మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి —-4
మరణం తో సమరం
నీరో సృజనాత్మక కళ లో ప్రతిభా వంతుడు .కవి ,చిత్ర కారుడు ,శిల్పి కూడా .ఏది చేసినా చాలా ఉన్నతం గా ఉండేవి .ఏది నిర్మించినా అంతే స్థాయి వుండేది .అతను రాసిన ”ఫెయిర్ పారిస్ ”కవిత ప్రశంస నీయం అంటారు .రోం చరిత్ర మీద మహా కావ్యం రాశాడు .వయసు పెరిగిన కొద్దీ సెనేట్ ను చులకన చేయటం ప్రారంభించాడు .సేనేకా పదవీ విరమణ చేసిన తర్వాత ,రాజకీయాలపై శ్రద్ధానూ ,తగ్గించు కొన్నాడు .క్రీ.శ.67 లో మిలిటరీ కమాండర్ల శిబిరం లో తిరుగు బాటు జరిగింది .పిచ్చ కోపం వచ్చి ,సేనేటర్లను ,గవర్నర్లను హత్య చేయించాడు .రోం నగ రాన్ని తగుల బెట్టించాడు .అడవి జంతువుల్ని వదిలేయించాడు జనం మీదకు .ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డాడు .ఆయుధాలు దరించ కుండా సైన్యాధి కారి దగ్గరకు వెళ్లి ఏడ్చేశాదట . .మృతులకోసం ఆడాడు .పాడాడు .తనకు ఒక గవర్నర్ పదవి ఇస్తే చాలు అని ప్రాధేయ పడ్డాడట . తాను లేకుంటే రోం కు చాలా నష్టం అన్నాట్ట .తన లాంటి కళా కారుడు మళ్ళీ దొరకడు అని సుత్తి కొట్టాడట .అతన్ని పట్టు కుందామని ప్రయత్నిస్తే దొరక్కుండా తప్పించుకొని ”ఇప్పటికే చాలా ఆలస్యమై పోయింది ”అను కుంటు కత్తి తో పొడుచుకుని చచ్చాడునీరో .పొగరు ,గర్వం అంతా జీరో అయి పోయాయి .చరిత్రలో క్షుద్రుడు గా మిగిలి పోయాడు పాపం .రోమన్ సమాజాన్ని సర్వ నాశనం చేసిన పాపం అంతా నేరో దే .అత్యుత్తమ మైన విలువలన్నిటినీ రూపు మాపాడు .నీచం గా ప్రవర్తించి ,స్వంత తల్లి నే హత్య చేసిన పరమ కిరాతకుడు అని పించుకున్నాడు .చివరికి అధికారాన్ని పోగొట్టుకొని నీరో హీరో జీరో అయాడు .అతని పాలన రోమన్ సామ్రాజ్యానికి ఒక పీడ కల అని పించాడు .చరిత్ర హీనుడు అని పించుకున్నాడు .ఇదీ సేనేకా వేదాంతి శిష్యుడైన నీరో దుస్థితి .
ఇప్పుడు గురువు సేనేకా మరణ ఉదంతాన్ని చూద్దాం .సేనేకా కు ఉబ్బస వ్యాధి వుంది .చావుకు భయ పడ రాదనీ ఆయన భావన .”చని పోయిన వాడి స్థితి పుట్టబోయే బిడ్డ స్థితి వంటిదే ”అంటాడాయన .చావు కూడా ఒక దశ మాత్రమే నని అభిప్రాయ పడ్డాడు .శాశ్వతత్వం ఒక కల మాత్రమే న్నాడు ..అప్పటికే వయసు 70 ..”ఆన్ గుడ్ డీడ్స్ ” పుస్తకం రాస్తూ ”ఒక క్రూర నియంతను చంపటం ,అతనికి ,ప్రజలకు మేలే చేస్తుంది-చాలా అరుదైన సందర్భాలలో .నీరో చావూ అలాంటిదే .”అన్నాడు శిష్యుడైన నీరో గురించి .క్రీ.శ.62 వరకు ఇద్దరు జిగినీ దోస్తులే .తరువాత బద్ధ విరోదులైనారు .తల్లిని ,సోదరున్ని చంపిన నీరో కు గురువు సేనేక అడ్డం వచ్చాడని పించింది .ఇది తెలుసుకున్న సేనేకా తన చావు తన ఇష్టం ప్రకారం జరిగే ఏర్పాట్లు చేసు కున్నాడు .భర్త తో పాటు తానూ చస్తానంది భార్య.”నీ జీవితాన్ని సహనం తో ఎలా సాగించాలో నేను నీకు నేర్పాను .కాని నువ్వు గౌరవాత్మకం గా ,నాతొ సహగమనం చేసి ,ఆదర్శం గా వుండాలను కోవటం మంచిదే .ఇద్దరం ఇదే ధృఢ సంకల్పం తో ,ధైర్యం గా మరణిద్దాం ”అని చెప్పాడు భార్య పాలీనా కు సేనేక.
