ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6 నూజి వీడు సంచలనం

         ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6
                                                                     నూజి వీడు సంచలనం
                       1967 లో అద్దాడ నుంచి నూజివీడు బదిలీ అయారు  రావు గారు .షరా మామూలే .77 ఏళ్ళ స్కూల్ చరిత్రలో లేని ”బాల ప్రతిభ ‘అనే స్కూల్ magazine  తయారు చేయించి ప్రచురించారు .నూజివీడు రాజా ఏం .ఆర్ .అప్పా రావు వీరి సేవా కార్య క్రమాలకు అండ గా నిలిచారు .”బాల సాహిత్య acaademi ”స్థాపించి చిన్నారి గూఢ చారి ,మహా కవులు ప్రచురించారు ”.విద్యానగర్ ”కాలనీ ఏర్పాటు చేశారు .అక్కడ ”శాంతి నిలయం ”నిర్మించి విద్యా ,సాహిత్య ,సాంఘిక ,సాంస్కృతిక సేవ సేయటం మొదలు పెట్టారు .ఊపు ఏమీ తగ్గ లేదు .చేసే చెయ్యి ,తిరిగే కాలు ఊరుకో లేవు కదా ..అయినా ఏమీ మార లేదు .కొత్తగా ఏర్పడిన జూనియర్ కాలేజి లోలెక్చరర్ గా promotion పొందారు . .జిల్లా lecturerla సంఘం ,రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయటానికి గొప్ప కృషి చేశారు .రేపల్లె కు బదిలీ అయితె satya sayi స్కూల్ అందరి సహకారం తో నెల కోల్పారు ..Multi faceted personality ”గా గుర్తింపు పొందారు .పుస్తకాలు సేకరించి బుక్ బాంక్ ,బుక్ స్టోరే ఏర్పరచి పేద విద్యార్ధులు పాఠ్య పుస్తకాలు కొనుక్కో కుండా చదివే వీలు కల్గించారు .లైబ్రరి ని ఏర్పాటు చేశారు  నేత్ర శిబిరం నిర్వ హించారు .  రావు గారి పైప్రత్యెక  సావెనీర్ తయారు చేయించి శ్రీ రామా రూరల్ కాలేజి లో ఆవిష్కరింప జేశారు వి.వి.రాఘవయ్య గారు .అప్పుడే ”బాల బంధు ”బిరుదును రేడియో అన్నయ్య గారి సమక్షం లో అంద జేశారు .ఒక ఉపాధ్యాయుడి పై ప్రత్యెక సంచిక రావటం చారిత్రాత్మక మైన విషయం .ఆ అదృష్టం రావు గారికే దక్కింది .అభిమానానికి ,సేవకు దర్పణం గా నిలిచింది ..బాపట్లలో పని చేసినప్పుడు యువకులకు నిర్మాణ కార్య క్రమాలు చేబట్టారు .
                                                    విశ్రాంత జీవిత సేవలు
                 నూజి వీడు లో స్థిరపడ్డారు రిటైర్ అయిన తర్వాత .విద్యానగర్ కాలనీకి రోడ్డ్లు వేయించారు .కల్చరల్ అసోసియేషన్ స్థాపించి అన్ని రంగాల్లో సేవలు చేశారు .దాని అధ్యక్షులయారు .పౌర సౌకర్యాభి వృద్ధి సంఘం ,పోస్టాఫీసు వారి వల్లే ఏర్పడ్డాయి .కొత్తగా పెట్టిన జూనియర్ కాలేజి లో ఇచ్చికం గా ఇంగ్లీష్ బోధించారు .పిల్లల పార్కు ,గ్రంధాలయం నిర్మాణం చేశారు .శ్రీ రామ కృష్ణ సేవా సమితి స్థాపించి ఆధ్యాత్మిక సేవలో ను ధన్యులయారు .శ్రీ సత్యసాయి   కూచి పూడి నాట్య కేంద్రం ,జానపద నాట్య కేంద్రం ఏర్పరచి ఎంతో మందికి నాట్యం లో అభిరుచి కలిగించారు ,మైలవరం ,విస్సన్న పేట లలో బ్రాంచీలు ఏర్పాటు చేశారు .వీరికి ఏలూరు కు చెందిన సినీ నాట్యా చార్యులు శ్రీ కే.వి.సత్య నారాయణ గారు మంచి సహకారం చేశారు .1989 లో గాంధి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వావిలాల గోపాల క్రిష్నయ్య గారిచే ఆవిష్కరణ జారి పించారు .నేతాజీ 96 వ జయంతిని అతి ఘనం గా జరిపారు .
