స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ –2
యోగం
— పరమాత్మను దర్శించా లంటే యోగ సాధన చేయాలి .ఏ స్థితి లో సంకల్ప ,వికల్పాలు ,ఆలోచన ,సంశయం లేకుండా వుంటుందో అదే యోగం .జీవాత్మ ,పరమాత్మలకు సమ భావాన్ని కల్పించేదే యోగం .మనసు లోని ఆలోచనా తరంగాలను అదుపు లో పెట్టేది రాజా యోగం .యోగం లో అష్టాంగాలు వున్నాయి .అవి యమ ,నియమ ,ఆసన ,ప్రత్యాహార ,ధారణ ,ధ్యాన ,సమాధులు .కర్మ ,ఉపాసనా ,జ్ఞానాలను ”యోగ త్రయం ”అంటారు .ప్రాణ వాయువున్ని బంధించా తానని ”హాథ యోగం ”అంటారు .హథం అంటే సూర్యుడు ,చంద్రుడు కలిసి పోవటం .కోరింది సాధించాతాన్ని కూడా హథం అంటారు .ఇదే రాజ యోగానికి దారి చూపిస్తుంది .ప్రాణా యామం వల్ల రక్తం ,నాడులు ,శుభ్ర పడ తాయి .చిత్త ఏకాగ్రత కలుగు తుంది .”యోగం ”అంటే కలయిక .అంటే జీవాత్మ ,పరమాత్మ ల సంయోగం .యోగ సాధన వల్ల ప్రత్యగాత్మ పరమాత్మ లో కలిసి పోతుంది
యోగ సాధనకు గురువు అవసరం .అప్పుడే సుక్ష్మ విషయాలు తెలుస్తాయి .మన మనసు ప్రతి విషయాన్ని సంకల్పిస్తుంది .సంకల్పం కూడా ఒక పదార్దమే .దానికీ శక్తి వుంది .ప్రముఖ శాస్త్ర వేత్త అయిన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం పదార్ధం శక్తి గా ,శక్తి పదార్ధం గా మార్చ వచ్చు .ఈ శక్తినే ఒకరి నుండి మరి ఒకరికి ప్రసరింప జేయ వచ్చు .ప్రపంచాన్ని శాసించ వచ్చు .అందుకే ఋషులు సంకల్పం మాత్రం చేత నే అన్నీ సాధించారు ఇయితే మనసుకు ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది .?అద్దం యెట్లా సూర్యుడి నుండి కాంతి పొందు తుందో ,అలాగే మనస్సు కూడా ,పరమాత్మ నుంచే తేజస్సు ను పొందు తుంది .పాలు యెట్లా పెరుగు గా మారు తుందో అలాగే , మనసుకూడా వస్తు రూపం లోకి మారుతుంది .అప్పుడే వస్తువు ను గుర్తిస్తుంది .కన్ను ,వస్తువు వున్నా ,మనసు లేక పొతే వస్తువు కన్పించదు .అందుకే పెద్దలు ఈ ప్రపంచాన్ని ”మనోమాత్ర జగత్ ”అన్నారు .మన మనస్సు గ్రహించక పొతే ప్రపంచం మనకు కని పించదు .అంటేబాహ్య ,అభ్యంతర జగత్తు అంతా ఒక్కటే… భేదం లేదు .దీన్ని తపస్సు లేక ధ్యానం ద్వారా తెలుసు కోవాలి .యోగ సాధన వల్ల తన లోని క్షమా ,ప్రేమ ,దయ ,ఆదరణ ,సత్యం ,ఉదారత్వం ,బ్రహ్మ చర్యం వృద్ధి చేసు కోని ,సాత్విక గుణాన్ని పెంపొందించు కోవాలి .రాజస ,తామస గుణాలను విసర్జిన్చుకుంటాడు .అప్పుడే జ్ఞాన నేత్రం ఏర్పడుతుంది .పరమాత్మ దర్శనం లభిస్తుంది .అదే యోగ సాధన లోని ఆంతర్యం ..
సశేషం
గబ్బిట దుర్గా ప్రసాద్ -22 -11 -11
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D