మళ్ళీ చే జారిన శతం
బాలును చితక్కొట్టి” శత క్కొడ్తాడను” కొని
కవిత్వం రాద్దా మని ఎదురు చూశా
” ఆరడుగుల్లో” గమ్యం దూర మైందంటే చతికిల పడ్డా
ఇంక కవిత్వమేం వస్తుంది ?
అయినా” ఇది ఎన్నో సారో లే” నని ఊరట పడ్డా
పాపం శ్రమకు దైవం తోడు కాలేక పోయాడు
”శత శతం ”కోసం ఇంకా ఎదురు చూడాల్సిందే
అవును నిరీ క్షణే మధురాతి మధురం
సచిన్ కు అది ”ఒక సంఖ్య మాత్రమే ”కాని
మనకు అది ఉత్కంత(utkantha ) రేపే క్రికెట్ పండగ
నరాలు తెగే టెన్షన్ ,పెరిగే రక్త పోటు లతో
ఎదురు చూడటం ఒక అలవాటై పోయింది జనానికి .
మాస్టర్ ,బ్లాస్ట్ మాన్ సచిన్ !
బూస్టు బాగానే తాగుతున్నావు కదా !
బంతిని బాదేయ్ పరుగుల వర్షం కురిపించు ,
కన్ను మూసి తెరిచే లోపు ”నాలుగు, ఆర్లేసి ”ఆరేయ్
నీ వెంట అశేష భారత జనమే కాదు ప్రపంచమంతా వుంది
కురుక్షేత్ర సంగ్రామం లోని అర్జుని లా సందేహించకు
విజయుడి వై వీర విహారం చేయ్
” విశ్వ విజేత ”గా నిన్ను చూడాలనే
మా ఉత్కంత కు ఇక నైనా తెర దించు .
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

