నిమ్బార్కర్ ఆచార్యులు —2
నిమ్బార్కర్ వేదాంత దర్శనం
నిమ్బార్కర్ దర్శనం లో మూడు తత్వాలు వున్నాయి .అవి చిత్ ,అచిత్ ఈశ్వరుడు .వీటినే భోక్త ,భోగ్యం ,శ్వేతాశ్వ తరం అంటారు .ఆయన దృష్టి లో శ్రీ కృష్ణుడే పర తత్త్వం .ఆయన సర్వ నియంత .ఆయన కంటే అధికులు లేరు .నిమిత్తము ,ఉపాదాన కారణం కృష్ణుడే .పరబ్రహ్మానికి పర (transcendent ),అంతర్యామి (Immanent )అనే రెండు రూపాలున్నాయి .పర రూపం లో పరబ్రహ్మ ప్రపంచం నుండి వేరుగాను ,అంతర్యామి రూపం లో అభిన్నం గాను ఉంటాడు .ప్రపంచం పరమేశ్వరుని శక్తి నుంచి ఏర్పడింది .పర,అంతర్యామిత్వాల సమతుల (balance )స్థితి ఏ ప్రపంచానికి కారణం .ఈ రెండు సమాన ప్రాధాన్యత కలవే .పరబ్రహ్మ ప్రపంచరూపం లో వున్నా ,,ఆయన ప్రపంచానికి అతీతుడు .ప్రపంచం లేకుండా బ్రహ్మ లేడు .
జీవాత్మ —నిమ్బార్కర్ భావన లో జీవుడు జ్ఞాన స్వరూపుడు .అతడు శరీరము ,ఇంద్రియాలు ,ప్రాణము ,మనస్సు ,బుద్ధి వీటికి భిన్నుడు .జీవాత్మ జ్ఞానానికి ఆశ్రయం కూడా .అంటే జ్ఞానమే ధర్మం గా వున్న వాడు .జీవాత్మకు ఆది అంతం లేవు .పరబ్రహ్మ అంశమే జీవాత్మ .అందుకే పరబ్రహ్మ కన్న ,భిన్నుడు ,అభిన్నుడు కూడా .అనేక జీవాత్మలు వున్నా ,అన్నీ పరబ్రహ్మ అంశాలే .జీవాత్మకు ఎనిమిది గుణాలున్నా ,అవిద్య వల్ల తెలుసు కో లేక సంసారి అవుతాడు .జీవాత్మ అణువు లాంటి వాడు .అంటే అతి అల్పమైన వాడు .కాని తాను చేసే ధర్మం అనే జ్ఞానం వల్ల సుఖం ,దుఖం అనుభ విస్తాడు .
జగత్తు —దీనినే అచిత్ అంటారు .ఇది మూడు విధాలు .ప్రాకృతం ,అంటే కేవల సత్వం ,రెండు అప్రాక్రుతం అంటే ప్రకృతి చేత ఎర్పదనిది .మూడ వది కాలము .ఇది ప్రకృతి ,పరబ్రహ్మ ల చేత ప్రేరితం అయి ప్రపంచానికి ఉపాదాన కారణం అవుతోంది .ప్రపంచం అంటే పరబ్రహ్మ చేసే కృత్యం .అది నిత్యం ,సత్వ ,రాజా ,తమో గుణాత్మికం .
ప్రపంచోత్పత్తి —-పరమాత్మ ,ఆకాశం ,వాయువు ,అగ్ని ,జలం ,పృథ్వి అన్నీ పరబ్రహ్మం నుండే ఏర్పడ్డాయి .
బ్రహ్మం ,చిత్ ,అచిత్ —వీటి మధ్య వున్నది భేదా భేదం అంటాడు నిమ్బార్కరుడు .బ్రహ్మ నియంత ,చిత్తు భోక్త ,అచిత్ భాగ్యం .బ్రహ్మము అంశి జీవుడు అంశము .ఈ రెండు వేరు కావు .బ్రహ్మాన్ని ఉపాశించాలి .దాన్ని అందు కోవాలి .జీవుడు జ్ఞాత ,ఉపాసకుడు ,ప్రాప్త అంటే పొందే వాడు .వీరిద్దరి మధ్య భేదం తప్పదు జీవాత్మ అవిద్యావిషయం కాని ,అవిద్యా పదం కాని కానేరదు .అయితే బ్రహ్మం మాత్రం పాప రహితం ,సత్య కామం ,సర్వ వ్యాపి .బ్రహ్మం నిత్యం ఎదురు లేనివాడు అతడు పురుషోత్తముడు .
