నిమ్బార్కర్ ఆచార్యుడు
వేద వ్యాసుడు రచించిన ”బ్రహ్మ సూత్రాలు ”కు వ్యాఖ్యానం రాసిన మహా పండితుడు నిమ్బార్కరాచార్యుడు .ఆయన తెలుగు వారు అవటం తెలుగు వారి అదృష్టం .ఆయన జీవిత కాలమ్ పై చాలా వివాదాలున్నాయి .కానీ విశేష పరిశోధన లు జరిగిన తర్వాత ఆయన కాలమ్ కొంత వరకు స్పష్టమైంది .కొందరి భావన లో ఆయన శంకరాచార్యులకు పూర్వుడని ,కొందరి ఆలోచన లో మాధవా చార్యులకు ముందు వాడు అని అంటారు .కాని ఇవేవి నిజం కాదు అని అభిప్రాయ పడ్డారు .భగవద్రామానుజా చార్యులకు సమ కాలీనులు అన్నది కొంత వరకు నిజం గా కన్పిస్తోంది .క్రీ శ .పదమూడో శతాబ్ది వాడు అని స్థూలం గా భావించ వచ్చు వీరి గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువ గానే వున్నాయి .అందులో ఆంధ్రులు మన వాడే ఆయన అని మర్చి పోయారు కూడా అందుకే ఆయన జీవిత విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను .కనీసం ఒక సారి అయినా అలాంటి మహా మహుల్ని స్మరిస్తే మన జీవితం ధన్య మవుతుంది .మన తెలుగు వాడు ఇంత గొప్ప వాడా అని ఆశ్చర్యం వేస్తుంది .అందులో కార్తీక పూర్ణిమ నాడు నిమ్బార్కర్ జన్మించటం వల్ల మూడు రోజుల్లో కార్తీక పున్నమి వస్తోంది కనుక ఈ వ్యాసం రాయాలనే సంకల్పం కలిగింది ..ఇప్పుడుమహా మహితాత్మమైన నిమ్బార్కరు పండితుల జీవిత విశేషాలను గురించి తెలుసు కుందాం
జీవిత విశేషాలు
నిమ్బార్కర్ అనే పేరు ఆయనకు చాలా కాలమ్ తరు వాత మాత్రమే వచ్చింది .ఆయన శ్రీ మహా విష్ణువు ”సుదర్శన చక్రం ”అవతారమే అని ”భవిష్య పురాణం ”లో వుంది .కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయన జన్మించి నట్లు తెలుస్తోంది .క్రీ;శ.3096 లో జన్మించినట్లు గా భావిస్తున్నారు .తల్లి పేరు భారతి .తండ్రి అరుణ .తెలగాణ్య శాఖ కు చెందిన బ్రాహ్మణుడు .గోదా వారి నది (దేవ నది )ఒడ్డున వైడూర్య పట్టణం లో ఆయన జన్మించారు .తల్లి దండ్రులు పెట్టిన పేరు ”నియమానంద ”.పదహారవ ఏటనే వెద ,శాస్త్రాలలో అద్వితీయుడైనాడు .ఉత్తర ప్రదేశ్ లోని మధుర కు వెళ్లి గోవర్ధనా చార్య దర్శనం చేశారు .ద్వైత వేదాంతాన్ని నేర్చారు గురువు వద్ద ..చదువు అంతా నిమ్మ చెట్టు క్రింద నేర్వటం ఆయనకు ఇష్టం గా వుండేది .ఈయనశ్రద్ధ , ,ఆసక్తులను గమనించిన నారద మహర్షి ”ద్వైతాద్వైత వేదాంతం ”బోధించాడు .అంటే ద్వంద్వం లో ఏకత్వ భావన అని అర్ధం .నియమానందుడు నారదుణ్ణి తనను శిష్యునిగా స్వీకరించ మని కోరాడు .వైష్ణవ సంప్రదాయం లో ,శ్రీ సర్వేశ్వర దేవుల అనుగ్రహం తో శిష్యునిగా స్వీకరించాడు .నారదుడు ”హరిప్రియ ”అనే పేరు పెట్టాడు .మహా మంత్రమైన ”గోపాల మంత్రం ”ఉపదేశించాడు .ఇది ”గోపాల పిని ఉపనిషత్ ”లో వుంది .నియమా నంద గోపాల మంత్రాన్ని తీవ్రం గా జపించాడు .అప్పుడు ఆయనకు ”గోపాల దేవుడు ”రాదా కృష్ణ ”రూపం లో దర్శనం ఇచ్చాడు .తానే శ్రీకృష్ణుడి నని తెలియ జేశాడు .నియమానండుడే ”సుదర్శన చక్రం ”అనే ఎరుక కల్గించాడు .రాధాకృష్ణ వేదాంతాన్ని ప్రచారం చేయమని ఆదేశించాడు .
గోవర్ధన అని పిలువ బడే ;;నింబ గ్రామం ”లో ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు నియమానందుడు .ఒక రోజున బ్రహ్మ దేవుడు చీకటి పడుతుండ గా ,శిష్యుని వేషం లో ఈయన దగ్గరకు వచ్చాడు .ఇద్దరు వేదాంత చర్చ చాలా సేపు చేశారు .బ్రహ్మ ,నియమానందుని చేతి లో ఓడి పోయాడు .చీకటి బాగా పడింది .ఏదైనా ఉపాహారం స్వీకరించమని శిష్యుడైన బ్రహ్మను కోరాడు .చీకటి పడిన తర్వాత ఏదీ స్వీకరించ రాదు అన్నాడు మాయా బ్రహ్మ .ఉపాహారం తీసుకోక పొతే ఆతిధ్యం ఇచ్చే వారికి ఫలితం దక్కదని తెలియ జేసి ,అర్కుడు అంటే సూర్యుడిని నిమ్మ చెట్ల మధ్య స్తంభిప బడేట్లు చేశాడు నియమానందుడు .చీకటి పడటం ఆగి పోయింది .అప్పుడు ఈయన ఇచ్చిన ఆతిధ్యం బ్రహ్మ స్వీకరించాడు .ఆతిధ్య ఫలితం నియమనండునికి దక్కింది .నియముని భక్తి శ్రద్దలకు వివేకానికీ ,మహిమకు విజ్ఞత కు బ్రహ్మానంద పడ్డాడు బ్రహ్మ .నిజ రూపం ప్రదర్శించాడు నలువ .నింబ వృక్షాల మధ్య సూర్య గమనాన్ని ఆపివేయటం వల్ల నియమానందునికి బ్రహ్మ ”నిమ్బార్కర ”అనే బిరుదు ప్రసాదించాడు .అప్పటి నుంచి నిమ్బార్కర అనే పేరు స్థిరమైంది .
ఆయన ప్రవచించిన ద్వైతాద్వైత వేదాంతం లో మోక్షానికి అయిదు సోపానాలు చెప్పాడు .అవి కర్మ ,విద్య ,ఉపాసన ప్రపత్తి ,,గురూప పత్తి .ఆయన రచించిన ‘బ్రహ్మ సూత్రా భాష్యానికి ‘వేదాంత పారిజాత సౌరభం ”అని పేరు .తన సిద్ధాంతాన్ని ”దశ శ్లోకి ”అనే పది శ్లోకాలలో నిక్షిప్తం చేశాడు నిమ్బార్కరా చార్యుడు”సావి శేష ,నిర్విశేష శ్రీ కృష్ణ రాజా స్తవం ”అనే పేర ఒక స్తోత్ర గ్రంధాన్ని నిమ్బార్కర్ రచించారు . .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

