స్వామి శివానందుల ఉపనిషత్ సార సంగ్రహం –5
బ్రహ్మ విచారణ
— ”కోహం ”అంటే నేనెవరు ?అని ప్రశ్న వేసుకొని సాధన చేస్తే పరమాత్మను దర్శించ గలం .నిత్యం తపస్సు ,సత్యం ,బ్రహ్మ చర్యం ,నిగ్రహం ,సత్ప్రవర్తనలతో జోడించి ,నియమం తో సాధించి నప్పుడే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది .
”తద్ హి శాశ్వతం బ్రమన సోమనః -ప్రాణస్య ప్రాణం –శ్రోతష్య శ్రోతం ,చక్షుషస్చక్షుహ ,జిహ్వాయా జిహ్వ
స్వేభాసా దీప్య మాన ,మన్యత్చర్వం భాస యతి — ”
అంటే -శాశ్వ త బ్రహ్మయే బుద్ధికి ,బృహస్పతి .మనస్సుకు మనస్సు ,చెవికి చెవి ,కన్నుకు కన్ను ,నోటికి నోరు ,అంటే సర్వం తానె అయిన స్వయం ప్రకాశ కుడు .అతని తేజం వల్లే అంతా ప్రకాశిస్తుంది .పరమాత్మ ”మాత్రు కుక్షా వివ శిశుహ్ ”అంటే తల్లి గర్భం లో శిశువు వలె వున్నాడు .అంటే కాదు పరమాత్మ వ్యాపకత్వం ఎలా వుందో చూడండి .
”యదేక్షు రాసే త్తర్హితాశర్కరా ,యధాచ శర్కరాయాం -మాధుర్య తదా ,సూక్ష్మో యమాత్మా జగ దఖిలం -మనుష్య శరీరం ,చ వ్యాప్త తిష్టతి ”.
చెరకు రసం లో చక్కర అంతటా వ్యాపించి వున్నట్లు ,తీపి ,పంచ దార అంతటా వ్యాపించి నట్లు ,పరమాత్మ ప్రపంచం అంతటా వ్యాపించి వున్నాడు .మనిషి చేసే భావనలను బట్టి ,మనిషి మారుతూ ఉంటాడు .దేహ ధ్యాస మాత్రమే వుంటే పామరు డవుతాడు .”నేను సచ్చిదా నందున్ని ”అనే ధ్యాసతో ,వుంటే ,దైవ స్వరూపుడు గా మారు తాడు .అదే భేదం .
ప్రపంచం లో అనేక అరిష్టాలకు ,రోగాలకు ,అకాల మృత్యువుకు మానవుని లోని ,దుష్ట సంకల్పమే కారణం .చెడు ఆలోచన భావాల వల్లే వ్యాధి జనిస్తుంది .మురికి దగ్గరే కదా దోమలు చేరేది ?సద్భావన కల వారు ఎప్పుడూ ,ఆనందాన్ని ,ప్రశాంత త ను పొందు తారు .అంతే కాదు దూరం గా వున్న వారికి కూడా ,వాటిని పంచిస్తారు .చెడ్డ ఆలోచన వల్ల తనకే కాదు ,సంఘానికీ కీడు జరుగు తుంది .ప్రపంచమే దుష్ప్రభావానికి లోను అవుతుంది .కనుకదాన్ని దూరం చేసి కోవటానికి వెంటనే ,మంచిఆలోచన తెచ్చు కోవాలి .లేక పొతే ,సంఘమే ప్రమాద భరితం అవుతుంది .ఈ శరీరం తో పరమాత్మను చేర లేము .ఈ శరీరం లోని జీవాత్మను ,మన సాధన వల్లనే పరమాత్మలో లయం చేయ గలం .
అంతే కాదు పరమాత్మ ఇలా అంటాడు ”సుఖ ,దుఖాలు నీకు చెందినవి కావు .నీ మనస్సుకు చెందినవి .నీవుకర్తవే కాని ఫలం అనుభవించే వాడివి కావు .ఎప్పుడూ నువ్వు స్వతంత్రుడవే ”.దీనికి ఉదాహరణ గా ఒక కధ తెలుసు కొందాం
ఒకప్పుడు వామ దేవ మహర్షి తల్లి గర్భం లో వుండగా ,తల్లి తో ఇలా అన్నాడు ”తల్లీ !నేను పారి పోతానేమో నని ,ఇనుప ఇళ్ళ వంటి దేహాలు అనేకం నన్ను బంధించాయి .కాని బంధింప బడిన పక్షి ,ఎలా గైతే గూటి కింద సొరంగాన్ని తొలిచి ,బయటకు పారి పోతుందో ,అట్లాగే నేను ,ఆత్మ జ్ఞానం తో ,బంధాలన్నీ ,తొలగించు కోని ,బయట పడతాను .”వామ దేవ మహర్షి మహా జ్ఞాని .ఆయన విజ్ఞానం ,జన్మ జన్మ కు వృద్ధి చెందింది .అందుకనే ,అంత వివేక వంతం గా పలికాడు .చివరి సారిగా ,తల్లి గర్భం లోంచి ,భూమి మీద పడక ముందే ,ఆత్మ సాక్షాత్కారం పొందాడు ,ఆత్మ జ్ఞాని .కనుక .
” యోగ సాధనస్య ,సంస్కారా అను వర్తన్తే –కాలేచ ఫలా వంతో ,భవంతి ,-తస్మాన్ మాశుచః -ప్రత్యహం ,సాధన వ్యగ్రో భవ ”
ఆంటే సాధన ,శిక్షణ ,ఫలితం ఎన్నటికీ నశించదు .తగిన సమయం లో ఫలిస్తుంది .అందుకే నిర్విచారంగా ,ప్రతి క్షణం సాధన చేయాలి .
జ్యోతిర్బిందువు
మంత్రాలు దాదాపు ఏడు కోట్లవరకు వున్నాయి .అన్నీ పరమాత్మను దర్శించ టానికి ఉపయోగ పడేవే .అయితె ”అహం బ్రహ్మాస్మి ”అనే మంత్రం వీటన్నిటిలో ఉత్కృష్ట మైనది .ఈ మంత్రోచ్చాటన ఎప్పుడు చేస్తూ ,జప ద్యానాదులతో మోక్షం పొంద వచ్చు . .
”యధా ఘటః పటోవా ,పరిశాల్య మనో నమ్రుదస్తన్తోర్వా –కించి ధన్యత ,తధైవ ప్రత్యక్ష మిదం ,విశ్వం
విచార్య మానం ,ఆత్మనో వ్యతిరిక్తం ,న కించిత్ ”
వస్త్రం ,కుండా ,మొదలైన వన్నీ ,మట్టి లో నుంచే లభిస్తాయని ,విచారణ వల్ల ఎలా తెలుసు కొంటామో ,అట్లాగే ”ప్రత్యగాత్మ ”నుండే ,ఈ లోకం అంతా,ఏర్పడిందని తెలుసు కోవాలి .మనమే ప్రతి దానికీ ,సాక్షీ భూతం .అందరి లో నుంచే చూస్తాం .”త్వం సర్వస్య సాక్షీ ,త్వం ,సర్వస్మిన్ ,ఎకో ,ద్రస్టాత ,త్వతః ” సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -11-11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


bagundi, mee vyasam,
LikeLike