నవ్య న్యాయ సిద్దాంతానికి కాణాచి నవద్వీపం

నవ్య న్యాయ సిద్దాంతానికి కాణాచి నవద్వీపం

             పశ్చిమ బెంగాల్  లోని నదియా జిల్లాలో ”నవ ద్వీపం ”వుంది .చిన్న పట్టణమే అయినా ,పెద్ద పేరు ,ప్రఖ్యాతులు చెందింది .గంగా నది ఒడ్డున ఏర్పడిన కొత్త పట్టణం కనుక నవ ద్వీపం అయింది .బెంగాలు ను పాలించిన ”సేన రాజులు ”గొప్ప సంగీత ,సాహిత్య కళా పోషకులు .తర్వాత వచ్చిన ముసల్మానులు కూడా ప్రోత్చ హించి నందున గొప్ప విద్యా కేంద్రం గా అభి వృద్ధి గాంచింది .గొప్ప సంస్కృత విశ్వ విద్యాలయం ఇక్కడ ఏర్పడింది .ఇది భారత దేశం అంతటికి గర్వ కారణం గా నిలిచింది .తర్కం ,మీమాంస ,న్యాయ శాస్త్రాలకు అధ్యయన కేంద్రంగా వర్ధిల్లింది .సనాతన ధర్మానికి ఆల వాల మైంది .14 వ శతాబ్దం లో దేశం నలు మూల ల నుంచి ,విద్యార్ధులు వచ్చి చేరి విద్యను అభ్య సించె వారు .నవ్య న్యాయసిద్ధాంతాలకు కేంద్ర  మయింది .అంతకు పూర్వం ”మిదిల ”విశ్వ విద్యాయలాయానికి వున్న పేరు పరాస్తం చేసి ,నవ్య న్యాయ శాస్త్ర ధర్మాన్ని చాలా బాగా సుస్తిరం చేసింది .
              ”వాసు దేవ సార్వ భౌముడు ”అనే నవ ద్వీపానికి చెందిన పండితుడు ,మిధిలకు వెళ్లి ,విద్యనుఅభ్య సించి  ,కాశీ లో వేదాంతం నేర్చి ,నవ ద్వీపం చేరి ”,తర్క విద్వత్  పీఠాన్ని ”నెల కోల్పాడు .వంద లాది విద్యార్ధు లకు విద్యా దానం చేశాడు .శ్రీ కృష్ణుని అపర ఆవ తారం గా భావింప బడే మహా భక్తుడు ”చైతన్య మహా ప్రభువు ”నవ ద్వీపం లో జన్మించి దానికి చరితార్ధ కతను చేకూర్చాడు .వాసు దేవ పండితుడు ,ఆయన శిష్యుడు రఘు నాధుడు విశ్వ విద్యాలయాన్ని అనేక రకాలుగా తీర్చి దిద్దారు .ఎన్నో గ్రంధాలు రాసి ప్రసిద్ధి పొందారు ,ఆ పట్ట నానికి కీర్తి ,తెచ్చారు .రఘు నందనుడి కాలమ్ లో ధర్మ శాస్త్ర కేంద్రం గా నవ ద్వీపం వర్ధిల్లింది .ఈయన చైతన్యుని సహాధ్యాయి కూడా ”.స్మార్త భట్టా చార్యుడు ”అనే కేర్ర్తి పొందాడు 28 భాగాలు వున్న ”స్మ్రుతి తత్త్వం ”అనే విజ్ఞాన సర్వస్వాన్ని ,వెలయించాడు .నవ ద్వీపం తాంత్రిక శాస్త్రాలకూ కేంద్ర మయింది .కృష్ణా నందుడు తాంత్రిక ఆగ మాల లో ప్రసిద్ధుడు .బెంగాలు లో తంత్ర విద్య అభి వృద్ధి చెండా టానికి కృష్ణా నందుడే కారకుడు .
          చైతన్య మహా ప్రభువు కాలమ్ లో నవ ద్వీపం విఖ్యాత విద్యా కేంద్రం గా విలసిల్లింది .అన్ని విద్యలకు నిలయ మైంది .వామా చార తత్త్వం వెర్రి తలలు వేస్తూ,వికృతం గా వున్న కాలమ్ లో ”ధర్మ సంస్తాపనార్దాయ ”అన్నట్లుగా చైతన్యుడు ఉద్భ వించి భక్తీ మార్గానికి పట్టాభి షేకం చేశాడు .1486  ఫిబ్ర వారి 18  న సంపోర్ణ చంద్ర గ్రహణం రోజున చైతనుడు జన్మించాడు .”నిమే ”అనే ముద్దు పేరు తో తలిదండ్రులు జగన్నాధ మిశ్రుడు ,శచీ దేవి పిలిచే వారు ”.