ఇద్దరు ఒక గది లో కి చేరారు తమ ఇంటిలో .ఒకే ఒక కత్తి వేటు తో ఇద్దరూ ,రక్త నాళాలను తెగ కొట్టు కున్నారు .సేనేకా తన మోకాళ్ళు ,కాళ్ళ నాళాలు తెగ కోసుకున్నాడు .బలహీనుడు ,తగినంత ఆహారం లేక కృశించిన వాడు అయినందున రక్తం చాలా నెమ్మది గా కారు తోంది .తన బాధ చూసి భార్య తట్టు కో లేక పోతోందని తెలిసి ఆమెను పక్క గది లోకి వెళ్ళ మన్నాడు .ఇంకా మాట్లాడే శక్తి వుండటం తో తన సందేశాన్ని చెబుతూ ,శిష్యుడి తో రాయించాడు .అది సేనేకా మరణం తర్వాత ప్రచు రించ బడింది . .నీరో కు సేనేకా మీదే కోపం గురు పత్ని పాలీనా మీద కోపం లేదు . .ఇక్కడి విషయాలు వేగుల వాళ్ల ద్వారా తెలుసు కొని సైనికులను పంపించి పాలీనా ను కాపాడాడు .దోషులను శిక్షించటానికి తన దగ్గర దాచుకున్న విషాన్ని .కొంత ఇప్పుడు అతను తాగాడు .మిగిలిన విషాన్ని డాక్టర్ ద్వారా పారేయించాడు-ఇంకెవరికి ఉపయోగ పడ కుండా .అప్పటికే సేనేకా శరీర భాగాలు మొద్దు బారి పోయాయి .
అతన్ని పాపం విషం కూడా ఏమీ చేయ లేక పోయింది .వేన్నీళ్ళ తొట్టెలో స్నానం చేశాడు .కొంత నీటిని”జూపిటర్ లిబెరేటార్ ” దేవతకు అర్ఘ్యం గా సమర్పించాడు .తర్వాత శిష్యులు ,ఆవిరి స్నానం చేయించారు .అందులో ఊపిరి ఆడకుండా ఉండేట్లు చేయించుకొని ఊపిరి తీసుకొని చని పోయాడు వేదాంతి సేనేకా .ఏ విధ మైన రాచ మర్యాదలు లేకుండా సేనేకా అంత్య క్రియలు జరిగాయి .
ఒకసారి సింహావలోకనం చేద్దాం .సేనేకా కు ఇష్టమైన దర్శనం స్టాయిసిజం .అది ఒక వైఖరిఅని ,అది చాలా ముఖ్య మైనదని అతని భావం .మనతోనే ఏదైనా ప్రారంభించాలి అని అతని సిద్ధాంతం .మనకు వచ్చే భావాలతో మనం జీవిత నాణ్యత ను పెంచుకోవాలి .ఆ తర్వాత ఇతరులకు ఏదైనా బోధించాలి .సేనేకా అసలు స్పైన్ దేశస్థుడు .తర్వాత రోం చేరాడు .అనర్గల వాగ్ధాటి వున్న వాడు .శాస్త్ర ,సాహిత్య ,అలంకార ,వేత్త .గొప్ప రాజా నీతిజ్ఞుడు .వేదాంతి.నాటక రచయిత .దీనికి మించి గొప్ప కవి .సేనేకా యేసు క్రీస్తు సమకాలికుడు .రాజుల ,అధికారుల ,రాజా బంధువుల అవినీతిని వ్యతిరేకించి ,పతన మవు తున్న గ్రామీణ వ్యవస్థను కాపాడ టానికి యోధుడు గా పోరాడి నూత్న దృక్పధం లో ,జీవించిన మానవీయ మూర్తి ,స్టాయిసిజం వేదాంతి సేనేకా .
సంపూర్ణం
మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ —04 -11 .11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master
Sivalayam Street
Vuyyuru
Krishan District
Andhra Pradesh
India
phone : 08676-232797
958676-232797
Cell : 9989066375

