స్వామి శివానందుల ఉపనిషత్ సార సుధ —4
బ్రహ్మ రహశ్యం
— ”బ్రహ్మ జ్యోతిషా మపి జ్యొథిహ్ -స్వయం ప్రకాశః -పరం జ్యోతి రనంతం –జ్యొథిహ్ జ్యోతి హి స్వరూపం -తస్య భాషా సర్వ మిదం విభాతి ”
పరబ్రహ్మ వెలుగు లకే వెలుగు .స్వయం ప్రకాశ కుడు ,పరంజ్యోతి ,ఆనంద జ్యోతి ,జ్యోతి స్వ రూపుడు .అతని తేజస్సు చేతనే ఇతరాలన్నీ వెలుగు తున్నాయి .ప్రతి జీవుని హృదయం లోను సూక్ష్మం లో సూక్ష్మం గా ,స్థూలం లో అతి స్థూలం గా పర మాత్మ వున్నాడు .కనుక పర బ్రహ్మాన్ని తలవటం ,ప్రార్ధించటం మాట్లాడటం ,అతని గురించి ఉపనయ శించటం ,అతని లో కలిసి పోవటాన్ని ,”బ్రహ్మా భ్యాసం ”అంటారు .గీత లో కూడా ,”మాచిట్టా ,మడత ప్రాణా ,బోధ యంతః పరస్పరం -కధ్యం తచ్చమాం -నిత్యం ,తుష్యన్తిచ ,రమంతిచ ,”అని అంటాడు భగవాన్ కృష్ణుడు .
”నిత్య శుద్ధ స్వరూపోహం ,నిత్య బోధ స్వరూపోహం –నిత్య ముక్తి స్వరూపోహం –నిత్య విజ్ఞాన స్వరూపోహం ,-నిత్య చైతన్య స్వ రూపోహం ”అని పరమాత్మ ఉవాచ .అంతే కాదు అందరి ఆత్మను నేనే.అన్నిటికి నేనే ఆధారం అంతా నేనే .అన్నిటికి నేను అతీతున్ని .జాతి ,మత భేదం లేని నిర్మల ,నిష్కల్మష నిష్కలంక నిష్క్రియ బ్రహ్మను నేనే .”నిజం గా ఈ భావన ఈ నాటి కాలానికి ,జనానికి ఎంత అవసరమో ఉపనిషత్తులు ఆనాడే వివ రించాయి అందుకే అవి కాలానికి అతీతం గా నిలిచాయి ..
”ప్రజ్ఞాన ఘన బ్రహ్మ హమస్మి -విజ్ఞాన ఘన బ్రహ్మ మహా మస్మి -చిదాన బ్రహ్మ హమస్మి -ఆనంద ఘన బ్రహ్మ హమస్మి
”సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మమ్ -అనాద్యనంత బ్రహ్మం -అధిష్టానా పరిచ్చిన్న బ్రహ్మాహం ”
నేనే సత్య జ్ఞానానంద బ్రహ్మను .నేనే అనాది ,అనంత బ్రహ్మను ,నేనే అవినాష అధిష్టాన ,అపరిచ్చిన్న బ్రహ్మను .కర్ర లో వున్న నిప్పు లాగ ,అందర్లో డాగి వున్నాను .ఆకాశ రూపి .అంటే సర్వ వ్యాపి .సూక్ష్మి .దేశ కాలాలకు అతీతుణ్ణి .శాశ్వు డిని .
”శాంతా జరామ్రుతాభయం -పర బ్రహ్మం -దివ్యామ్రుత ,ప్రాణ ,మనో బ్రహ్మం -శాశ్వత ,స్వతంత్ర ,కూటస్త బ్రహ్మాహం ”
అంటే శాంత ,జరా ,అమృత ,అభయ ,పర బ్రహ్మను .నేనే దివ్య అమూర్తి ,అప్రాని ,అమన (మనసు ,ప్రాణం లేని )బ్రహ్మను .నేనే శాశ్వతం .నేనే కేవలం బ్రహ్మను .అతీంద్రియ బ్రమను .ఇదీ బ్రహ్మ స్థితి .
”సమొహం ,పురుషోత్త మొహం ,ఈశోహం –శ్రేష్టోహం ,శివోహం ,భాషా రహితోహం -అగంయాన్తర రహితోహం ,అమగ ,అభ్యంతర ,రహితోహం -అభ్యంతర స్థాప్య భ్యన్తర గతోహం ”
నేను అన్నింటికీ సమానుణ్ణి ,పురుషులలో ఉత్తమున్ని ,ఈశారుడిని ప్రసిద్ధుడిని .శివుడిని .భాషా రహితుడిని .అంతరంగం లోని అంతహ్కరణను నేనే .
