రెండు చారిత్రిక మహా నగ రాలు –2
కన్యా కుబ్జం (కనోజ్)
— ఉత్తర ప్రదేశ్ లో ఫరూకా బాద్ జిల్లా లో కాళిందీ నదీ తీరం లో వున్న ప్రసిద్ధ పట్టణం కనోజ్ అని నేడు పిలువ బడే కన్యా కుబ్జం .గుప్త సామ్రాజ్య కాలమ్ లో మౌఖరీ రాజులకు రాజధాని గా వుండేది .వీరి లో చివరి వాడు గ్రహవర్మ .హర్షుని సమ కాలికుడు .హర్షుని చెల్లెలు రాజ్య శ్రీ కి భర్త కూడా .శ్రీ హర్షుడు స్థానేశ్వర కనోజ్ రాజ్యాలను రెండిటిని ,చెల్లెలి కోరిక పై పరి పాలించాడు .అప్పుడే రాజధానిని కనోజ్ కు మార్చాడు .ప్రసిద్ధ చైనా యాత్రికుడు ”హుయాన్ సాంగ్ ‘హర్షుని ఆస్థానానికి వచ్చాడు .హర్ష చక్ర వర్తి విద్వాంసుడు ,మహా కవీ .పండిత కవి పోషకుడు .బౌద్ధ ధర్మాన్ని ఆచరించినా ,సకల మత సామరశ్యం చూపాడు .ఎకచ్చత్రాది పత్యం గా ఉత్తర భారతాన్ని పాలించాడు .మహాయాన మతాన్ని స్థాపించి ,ఆచరించాడు .ఆయన నిర్వ హించిన ”మహాయాన సభ ”నభూతో నభవిష్యతి అని కీర్తింప బడింది .నలందా విశ్వ విద్యాలయం నుంచే వెయ్యి మంది బౌద్ధ భిక్షువులు వచ్చారట .హుయాన్ సాంగ్ హర్షుని ఆస్థానం లో ఏడు సంవత్చ రాలు వున్నాడు .ఆ నాటి వైభవ స్థితి ని కళ్ళారా చూసి ,మనసారా వర్ణించాడు .
నగరం చుట్టూ అగాధ మైన పరిఘలు వుండే వట .ఒక ప్రక్క నదీ తీరం ,సరోవరాలు ,ఉద్యాన వనాలు కన్నుల పండువు గా వుండే వట .100 బౌద్ధ విహారాలు ,200 హిందూ దేవాలయాలతో పట్టణం సర్వ తో భద్రం గా వుండేది .గాయకుల కుటుంబాలే అరవై వేలు వుండే వట .బాణ మహా కవి హర్ష చరిత్ర ,కాదంబరి కావ్యాలు రాశాడు .శ్రీ హర్షుడు నైషద కావ్యం తో పాటు ,నాగా వళి నాగా నందం నాట కాలు రాశాడు . భర్త్రు హరి శతకాలు రాస్తే ,మయూర కవి సూర్య శతకం రాశాడు .చంద్రాదిత్యుడు ,దావకుడు హర్షుని ఆస్థాన కవులు .కనోజ్ ను పాలించిన వారి లో చివరి వాడు జయ చంద్రుడు .ఆయన కుమార్తె రాణీ సంయుక్త .ఈమెను పృధ్వీ రాజు చెర బట్టాడు .జయచంద్రుడు షాబుద్దీన్ గోరి తో పోరాడి 1194 లో మరణించాడు షాబుద్దీన్ 1400 ఒంటెల మీద కనోజ్ లోని ధన రాశులను కొల్ల గొట్టి తీసుకు పోయాడట .అంత సంపన్న మైన పట్టణం కన్యా కుబ్జం .. .
