స్వామిశివానందుల ఉపనిషత్ సార సంగ్రహం —3
తత్వ మసి
— జీవుడే సత్ ,చిత్ ఆనంద బ్రహ్మ .అయితె ఆ బ్రహ్మను ఓంకారం తో అర్ధం చేసు కోవాలి ”.తత్ -త్వం -అసి” అంటే ”నీవే- అది ”అనగా నీవే ఆ పర బ్రహ్మం .జీవాత్మకు ,పర మాత్మ కు భేదం లేదు .పాలలో వెన్న ఎలా దాగి వుందో ,అలాగే ప్రతి జీవి లోను ఆత్మ దాగి వుంది .ఎవరు ధ్యానం చేస్తారో ,సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారో ,వారికే ఆ ఆత్మ దర్శనం లభిస్తుంది .ఇది శాస్త్ర పథనం వల్ల లభించేది కాదు .ప్రశాంతత ,ధర్మ చింతన ,సత్ ప్రవర్తన ,ఇంద్రియ నిగ్రహం తో నే దాన్ని సాధించాలి .అయితే ఈ ఏకాగ్రతను భగ్నం చేయ టానికి కొన్ని శక్తులు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే వుంటాయి .అవే ”లయ ,విక్షేప ,క్షయ,రాసాద్వాదనలు ”లయ అంటే నిద్ర .దీన్ని పోగొట్టు కోవటానికి ప్రాణా యామం చేయాలి .బయట వస్తు వులపై ఆకర్షణే విక్షేపం .అను రాగం వల్ల కలిగేది క్షయం .ఈ రెండు తొలగితే రసాస్వాదన కల్గుతుంది .అయితె ,ఆస్వాదన నిర్వి కల్ప సమాధి రుచిని చూడ టానికి మాత్రమె ఉపయోగిస్తే ,సాధకుడు ఒక మెట్టు పైకి ఎక్కి నట్టే .
మనసు లోని మాలిన్యాలను నశింప జేసు కో వాలి .కోరిక ,భయాలను నశింప జేస్తే ,తప్ప మనసు పవిత్రం కాదు .మోక్షం అంటే స్వతంత్ర మైన పరి పూర్ణతే ..దీనికి శత్రువు కోరిక కలిగి ఉండ టమే .అంతటా వ్యాపించి వుండే వాయువు ఎలా మార్పు చెంద కుండా వుంటుందో ,అలాగే ,ఆది ,అంతం లేని గుణ రహిత మైన పర మాత్మ ,ఏ శరీరం లో వున్నా ,వికారం పొంద టానికి కాని ,మార్పు చెందటం కాని జరుగదని అర్జునినికి భగవద్ గీత లో కృష్ణ పర మాత్మ తెలియ జేశాడు .ఆత్మను తెలుసు కొని ,స్వయం ప్రకాశ మైన అఆత్మ లో , ‘ అంటే పరమాత్మ లో ఇక్యం చేసు కోవాలి .అప్పుడు మిగిలిన ప్రపంచం అంతా ,మన లోని ప్రశాంత భావమే వికశిస్తుంది .ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి చూసేది ,చూడ బడేది తన లోనే లీనం అవుతుంది .అంటే త్రిపుటి మాయమవుతుంది .అప్పుడే బ్రహ్మ లో ఇక్యం అవుతాడు .అంటే తన ఆత్మ ను ప్రతి వాని లోను ,చూడ గలిగిన ఒక ఉత్కృష్ట స్థితితి ని ,అంటే నిర్వి కల్ప సమాధి స్థితిని పొందిన రుషి మాత్రమె ఆ దర్శనం పొంద గలదు .అతడే జీవన్ముక్తుడు .అతడు మృత్యువుకు భయ పడడు .తురీయావ స్థ లో ,అతడు వున్నట్లు భావిస్తాడు .అతనికి భూత ,భవిష్యత్ ,వర్త మానాల జ్ఞానం తెలుస్తుంది .కోరిక ,బాధ వుండదు .అన్నిటా సమ దృష్టి వుంటుంది .నిందా స్తుతులకు చలించాడు .
