మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి ——-1
జీవిత విశేషాలు
సేనేకా వేదాంతి క్రీ.పూ.నాలుగు నుంచి క్రీ.శ.65 వరకు జీవించాడు .రోమన్ వేదాంతి గా ,మహా వక్త గా ,విషాదాంత జీవి గా ,రోంసామ్రాజ్యం లో అత్యంత మేధావి గా పేరు పొందాడు .54ad నుంచి 62ad మధ్య కాలమ్ లో రోమన్ సామ్రాజ్యానికి పరోక్ష పరిపాలకుని గా వెలిగాడు .అప్పుడు నీరో రాజు ఇంకా బాలుడే .సేనేకా ధనిక కుటుంబం లో జన్మించాడు .తండ్రి ఏవియస్ -ఉపాధ్యాయుడు .తల్లి హేన్వియ -బాగా చదువుకున్న స్త్రీ .ఆమె పెద్దన్నయ్యే గెలీలియో శాస్త్ర వేత్త .సేనేకా అంటి రోం కు తీసుకుని వెళ్లి మంచి శిక్షణ నిప్పించింది .sexti స్కూల్ లో వేదాంతం చదివాడు .ఆ స్కూల్ లోనే స్టాయిసం పుట్టింది . దీనినే” నియో పైథాగరిజం” అంటారు .ఆరోగ్యం పాడైతే ఈజిప్ట్ చేరాడు ..
క్రీ.షా.31 లో మళ్ళీ రోం లో కాలు పెట్టాడు . రాజకీయాలు ,న్యాయ శాస్త్రం లో నిష్ణాతుడు అయాడు .రోం చక్ర వర్తి ”కాలిగులా ”చేస్తున్న తప్పులన్నీ బయట పెట్టె వాడు .చక్ర వర్తి కి చావు దగ్గరకు వస్తూండటం తో ఏమీ చేయ లేక పోయాడు .క్రీ.శ.41 లో రాకుమారి ”జూలియ విలియ”తో వ్యభిచారించాడనే ఆరోపణతో ,దేశ బహిష్కారానికి గురైనాడు .ప్రకృతి శాస్త్రం ,వేదాన్తాలను బాగా కాచి వడపోసి గొప్ప వాడైనాడు” consolations ” అనే మూడు ఉద్గ్రంధాలు (tritain ) రాశాడు .చక్ర వర్తి భార్య ”అగ్రిపీనా ”అభ్యర్ధన పై మళ్ళీ రోం కు చేరాడు .క్రీ/శ.50 లో praetor అయాడు .”పామ్పియా పాలినా ”ను వివాహం చేసు కున్నాడు .నెమ్మదిగా బాలనీరో కు గురువు అయాడు .క్రీ.శ.54 లో క్లాడియన్ హత్య తో సేనేకా ,అతని స్నేహితుడు బర్స్ ఇద్దరు అధికార ప్రాభవం సంపాదించారు .వీరిద్దరి స్నేహితులు అంతా కలిసి ఒక శైనిక సమూహాన్ని తయారు చేసి ,జర్మన్లను ,పార్దియన్లను అదుపు లోకి తెచ్చి సామ్రాజ్యాన్ని కాపాడారు .
చక్ర వర్తి నీరో మొదటి ఉపన్యాసాన్ని సేనేకా నే తయారు చేశాడు .అందు లో రోమన్ సెనేట్ కు స్వేచ్చ ను ప్రకటించాడు .నీరో పై తల్లి అగ్రి పీనా ఆధిపత్యం ఎక్కు వై పోయింది .రోమన్ సామ్రాజ్య స్థితి గతులు ,సేనేకా ,బార్స్ లకు బాగా ఆకళింపు అయాయి .బానిసల మీద మాన వత్వం తో ప్రవర్తించే శాసనాలు ప్రవేశ పెట్టించారు .ఆర్ధిక ,న్యాయ విషయాలలో ప్రజలకు అను కూలంగా సంస్కరణలు తెచ్చాడు సేనేకా …సేనేకా ప్రతినిధి అయిన ”కార్బులో ”పార్దియన్లను ఓడించి ,రాజ్యానికి స్థిరత్వం కల్పించాడు .అప్పటి దాకా వున్న అంతర్యుద్ధంపూర్తిగా అణగి పోయింది .క్రీ.శ.59 లో నీరో తన తల్లి ని హత్య చేశాడు .దీన్ని సేనేకా బాహాటం గానే ఖండించాడు .బార్స్ మరణించాడు .అది సేనేకా ను కలచి వేసింది .పదవీ విరమణ చేశాడు .ఆ తర్వాత అత్యున్నత స్థాయి వేదాంత గ్రంధాలు రాశాడు .సేనేక శత్రువులు ,అతనిపై ,”పిసో ”అనే వాడితో కలిసి కుట్రకు తోడ్పద్దాడని రాజా ద్రోహ నేరం మోపి ,ఆత్మ హత్య చేసుకోమని హుకుం జారీ చేయించారు నీరో తో .అలాగే కత్తితో కాలు కోసుకొని రక్త స్రావం తో మరణించాడు సేనేకా వేదాంతి .ఆ వివ రాలు తరువాత తెలుసు కుందాం .