బ్రహ్మము కారణం .జగత్తు కార్యం అంటాడు నిమ్బార్కర పండితుడు .బ్రహ్మ చైతన్య స్వ రూపం .అస్తూలం ,అనణువు .,నిత్య శుద్ధం .బ్రహ్మము నియంత అయితే జగత్తు నియమిమ్పబడేది .జీవాత్మ ,జగత్తుబ్రహ్మ అంశాలే . బ్రహ్మ కన్న భిన్నాలు గా కని పించినా ,అభిన్నాలే , .కార్యము ,కారణం ,అంశములు ,అంశి కేవలంభిన్నాలు కావు ,అభిన్నాలు కావు .వాటి మధ్య వున్నది భేదా భేద సంబంధము .సూర్యుడికి ,ఆయన కాంతికి మధ్య వున్న సంబంధం లాంటిదే బ్రహ్మానికి ,జీవునికి ,జగత్తుకు వుంది .భేదం ,అభేదం కూడా సమాన సత్యాలే .స్వాభావికాలే ..
మోక్షం —నిమ్బార్కర్ భావనలో మోక్షం అంటే జీవాత్మ స్వభావం లోను ,గుణాలలోను పరబ్రహ్మము తో సామ్యన్న్ని పొందటమే .ఆ పరబ్రహ్మ బ్భావం పొంద టానికి పరబ్రహ్మ అనుగ్రహము ,ప్రసాదమే శరణ్యం.మోక్ష సాధనకు కర్మ ,జ్ఞానం ,ఉపాసన ,భక్తి ,ప్రపత్తి ,గురూప పత్తిఅనే ఆరు సాధనాలను చెప్పాడు నిమ్బార్కరాచార్యుడు .
కర్మ –కర్మ మోక్షానికి ప్రత్యక్ష సాధనం కాదు .జ్ఞానానికి మార్గం .విధ్యుక్త కర్మ అందరు తప్పని సరిగా చేయాలి
జ్ఞానం లేక విద్య —విద్య వల్లనే పరబ్రహ్మను పొంద గలం .విద్య స్వతంత్ర సాధనం .
ఉపాసన లేక ధ్యానం –ముముక్షువు కళంక రహిత మైన ఆత్మను ఉపాశించాలి .పరమాత్మ భావన పొందిన ఆత్మను ఉపాశించటం ఉత్తమం
భక్తి –భక్తి ,ఉపాసన ఒకటి కావు .సాధకునికి ఈశ్వరుని యందు ప్రేమయే భక్తి .భక్తి ,,ధ్యానం,పరస్పర సంబంధం కలవి .భక్తి మోక్షానికి గొప్ప సాధనం .పరమేశ్వర ప్రసాదం వల్లనే ఇది పొంద బడుతుంది .
ప్రపత్తి –ఇదంతా విశిష్టా ద్వైత విధానం లాగానే వుంటుంది .
గురూప పత్తి —ప్రపత్తి రెండు రకాలు .ఒకటి ఈశ్వరుని గురించి రెండు ఆచార్యుడైన గురువు ను గురించి .జీవాక్త్మకు ,పరమాత్మకు మధ్య వర్తి గురువు .జీవాత్మ గురు అనుగ్రహం వల్లే పరమాత్మను పొంద గలడు .తన మనసు ,ధనము ,ఆత్మ ను గురువు అధీనం లో ఉంచాలి .పరమేశ్వరుని గురించి ప్రపత్తి వుంటే మోక్షం వస్తుందో రాదో చెప్ప లేము .కాని గురువు ప్రసన్నతను పొందితే అలాంటి సందేహం వుండదు .
సమాప్తం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