ఐతి హాసిక ప్రసిద్ధి
కనోజ్ పట్టణం లోని బ్రాహ్మణులు పరమ నిష్టా గరిస్టులు,.శీల వంతులు అని ప్రసిద్ధి .అష్టాదశ శక్తి పీఠాలలో కన్యా కుబ్జం ఒకటి .అమ్మ వారు ”మహా గౌరి దేవి ”వామన అవతార మైన విష్ణు మూర్తికి ఇక్కడ ఆలయం వుండటం విశేషం .శ్రీ రామ ప్రతిష్ట గా భావిస్తారు .కుశ దేశ రాజు బ్రహ్మ కుమారుడు .అతనికి పుట్టిన కుమారు లలో కుశ నిభుడు కనోజ్ పట్ట ణాన్ని రాజ దానిగా చేసుకొన్నాడు .దానికి ఆనాడు ”మహోదయ పట్టణం ”అని పేరు .దీనికి దగ్గరగా ,”ఆశ్వద్ధ తీర్ధం అనేది గంగా నది ఒడ్డున వుంది .దీన్ని గురించి ఒక కధ ప్రచారం లో వుంది ..రుచీక మహర్షి తనకు గాధి రాజు కుమార్తె నిచ్చి వివాహం చేయ మని కోరాడట .శరీరం అంతా తెల్ల గా వుండి ,చెవులు మాత్రమే నల్ల గా వున్న వెయ్యి గుర్రాలను తెచ్చి ఇస్తే వివాహం చేస్తానన్నాడట రాజు .వరుణ దేవుణ్ణి మెప్పించి ,అలాంటి గుర్రాలను పొంది ,రాజు కు సమర్పించి వివాహం జరి పించు కొన్నాదట .
ఈ పట్ట నానికి ”కన్యా కుబ్జం ”అనే పేరు రావటానికీ ఒక కధ వుంది .కన్యా కుబ్జ రాజైన కుశ నాభుడికి 100 మంది కుమార్తెలున్నారు .వాయుదేవుడు వీరందర్నీ వివాహం చేసు కోవాలని భావించాడు .రాజు ఒప్పు కో లేదు వాయువు కు కోపం వచ్చి వారందరినీ కుబ్జలు (పొట్టి వాళ్ళు )అయి పోవాలని ,శపించాడట .కన్య లైన కుబ్జలు నివశించిన పట్టణం కనుక ;;కన్యా కుబ్జం ”అయింది ..ఆ తర్వాత ,ఆ కుబ్జ లను బృహదత్తుడు పెళ్లి చేసు కోవటం తో ,వారి కుబ్జత్వం పోయి యధా స్వరూపం వచ్చిందట .
శ్రీ హరి నామ స్మరణ ముక్తికి మార్గమ్ అని తెలిపే భాగవతం లోని ఆరవ స్కంధం లో ని ”ఆజా మిళో పాఖ్యానం ”కన్యా కుబ్జ నగరం లో జరిగిన కధ గా భావిస్తారు .
హర్షుని పరి పాలన కాలమ్ లో తక్షశిల ,కాశీ ,నలందా ,ఉజ్జయిని విశ్వ విద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి .హర్షుని తర్వాత కనోజ్ ను పాలించిన యశో వర్మ కాలమ్ లో భవ భూతి ,వాక్పతి మొదలైన కవి పండితులు ఆస్థాన కవులు గా వుండే వారు .ఆ తర్వాత ఘూర్జర రాజా వంశీకులు పాలించారు .వీరి తర్వాత ,ప్రతీ హారుల పాలన లో కి వచ్చింది .వీరందరికీ కన్యా కుబ్జమే ముఖ్య పట్టణం .మిహిర భోజుని ఆస్థానం లో రాజ శేఖర కవి ,మేధా తిది వంటి ప్రజ్ఞా మూర్తులు వుండే వారు .బౌద్ధ ధర్మానికి ఎంత ఆయువు పట్టు గా ఉండేదో ,హిందూ ధర్మానికీ అంతే ప్రాణ నిలయం గా వుండేది కన్యా కుబ్జం .ఈ విధం గ ఇతిహాస పరంగా ,చారిత్రికం గా సాంస్కృతిక , పరంగా కన్యా కుబ్జం అనే కనోజ్ ,భారత దేశం లో బహు ప్రసిద్ధి చెందిన పురాతన మహా నగరం .
సమాప్తం
భారత దేశానికి” తొలి (మొదటి )విదేశీ యాత్రికుడైన పాహియాన్’‘ ”సఫల యాత్ర ”ను ఇక పై ధారా వాహికం గా అందిస్తాను .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -12 -11 .
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D