కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –7
మధుర వాణి కి ఒక సందేహం వచ్చింది .లుబ్దున్ని కాపాడ టానికి కారణం ఏమిటి ?”చాపలు ఈద టానికి ,పిట్టలు ఎగారటానికి ఏం కారణమో అదే కారణం[అంటూ శాస్త్రి పరోప కారం సౌజన్యా రావు గారి సహజ గుణం అంటాడు .గడుసు కదా మధురం ”మీరెందుకు ఆ కొంచెం ఈదటంఎగరటం నేర్చుకో కూడదు?”అన్నది మధురం .అర్ధం కాలేదు శాస్త్రికి .నిజం చెప్పి లోకోప కారం చెయ్య రాదా అని ఉపదేశం .”Do as I say but do not do as I do ”అనే తత్త్వం కొంత ఆస్థి గతం గా వుందిశాస్త్రి కి .”నిజం చెప్తేజెయిల్లో పెట్టిస్తారు -కనుక కార్యం సానుకూలం కోసం ఈ ఎత్తు ఎత్తాను ”అని నిజం ఒప్పుకుంటాడు .సరే నంటుంది ఆమె .”ఒక వేళ మీరు మఠం లో ప్రవేశిస్తే కంటే ఖరీదు యెట్లా ?”మళ్ళీ సందేహం .కనుక శిష్యుడు తాకట్టు అయాడు .ఏదో రకం గా గండం గడవటమే శాస్త్రికి కావాల్సింది .పాల ముంచినా ,నీట ముంచినా మధుర వాణే ?”నీవే తప్ప ఇతః పరంబెరుగా ”ననే దీన స్థితి .శిష్యుణ్ణి మధుర వాణికి తాకట్టు పెట్టాడు .అయినా గుంటూరు శాస్త్రి తెలివి గలవాడే .కాలమ్ గడిస్తే ,మధుర వాణి యేలు బడి లో శిష్యుడు పెరిగి తనకు పంగనామం పెట్టచ్చు .ఆషాఢ భూతి అవచ్చు .అందుకే హెడ్డు వచ్చే లోపల కంటే తెమ్మని ,లోపలి పంపించి ,శిష్యుడి తో అంటున్నాడు .ఎంత జాగ్రత్త వుందో ?ముందు చూపు వుందో .నమ్మినా ,చక్రం అద్దం వేస్తున్నా ,తన పెడ బుద్ధి మాత్రం ఎముకలతో పుర్రెతో పుట్టింది కదా .అందుకని ”అది చెప్పిందల్లా చెయ్యక .కొంచెం పై ఒచ్చేది కానీ .మరీ నడుస్తూ వుండు .ఏవైనా వుంటే నా చెవిని పడేస్తుండు ”.అని గురుపదేశం ,హితోప దేశము చేస్తాడు .చెవిలో చెవి పెట్టి పోరాడు .అదే కరటక బుద్ధి ..శిష్యుడు గట్టి పిండం .”ఎవరి దగ్గర వున్నప్పుడు వారు చెప్పినట్లల్లా చెయ్యడమే నా నిర్ణయం ”అని చెప్పు దెబ్బ లాగా కొడ్తూ ”మళ్ళీ అడ వేషం వేసి పెళ్లి చేశారో ?అని అర్దోక్తి గా ,ఆపుతాడు .గురువు ఎంత కైనా తెగిస్తాడని .కాచి వడ పోశాడు కదా .ఎంత గొప్ప పరిశీలన చిన్న క్యారెక్టర్ లో .”ప్రమాదో ధీమతామపి .ఎంత వాడికైనా ,ఒకప్పుడు కాలు జారుతున్దిరా ”అని తప్పు ఒప్పుకొంటాడు గురువు .దాదాపు లెంపలేసుకోన్నంత పని .శిష్యుడి దగ్గర గురువుకు ఆ శిక్ష చాలు .
మధుర వాణికి అనుమానం వస్తుంది .”తన దగ్గర వున్నది తాకట్టు మనిషి .కట్టు తెంచుకో డని నమ్మకం ఏదీ .ఆమె నైజం బాగా తెలిసిన వాడిగా నేర్పుతో ”నీ వల్లో పడ్డ ప్రాణి తప్పించుకు పారి పోవటం ఎలాగా ?వానికి వున్న పటుత్వం నీ గొలుసుకు ఉందీ ?”అంటాడు .ఎంత పోలికో చూడండి .వేశ్యాకర్శనే కాదు ,ఆమె ముగ్ధ మనోహరత్వం ,మాట తీరు ,నేరజాణత్వం ,లౌక్యం ,అభినయం ,ఆదరణ ,ఆత్మ స్థైర్యం ముందు ”ఇనుపకచ్చ డాలు కట్టిన ముని మ్రుచ్చు లైనా గోచీలు విప్పాల్సిందే.ఇంక తన శిష్యుడెంత?పాల బుగ్గల పసి వాడు .ఆ మొహం లో ,లోభం లో ఆకర్షణ లో పడి ,వాడిన్కేక్కడికో జారుకోడని చెప్పినట్లు ,అయస్కాంతం కంటే బల మైన ఆకర్షణ ఆమె యవ్వనం ,శృంగారం దేవతా స్త్రీల కంటే శాశ్వతం అంటాడు .ఆమె ”వలలో ముత్యపు చిప్పలు పడితే లాభం కాని నత్త గుల్లలు పడితే ఏం లాభం ?అంటుంది-శిష్యుడి తాహతును గుర్తు చేస్తూ .”ఆర్జిన్చిన్దంతా ,మీ పాలు చేస్తున్నా .కొద్ది కాలమ్ వుండే యవ్వనాన్ని జీవనాధారం గా చేసుకొన్నా ,మా కులానికి వలపు అంతా బంగారం మీదే .అదీ మీకు అర్పిస్తున్నాను .”అంటుంది .దెబ్బ తిన్నాడు శాస్త్రి .
ఆమె శృంగారఅ శాశ్వతత్వాన్ని మెచ్చుతాడు .ఆమెకు జీవితం మీద విరక్తి కల్గింది .ఈ రొచ్చు లోంచి బయట పడాలని వుంది .సౌజన్యా రావు సౌజన్యం తో జీవితం లోని పర మార్ధాన్ని గుర్తించి ,తరించాలనే నిశ్చయానికి వచ్చింది .ఇప్పుడు శాస్త్రి పెట్టె ప్రలోభాలకు లొంగే స్థితి లో లేదు .ఒక ఉత్కృష్ట స్థితిని పొందే దశ లో వుంది .శాస్త్రి కంటే ఆమె ఎంతో ఎత్తుకు ఏది గింది .కరటకం ఆమె ముందు మరీ కుంచించుకు పోయాడు .ఆమె అతన్ని మాటల మంటలతో కాల్చింది .మీ వల్లే మేం పాడయ్యాం .మీరు చేసిన వేశ్యలం మేం.మీ కోసం రొచ్చులో బతుకు తున్నాం .పైకి రాలేక ఎంతో మంది కుళ్ళి పోతున్నారు .అని క్లాస్ పీకింది .ఆమెకు .శాస్త్రికి జరుగ బోయే సంభాషణలు రసవత్తరం గా వుంటాయి .అవి . ప్రత్యేకం గా ఈ సారి తెలియ జేస్తాను .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20 -11 -11 .

