దాడిలో నష్ట పోయి నంతగా మళ్ళీ రోం అంత నష్టాన్ని పొందింది .దీన్నే చరిత్ర కారులు
Universal cATOSTROPHY ”అంటే ప్రపంచ వినాశనం అన్నారు .కాని నీరో చక్ర వార్తే తగుల బెట్టాడని క్రిస్తియన్లు నమ్మారు .దీనికి మూఢ నమ్మకం తోడైంది .జుడాక్ లో ప్రారంభమై ,మళ్ళీ రోం దాకా అగ్ని వ్యాపించింది .క్రిస్తియన్లను అందర్నీ అరెస్ట్ చేయించాడు నీరో .హింసించాడు ,చంపించాడు .చస్తుంటే విక్రుతానందాన్ని పొందాడు .అందుకే ”రోం తగలడుతుంటే నీరో ఫిడేల్ వాయించాడు ”అనటానికి కారణమైంది .శవాలను కుక్కల పాలు చేశాడు .చీకటి పడ గానే శిలువ వేయించే వాడు .శవాల మంటలే రాత్రికి రోం లో దీపాలు .శవ దీపాలన్న మాట .రధాన్ని నడుపు కుంటూ జనం లోకి వచ్చాడు .రాక్షసానందాన్ని అనుభవిన్చాతానికి .యేసు క్రీస్తు పడ్డ బాధలన్ని నీరో హయాం లో క్రిస్తియన్లు అనుభ వించారు .ఒకే ఒక్క నర రూప రాక్షసుడి వల్ల ,దౌష్ట్యం వల్ల వీళ్ళంతా సమిధల్లా మాడి పోయారు .అప్పుడే
రోమన్ సామ్రాజ్యాన్ని ”క్రీస్తు వ్యతి రేక రాజ్యం ”గా ప్రకటించాడు .దీనితో క్రిస్తియన్లు అంతా ఏకమై నీరో పై పోరాటం చేశారు .
ఇవన్నీ చూస్తూ సేనేక ఒక విషయం తెలిపాడు .”నువ్వు భయ పడే వాడిని నువ్వు ప్రేమించ లేవు .దేవతలు భయ కార కత్వం కలి గించరు .సేనేకా ద్రుష్టి లో చెడ్డ వారికీ మంచే చేయాలి .భార తీయ భావనలో చెప్పినట్లు సూర్యుడు అందరి మీద పక్ష పాతం లేకుండా కాంతిని ప్రసరింప జేస్తాడు అన్నట్లే పాపాత్ముల పైనా ప్రేమను చూపించాలి ..సముద్రం సముద్రపు దొంగలకు కూడా చోటు కల్పిస్తోంది .,.ఇచ్చి ,నష్టం పొందిన దాని కంటే పోగొట్టుకొని ఇవ్వటం చాలా ఉత్తమం, ఉదాత్త మైన విషయం అంటాడు సేనేకా .భూమి కంటే అనేక రెట్లు పెద్దదైన సూర్య గోళం భూమి నుంచి పోషకత్వం పొందు తుంది .సూర్యుడు ప్రాణ శక్తిని ,పోశాకత్వాన్ని భూమికి తిరిగి ఇచ్చేస్తాడు .గుడ్డు పిల్ల గా ఎదగ టానికి కావలసిన పోషణ అంతాలోపలి నుంచే జరుగు తుంది .అలానేప్రపంచం అంతా ఉద్భావన్చిన కాలం నుంచే అభి వృద్ధి బీజం వుంది . మంచిని కనుక్కోవటం చాలా కష్టం .దానికి ఒక నాయకుడు ,ఒక మార్గ దర్శి కావాలి .చెడును గురువు అవసరం లేకుండా నే నేర్చు కో వచ్చు .నైలు నది వరదల గురించి ,భూకంపాలను గురించి ,చాలా శాస్త్రీయం గానే సేనేక చెప్పినట్లు జర్మన్ పండితుడు ,మేధావి” గోథె ” రాశాడు .తోక చుక్కలు ,మెరుపుల గురించీ వివరించాడు సేనేక.గ్రహాలూ లాగానే కామేట్స్ స్థిర మార్గం లో చలిస్తాయి అన్నాడు . .
కొద్ది కాలం లోనే కామేట్స్ గురించి పూర్తి సమాచారాన్ని చెప్ప గల వారు భవిష్యత్ లో వస్తారు అన్నాడు .నీరో కాలం లోనే 211 వ ఒలింపిక్స్ ,క్రీ.శ.65 నుండి 67 కు వాయిదా పడ్డాయి .చరిత్ర లో ఇలా జరగటం అదే మొదటి సారి .సంగీత ,నాటకాలలో ను పోటి పెట్టారు .ఈ రెండింటి లోను నీరో నే మొదటి బహుమతి పొందటం విశేషం .క్రీ.శ.67 నవంబర్ 28 న గ్రీకులకు స్వాతంత్ర్యం ప్రకటించాడు నీరో .
సశేషం
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ .—03 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
గబ్బిట దుర్గా ప్రసాద్