                   ఇన్ని పనులు ఇంత కాలమ్ చేసిన రావు గారి జీవితం నల్లేరు మీద బండి గా సాగింది అనుకో వాటం పొర బాటే .వారి భార్య గారికి పెండ్లి అయిన దగ్గర్నుంచి అనా రోగ్యమే .వంట కూడా చేసే వారు కాదావిడ .పెండ్లి అయిన పదేళ్లకు కాని పిల్లలు పుట్ట లేదు .నెమ్మది నెమ్మది గా ఆమె జన జీవితం లోకి వచ్చారు ..వీరి అక్క గారి సాయం కొండంత అండ ,దీనిని ఆదిగ మించి రావు గారు  బహుముఖ సేవలు అందించారని మరువ రాదు .మొక్క వోని ధైర్యం ఆ ”రాముని ”మీద పూర్తి విశ్వాసం ,మానవ ప్రయత్నం ఆయన్ను అందరి కంటే ముందు నిల బెట్టాయి .భార్య మరణం ,కుమారుని మరణం తో కొంత కలత చెందినా ,అవి మరిచిపోవటానికి ఇంకా సాహిత్య కృషి చేస్తూనే వున్నారు .పిల్లలు హైదరాబాద్ లో వుండటం వల్ల అక్కడికి చేరారు
                     వి.జి.ఎస్.వారికి ఆంగ్ల -తెలుగు నిఘంటువు ను ఒక్క చేతి మీదుగా తయారు చేసి ఇచ్చారు .ఇటీవలే అది ప్రచురింప బడి అందరి ప్రశంసలు పొందింది .ఏ నిఘంటు కారుడు ఆలోచించని రీతి గా ,ఆలోచించి కొత్త ప్రయోగాలు చేశారు .విస్తృత ప్రయోజనం కల్గించారు .సార్ధకం చేశారు .ఇంకా ఏవేవో రాస్తూనే వున్నారు .రోజుకు కనీసం పన్నెండు ఘంటల రచన నిరంతరం సాగిస్తూనే వున్నారు ఈ 88 ఏళ్ళపండు ముసలి .ఆయన తనకు వార్ధక్యం వచ్చిందని భావించటం లేదు .ఇంకా ఏదో చేయాలనీ ,ఇంకా సమాజానికి ఉపయోగ పడాలనే తాపత్రయం వారిది . నిత్యం ఉదయం నడక వారి జీవితం తో పెన వేసుకు పోయిన దిన చర్య.
                    మహోన్నత గురువు ,యువనేత ,విశిష్ట జాతీయ వాది ,అభ్యుదయ కాళాభి మాని ,ముద్దుల మామయ్య ,గాంధేయ వాది అని అందరి చేత ఆత్మీయం గా పిలువబడే రావు గారు ధన్య జీవి .సప్త గిరి చానెల్ లో ఇటీవలే కొన్ని ఎపిసోడ్లకు ర చనలు చేశారు .వారి ‘తాతయ్య లేఖలు ”అనే పుస్తకం పిల్లల చేతి కరదీపికే కాదు ”పిల్లల విజ్ఞాన సర్వస్వం ”అని గుర్తింప బడింది .ఎన్నో సంస్థలు వారిని ఘనం గా సత్కరించాయి ఈ మధ్యే పద్మ భూషణ్ ,నారాయణ రెడ్డి గారి చేతుల మీద గా హైదరా బాద్ లో సన్మానం అందుకొని ఆయన తో ”బాల సాహిత్య చక్ర వర్తి ”అనే సార్ధక బిరుదునుపొందారు   .వారి సేవలకు ఏలూరు లో .పద్మశ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారి ఆధ్వర్యం లో కనకాభిషేకం జరిపి గండ పెండేరం తొడిగారు -వదాన్యులు ,అభిమానులు ..నాకు తెలిసినంత వరకు ఏ ఉపాధ్యాయునికి కాని అధ్యాపకునికి గాని ఇంతటి ఘన సన్మానం జర గ లేదు .ఆంద్ర దేశం గర్వం గా చెప్పు కో వలసిన జీవితం రావు గారిది .”మహాత్ముల బాట లో” నడుస్తూ ,మహాత్ములై ,మనల్నీ మహాత్ములయే రీతిగా ప్రేరణ, స్ఫూర్తి కల్గిస్తున్నఆదర్శ శాంత రచనా తపస్వి  శ్రీ ముదునూరు వెంకటేశ్వ రావు గారు శాతాధికం గా ,ఆయురారోగ్య అయిశ్వర్యాలతో వర్ధిల్లుతూ ,సాహితీ సమార్చనం చేస్తూ వుండాలని ఆకాంక్షిస్తూ —సెలవు
                                   సమాప్తం
                                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -11 -11 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.