నేను రాసిన” పూజ్యం ‘
సర్వం పూజ్యం శ్ర్రీ రామ రాజ్యం
‘పై మిత్రులంతా తలో రకం గా స్పందించి నందుకు సంతోషం .నన్ను అభినందిస్తూ పూజ్యం పై ఆజ్యం పోసి మంట బానే మండించారు .కొందరుస విమర్శ అనే సమిధలు తగిలించి జ్వాలనూ రేపారు .మరి కొంత మంది పాపం నీళ్ళు చల్లి ఆర్పెద్దామని ప్రయత్నించారు -కాని నీటి లో ఆక్షిజన్ ,హైడ్రోజెన్ విడి పోయి అంటుకొని మరీ మండింది ..ఇదంతా బాపు మీద ,రమణ గారి మీద అభిమాన జ్వాలె అయింది .సెగ రాజక పోవటం విశేషం .సహృదయత చాలా మందిలో పొంగి పొర్లింది .కొందరిలోకొంచెం తగ్గింది కాని ,ఎవరు హద్దు దాట లేదని పించింది .ఇవి విమర్శ విషయం లో మంచి ఒరవడి .కొందరు కులాల ను తెచ్చి చెయ్యి కాల్చుకొన్నారు పాపం .కొందరు చూడటం రాదనీ ఆక్షేపించి ,ఆ పొగలో ఉక్కిరి బిక్కిరి అయారు .మరి కొందరు పాత సినిమా ల తో పోల్చట మేమిటని ఆరా తీసి ,వెచ్చదనం పొందారు .మీరే తియ్య వచ్చుకదా అని ఒక రంటే సాంబారు బాగాలేదని హోటల్ వాడితో అంటే ”మీరే చేసుకోండి అని కిచెన్ చూపించి నట్లుంది ”అని నవ్వించిన వారూ వున్నారు . .విపులాచ పృథ్వి .సంగీతం హాల్లో కి జనాన్నిలాక్కు రాలేక పోతోందని పత్రికలుకోళ్ళు అయి కూస్తున్నాయి పాపం .అప్పుడే తొమ్మిది నందుల్ని చేజిక్కి అభిమానులను అప్రతిభుల్ని చేస్తోంది ..ఇవన్నీ శుభ సూచనలే .సెట్లు వేసే వారు తమ ప్రావీణ్యం చూపించారు పేపర్ ద్వారా .గాయకుడు ఒకాయన పాపం నిర్మాత కష్ట పడ్డాడు అనీ ,బాపు ,రమణ ల కోసమైనా చూడ మనీ చెప్పాడు .రాముడు మాత్రం ఆడియో రిలీజు నాడు సంగీతం ఎలా వుంది అని విలేకరులు అడిగితె ””ఆ ఆ–ఇళయ రాజా గారు బాగానే చేసారు–ఆ ఆ కదా”అని దాట వేసిన సంగాతిచూసిన వారు ,విన్న వారు మరిచి పోయి వుండరు . ఏమైనా నిర్మాత బయట పడితే చాలు .మళ్ళీ పౌరాణికాలు వెలుగు లోకి వస్తాయి .లేకుంటే కాస్త కష్టమే ..
— మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