రచనలు
సేనేకా రాసిన ”క్లాడియాన్ జీవిత చరిత్ర ”గొప్ప గ్రంధం గా పేరు పొందింది .అలాగే కొడుకు చని పోయిన తల్లిని ఓదార్చే consolations ఉత్తమ రచన గ గుర్తింపు పొందింది .స్టాయిజం సిద్ధాంత కర్తల జీవితాలు ,రచనల పై సాధికారం గా Devitis ,Devita ,Beata అనే అత్యుత్తమ గ్రంధ రచన చేశాడు సేనేకా .విషాదాంత రచనలు (trajedies )పది రాశాడు .staayk వేదాంతం సేనేకా ను నిత్య స్మరనీయున్ని చేసింది .
స్టాయిసిజం( Stoicism )
అసలు స్టాయిసిజం అంటే ఏమిటో ముందు తెలుసు కుందాం .ఇదొక వేదాంత విధానం .గ్రీకో -రోమన్ నాటిది .ఇందులో విధ్యుక్త ధ్రర్మం( డ్యూటీ)కి ప్రాధాన్యత ఎక్కువ .హేతువు (Reason )తో విశ్వాన్ని అర్ధం చేసు కోవాలి .విధి బలీయం .ప్రపంచం లో జరిగే వాటిని ప్రశాంత చిత్తం తో అనుభవించాలి .స్తాయిజం సిద్ధాంతాన్ని క్రీ.పూ.300 లో ”జీనో అఫ్ సిటియం ”ప్రతి పాదించి ,ఉద్యమం గా నడిపాడు .అది 200 ad వరకు బ్రతికింది .మనిషికి ఆరోగ్యం ,సంపద మాత్రమే అవసరం కాదు .పరంపరగా వస్తున్న నైతిక సిద్ధాంతాలపై విరుచుకు పడ్డ సిద్ధాంతంఇది .సుఖము ,శాంతి మనిషికి చాలా ముఖ్యం .ధర్మం లేక సన్మార్గం (Virtue ).
అధర్మం లేక దుర్మార్గం (Vice )అనేవే మంచి ,చెడు .సన్మార్గం లాభదాయకం .దుర్మార్గం అపాయ కరం .మిగిలిన వన్నీ వీటి తర్వాతే .ఆనందం ,దుఖం అనేవి పుట్టుక ,పెంపకం మీద ఆధార పడి వుండవు .ధర్మంగా వుంటే అంతా మంచే జరుగు తుంది .జాతి ,స్థితి (హోదా ),లింగ భేదాలకు అతీతం గా వుండే సిద్ధాంతం ఇది .Ethical Docrine was the core of Stoicism ‘అంటారు .అంటే నీతి సిద్ధాంతమే ఇందులో అతి ముఖ్య మైన భాగం .ఇది పాశ్చాత్య నాగరకత పై గొప్ప ప్రభావం కల్గించింది .,సేనేకా ,ఎపిక్తకస్ ,మార్క్ ఆరిలాస్ అనే ముగ్గురు ఈ సిద్ధాంతాన్ని ,బాగా వ్యాప్తి చేశారు .సిసిరో కాలానికి స్టాయిసిజం బాగా తగ్గి పోయింది .క్రమంగా స్టాయిసిజం లోప్లాటో నిజం కలిసి పోయింది ..
సశేషం
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —03 -11 -11 .