విశ్వంభరుడు ”అని  నామకరణం చేశారు .సన్యశించి ”చైతన్యుడు ”అయాడు .పదిహేనేండ్ల వయసు లోనే తర్క ,వ్యాకరణాది శాస్త్రాలలో ఉద్దండ పండితుడయాడు .చిన్న తనం లోనే తండ్రి ,అన్నా చని పోవటం తో ,తల్లి చైతన్యుని కి 18 వ ఏటే వివాహం జరి పించింది .భార్య పాము కాటు వల్ల చని పొతే ద్వితీయం చేసు కొన్నాడు .తర్వాత తీర్ధ యాత్రలు చేశాడు .గయలో ”ఈశ్వర పూరి ”అనే మాధ్వ మత గురువు వల్ల దీక్షను ,గోపాల మంత్రోప దేశాన్ని పొందాడు .ఆ మంత్ర జపం వల్ల అనన్య సాధ్య మైన కృష్ణ భక్తీ లభించింది .తనను శ్రీ కృష్ణుని  గా భావించు కొంటు ,కృష్ణ సంకీర్తనం చేస్తూ ,ఆనంద పార వశ్యం చెందే వాడు .శ్రీ కృష్ణ భక్తీ ని మాత్రమే బోధించాడు చైతన్యుడు .ముకుంద దత్తుడు ,మురారి గుప్తుడు మొదలైన శిష్యులు ఏర్పడ్డారు .కృష్ణ భజనల  తో ప్రజల లో అచంచల భక్తీ భావాన్ని కల్గించాడు .ఆ భక్తీ చైతన్యం తో బెంగాలే కాదు దేశ మంతా పార వశ్యం చెందింది .మహా భక్త శిఖా మణి గా ప్రజలు చైతన్యుని ఆరా దించారు .శ్రీ కృష్ణుడే చైతన్యునిరూపం గా మళ్ళీ  జన్మించారని ప్రజల గాఢ విశ్వాసం .చైతన్యుని వల్ల వైష్ణ వ మతం విపరీతం గా విస్తరించింది .మధుర భక్తీ ,రాదా మాధవ  సేవ , జాన్ని బాగా ప్రభావితం చేసింది …
              ఇప్పటికీ ,నవ ద్వీపం గొప్ప విద్యా కేంద్రం గానే వుంది .గురువులు తమ స్వంత సంపాదన తోనే శిష్యులకు వసతి ,భోజనం మొదలైన సౌకర్యాలను కల్గిస్తూ,విద్యా దానం చేస్తున్నారు .గురు శిష్యులు పర్ణ శాలలోనే జీవిస్తున్నారు .ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ,ఆనాటి నుంచి నేటి వరకు ,ఆదర్శ విద్యా కేంద్రం గా నిర్వ హిస్తున్నారు .శాస్త్రాలను ,ధర్మాన్ని బోధిస్తూ ,ఆచరిస్తూ ప్రేరణ కలిగిస్తూ ,స్ఫూర్తినిస్తున్నారు .నవ ద్వీపం లో చదివిన విద్యార్ధి కి  అప్పుడు ,ఇప్పుడు ఎన లేని ,గౌరవం వుంది ,ఆధిక్యత వుంది .ప్రాచీన విద్యను తర తరాలుగా ,కాపాడు కొంటు ,వస్తున్న నవ ద్వీప వాసులందరికీ మనః  పూర్వక ప్రణామాలు . 
                                           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -11 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

1 Response to నవ్య న్యాయ సిద్దాంతానికి కాణాచి నవద్వీపం

  1. చరణ్'s avatar చరణ్ says:

    మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఒక విశ్వవిద్యాలయం ఉంది అని తెలియడం నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది. ఈ విద్యాలయం ఇప్పుడు వ్యవహరించబడుతున్న పేరును, చిరునామా మీకు తెలిసినట్లైన నాకు తెలుపగలరు.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.