ఈశ్వర తత్త్వం
”ఏకమేవ అద్వితీయం బ్రాహ్మామృతం -అఖండ చిదానందా కారం -నిర పేక్షం పరి పూర్ణం ”అంటుంది ఉపనిషత్తు .అంటే ఈశ్వరుడు ఒక్కడే .వేరెవరు లేరు .ఆయన ద్వంద్వాలకు అతీతుడు .జ్ఞానానంద మూర్తి ,ఆత్మా రాముడు ,సంపూర్ణుడు .పరమాత్మ అంతటా విస్తా రించి వున్నాడు .సర్వ భూతాలలో వున్నాడు .చూడ బడే వస్తువు వెనుక పర మాత్మ వున్నాడు .శాశ్వతుడై ,రూప రహితుడై ,త్రికాల సాక్షీ భూతుడై న ప్రత్య గాత్మ ను ఘోర తపస్సు వల్లనే కను గొనాలి ..
”పరి వర్ద మానాత్ సంకల్ప దేశ ప్రపంచో జాయతే –సంకల్ప క్షయే ప్రపంచ క్షయః సర్వ సంకల్పా భావ ఏవ మోక్షః ”
సంకల్పం వల్లే లోకం వుంది .సంకల్పం లేక పొతే లోకం అదృశ్య మౌతుంది .సంకల్పాన్ని వదిలించు కోవటమే మోక్షం .సంకల్పం నిప్పు .,కోర్కె అనే సమిధ తో ,రగుల్కొంటుంది .కోరిక అనే సమిధ ను వారిస్తే ,నిప్పు రాచదు .
”యన్ని రస్త ద్వైత మనాద్యంత మక్షరం -జగతో స్వాధిష్టానం ,నిష్కల్మషం ,జన్మ మృత్యు వివర్జితసం –విభాగ రహితం ,తదేవ బ్రహ్మత్వమసి –సౌమ్య !అవధారయ !తదే తద ద్వైతా మృతం అను ధ్యాయన్ -అస్మిన్నే వక్షనే సాక్షాత్కారం మవ్యాప్ససి ”
అంటే ఏది ద్వంద్వ రహితమై ,శాశ్వతమై ,సత్యమై ,విశ్వానికి ఆట పట్టై ,అంగ రహిత మై ,ఏక రూపం లో జనన ,మరణ ,రహితం గా ,వుంటుందో ,అదే పరమాత్మ . ఆయన్ను ధ్యానించాలి .అంటే అందరిని సమ దృష్టి తో చూడాలి .అప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం .నేనే దేహం అనే భావం ను వివేకం అనే ఖడ్గం తో చేదించాలి .అప్పుడే నేనే సచ్చిదానండుడనే భావం కల్గుతుంది .మనసు కు వస్తువు పై కాని ,మనుష్యుల పై గాని ,స్థలం పై గాని ,ఆసక్తి ,ఏర్పడుతుందో ,అప్పుడే బంధం ఏర్పడు తుంది .వీటికి అంట కుండా ,ఉండటమే ముక్తి .”నేతి-నేతి ” ”అంటే ”కాదు -కాదు ”.అనే సిద్ధాంతం తో ,పంచ కోశాలను వదలి నప్పుడే పరి పూర్ణ మైన శాశ్వత పరమాత్మ మాత్రమే మనస్సు లో మిగులు తాడు ..
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -11 -11 .
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
idi kuda bagundi
LikeLike
హిందూధర్మంలో, విగ్రహాలకు ఎంతో ప్రాధాన్యం వుంది. భగవంతుడిని సాకారంగా, నిరాకారంగా పూజిస్తారు. అయితే, సాకార పూజాపద్ధతినే ఎక్కువమంది అనుసరిస్తారు. దీనికి తార్కాణమే వివిధ దేవతామూర్తులు, గుళ్ళు, గోపురాలు. అనేక పదార్ధాలతో విగ్రహాలను చేసినా, రాతి విగ్రహాల వాడుక ఎక్కువగా వుంటుంది. విగ్రహాలను చెక్కటం వాస్తుశిల్పకళ క్రిందకు వస్తుంది. అదొక శాస్త్రం; ఎన్నో నిబంధనలు వుంటాయి. ప్రతి దేవతామూర్తికి శాస్త్రాల్లో నిర్ధిష్టమైన గుణగణాలు రూపొందించారు. ఆ గుణగణాలు స్పురించేటట్లుగా ఆకారాన్ని నిర్దేశించారు. అంటే, ఆ ఆకారంలో వున్న విగ్రహాన్ని చూడగానే, ఆ దేవతా మూర్తియొక్క గుణగణాలు మన మనస్సులో తెలియబడాలి. భగవంతుడు మనుషులను సృష్టిస్తే, మనిషి భగవంతుడి విగ్రహాలను ప్రతిసృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా, దాదాపుగా అన్ని మతాల్లో ఈ విగ్రహ సృష్టి, విగ్రహ పూజ వుంది.
LikeLike