సరి కొత్త వేదిక నిర్మిద్దాం
44 వ గ్రంధాలయ వారోత్చ వాల సందర్భం గా ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో ఈ రోజూఅంటే 18 వ తేది న జరిగిన”కవి సమ్మేళనం ”లో నేను రాసి చదివిన కవిత ఇది .
”గ్రంధాలయం మన పుస్తక దేవాలయం
ఆధునిక మార్పులతో వర్దిష్ణ మవుతున్న సాంకేతిక నిలయం
ప్రపంచ సాహిత్యాన్నంతా ఒక్క చోట చేర్చిన ప్రదర్శన శాల
మానవ మేధను పదును పెట్టె సాధనం ఈ ఆలయం
సార్ధక జీవితాన్నందించే సరి కొత్త ప్రయోగం
విజ్ఞానం లో వెనుకబడ టాన్ని -వెనక్కి నెట్టే ప్రయత్నం
అందరి సర్వతోముఖాభి వృద్ధికి,సమగ్రత కు
సవ్య మార్గాన్ని చూపే నవ్య మార్గ దర్శి
అది మానసిక పరిణతి కి సోపానం
చదివిన వాడికి చదివి నంత -లబ్ది పొందే వాడికి పొందినంత
ఎవరి కృషికి తగ్గ ఫలితాల నిచ్చే విద్యా తుల మానం
గ్రంధాలయ సందర్శనం ఒక హాబీ గా మాత్రమే ఉండ రాదు
గ్రంధ పథనం -అను నిత్య అలవాటు గా మారాలి
అది పని వేళలకే పరిమిత మైనదని ,
అధికారాల చట్రం లో ఇమడాలని
అనుకోవటం అవి వేకమే
ఇక్కడ సాహితీ సుగంధం -అనవరతం పరిమ ళించాలి
ఇక్కడ శాస్ర చర్చల ముచ్చట్లు చప్పట్లతో మార్మోగాలి
నిశ్శబ్దానికీ ,ప్రశాంతత కు భంగం యేర్పడ రాదు
ఇక్కడ సంగీత గంగా ఝరి మనల్ని పవిత్రం చేయాలి
ఇక్కడ నాటక ,నాటిక ప్రదర్శన నాణ్యమై రాణించాలి
ఆటల ,పాటలతో చిన్నారులకు -బృందావన మవాలి
ఇక్కడ మహా మహుల పవిత్ర జీవిత మహః స్ఫూర్తి కల్గించాలి
కవి సమ్మేళనాల తో, చిత్రకళా ప్రదర్శన తో, కళా జాతరలతో
సకల కళా నిలయం గా నిండుగా వెలగాలి
సమాజాభి వృద్ధి కేంద్రం గా ,ఆధునికతకు అద్దం గా వర్ధిల్లాలి
చదివిన పుస్తకాలపై అభిప్రాయ సమీక్షా నిలయమవాలి
అభి వృద్ధిసంఘానికి సముచిత స్తానమవాలి
చదువరుల సంఘానికి గౌరవమేర్పర చాలి
ఏడాదికోసారి చేసే తూ తూ మంత్రపు వారోత్చ వాలు కాదు
అను నిత్య వారోత్చవ ,పక్షోత్చవ మాసోత్చవ,వార్శికోత్చవాలు
అత్యంత వైభ వో పేతం గా,అందరి సహకారం తో జరగాలి
గ్రంధాలయం చీకట్లను తొలగించే వెలుగవ్వాలి
అజ్ఞానాన్ని దూరం చేసే విజ్ఞాన శిఖరం కావాలి
ఇరుకు ఆలోచన నుంచి ,విశాల దృక్పధాన్ని ఏర్పర చాలి
అప్పుడే అది గ్రంధాలయం అవుతుంది
లేకుంటే” దుర్గ న్ధాలయం ” అవుతుంది
మీరు ,మేము ,మనమందరం కలిస్తే
ఉజ్వల భవిష్యత్తు కు సరి కొత్త వేదిక అవుతుంది
ఆ దిశ గా అడుగులు వేద్దాం -సాధించి చూపిద్దాం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -11 -11 .


బాగుందండి.
LikeLike