దీన్నే గీత లో ”సమం సర్వేషు భూతేషు ,తిష్టంతం పరమేశ్వరం ”అంటాడు ”.ఇష్ ”అంటే దేవుడు,ప్రభువు అని అర్ధం .
”సర్వోహం ,సర్వస్మిన్ ,సర్వోహం ,సర్వస్మిన్నేకోహం -ఏకస్మిన్ ,సర్వోహం ,బహురహం ”
అంతటా అన్నిటా నేనే .నా లోనే అన్నీ -సంఖ్యలకు అతీతున్ని ,అంత నిద్ర పోతుంటే మేలు కొనే వాణ్ని .ప్రళయం లో కూడా ప్రకాశించే వాణ్ని .నేనే అద్వితీయ ఏకైక పురాణ పురుషుడిని .
”అచక్షు షాహం పశ్యామి –అశ్రోత్ర్న శ్రునోమీ -అజిహ్వాయా రసయామి ,అత్వచా స్పర్శామను భవామి —అనాసయా ,జిఘ్రామి ,అపాదేన చరామి –ఆహాస్తే న గృహామి ,అమనసా జానామి -శుద్ధ చైతన్యోహం ”
కన్నులు లేకుండా చూస్తాను .చెవులు లేకుండా వింటాను .నోరు లేకుండా రుచి చూస్తాను .శరీరం లేకుండా స్ప్రుశిస్తాను .ముక్కు లేకుండా వాసన చూస్తాను .కాళ్ళు లేకుండా నడుస్తాను .చేతులు లేకుండా ముట్టు కొంటాను .మనస్సు లేకుండా గ్రహిస్తాను .నేను పవిత్ర శుద్ధ అంతః కరణను .పర మాత్మను అని పర మాత్మ చైతన్య స్థితి ని తెలియ జేబు తున్నాడు .ఇంద్రియాలు లేక పోయినా ,ఆయన అన్ని పనులు చేస్తాడు .అంతటా వ్యాపిస్తాడు .అంగాలు లేని వాడు ,గుణాలు లేని వాడు .ప్రతి దాన్ని బల పరుస్తూ ,ఆనందిస్తాడు .అదే ఆయన చిద్విలాసం
ప్రపంచానికి మొలం ,ఆధారం ఆయన..కేంద్ర స్థానం .పునాది .వీటిని నశింప జేసేదీ ఆయనే .అంతా ఆయన లీల .
”సర్వ యోని రహం ,జగన్మూలోహం ,సర్వ దారోహం -పరందామాహం,సర్వ కేంద్రోహం ,అధిష్టాన మహం –ప్రభవోహం ,ప్రాళయ భూమి రహం ”
అంతే కాదు ,పరమాత్మ అపర మేయం ,అపరిచ్చిన్న బ్రహ్మ ,వర్ణింప శక్యం కాని అంటే అన్యపదేష్య బ్రహ్మ
”నేతి నేతి వాక్య ప్రతి పాద్య బ్రహ్మాహం –జగదహల్లక్షనా ప్రతి పాద్య బ్రహ్మాహం –దహకారాకాష వర్తి బ్రహ్మాహం -తపో బ్రహ్మ వర్ణ సత్య దామ శ్రుథాధ్యయనైహ్ -సాధకైహ్ -ప్రేప్స మానం బ్రహ్మాహం ”
భాగం త్యాగం ,లక్షణ మైన బ్రహ్మ ను నేను .నేతి నేతి అనే వ్యతి రేక భావ సిద్ధాంతం సూచించిన బ్రహ్మను .నేనే .హృదయ గుహ లో వున్న బ్రహ్మను నేనే .సాధకుల షమ ,దామ ,తపస్సు ,సత్యం ,బ్రహ్మ చర్యం మొదలైన అభ్యాసాల వద్ద ,కనుగొన బడే బ్రహ్మను నేనే .అంటే జీవునికి వన్న పొరలను తొలగిస్తే ,జీవుడే పరమాత్మ .బ్రహ్మ సారమే జీవాత్మ .గాహరాకాశం అంటే హృదయం లోని ప్రాణ వాయువే .దమం అంటే నిగ్రహం.
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

