ముదిమి లోను యౌవనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –1
ఆయన 88 ఏళ్ళ వృద్ధుడు .వృద్ధాప్యం రెండో బాల్యం అన్నారు కదా .అందుకని బాలుడే .అయితే ,ఆయన నిత్య జీవితం క్రియా , శీలత్వం ,సామాజిక సేవ ,నిరంతర పథనం ,రోజుకు కనీసం పన్నెండు గంటల రచనా వ్యాసంగం ,ఈ వృద్ధాప్యం లో ,గమనిస్తే ,ఆయన నిత్య యౌవనుడు గా కని పిస్తారు .ముఖం పై ముడుతలు వచ్చినా ,కళ్ళు తెల్లబడు తున్నా,అందులో విజ్ఞాన జ్యోతి ప్రకాశించటం ,ప్రసరించటం చూస్తాం .ఒక రాజకీయ నాయకుడో ,సంఘ సంస్కర్తో ,సామాజిక కార్య కార్తో ,ఉత్తమ ఉపాధ్యాయుడో ,నిర్వహించ వలసిన కార్య క్రమాలను అన్నిటినీ ,తానొక్కడే ,కొద్ది మంది సహాయం తో,నిర్వహించిన ,అనుక్షణ కార్య కర్త ,.ఆ నిర్వహణ లో అలుపు లేదు ,విశ్రాంతి లేదు .అకుంతిత దీక్ష ,సమాజ సేవా తపన ఉత్తమ బోధ నందిన్చాలన్న ఆరాటం ,తన చుట్టూ వున్న సమాజం తన తో పాటు అన్ని రంగాల్లో అగ్రగామి గాఉండాలన్న ఆకాంక్ష ,సంపూర్ణ వికాసం తో ,జీవితాలు వెలగా లన్న దృఢ సంకల్పం ఆయన్ను ,ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిలబడేట్లు చేసింది ..సమాజం లో అన్ని వర్గాలు ,కులాలు ,ఆబాల వృద్ధులు తన వాళ్ళే అనే విశాల దృక్పధం ,ఆయన్ను అందరి కంటే అగ్రేసరుడిని చేసింది .ఆయన సాధించిన విజయాలు ఇన్నో ,అన్నో కావు .ఎక్కడ ఏ పరిస్థితులలో సమాజానికి తాను అవసరమైతే అక్కడ ఆయన ప్రత్యక్షం .నీతికి ,నిర్భీతికి,పేరుగా నిలిచి ,వ్యక్తిత్వం తో ,జీవితాన్ని పండించుకొని ,”బహుజన హితాయ -బహుజన సుఖాయ ”గా జీవితం గడుపుతూ ,అందరిని ప్రేమ ,ఆప్యాయత ,మమతాను రాగాల తో ,తన వాళ్ళను చేసు కోని ,తన వాక్కే వేద వాక్కు గా అందరు భావించే స్ఫూర్తిని కలుగ జేసి సకల కళా రహశ్యాలను అవగాహన చేసుకొని,ఇతరులకు తెలియ జెప్పి ,పెద్దన్నగా ,గుర్తింప బడి ,తాను చేసిన దేదో ,మహత్కార్యం అనీ ,సమాజ సేవ అనీ భావించక ,అదొక మానవ ధర్మంగా ,కనీస విధిగా భావించి ,తన మార్గాన తాను నడుస్తూ ,ప్రేరణ పొందిన వారిని తనతో కలుపు కొంటు ,ద్వేషం ,అసూయ ,అహంకారం కోపతాపాలకు ,అతీతం గా ,అజాత శత్రుత్వం తో ,వ్యవహరిస్తూ ,తాను నమ్మిన ”రాముని ”బంటు గా వ్యవహరిస్తూ ,కుటుంబానికీ ,గ్రామానికీ ,పరిసర ప్రదేశాలవారికీ ,తలలో నాలుక గా నడుస్తూ ,పెద్దరికాన్ని నిల బెట్టు కుంటు ,ఆదర్శం లో ,ఏమాత్రం అటు ఇటు లేక నవ్య ,సవ్య పదగామి గా వుంటూ ,బాల సాహిత్యసేవ లో ధన్యులై ,యువకులకు ఉత్చాహ పాత్రులై ,తోటి ఉపాధ్యాయులకు ఆదర్శ మూర్తి యై ,విశ్రాంత ఉపాధ్యాయులైనా ,అవిశ్రాంత కృషి చేస్తున్న వారు ,కర్మ యోగి ,క్రియా శీలి ,”బాల సాహిత్య చక్ర వర్తి ,మాన్యులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు .
శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిది ఓకే ప్రత్యెక స్కూల్ అఫ్ థాట్ .ఆయన ఒక విశ్వ విద్యాలయం .knowledge pool జ్ఞాన ఖని .విశుద్ధ మనస్కులు .నిరామయ జీవి .నిర పేక్ష కార్య శూరుడు .ఆయనజీవితాన్ని అర్ధం చేసు కోవ టానికి ,ఆయన వివిధ దశల్లో చేబట్టిన కార్య క్రమాలనుపరామర్శించాతానికి , ,ఆదర్శ శిఖరా రోహనం చేయ టానికీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందే .ఆయన రచనా శైలి ,నిరాడంబరం .,మెత్తని పూల మీద నడుస్తున్నట్లుంటుంది . .ఏది చెప్పినా సుతి మెత్త గా ,సూటిగా మనసుకు తాకేట్లు చెప్పటం ఆయన ప్రత్యేకత .పదాడంబరం వుండదు .ఎక్కువ తక్కువలుండవు .అతిశయోక్తులకు దూరం .యదార్ధ వాది-కాని లోక విరోధి మాత్రం కాక పోవటమాయన ప్రత్యేకత .అదే ఆయన విశిష్ట వ్యక్తిత్వం .ఆయన కార్య క్రమాలను ,,జీవితం తో అనుసంధానం చేస్తూ ,వివిధ దశల లో వింగడించి తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 —11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
http://wp.me/p1jQnd-rh
http://wp.me/p1jQnd-rh



