భగవద్గీత -నవీన కర్మ సిద్ధాంతం
మనుష్యులకు మోక్షం పొందాలంటే వేదం చెప్పినట్లు ,యజ్న యాగాలు ,వేదాంతం చెప్పినట్లు సన్యాసం ,సాంఖ్యం లో వున్నట్లు జ్ఞానం ,యోగం లోని చిత్త వ్రుత్తి నిరోధం ,భక్తీ మార్గం లోని భజన లలో దేన్నీ కావా లంటే దాన్ని తీసుకో వచ్చు .మార్గాలు వేరు అయినా గమ్యం ఒకటే .అయితె కర్మ చేయక తప్పదు .ప్రపంచం అంతా క్రియ మీదనే ఆధార పడి నడుస్తుంది .లోకం ధర్మ బద్ధం కూడా .ప్రాప్త మైన కర్మను విడువ రాదు .విడిచి పెట్టిన వారు తామసులైన త్యాగులవుతారు . .కర్మ ప్రారంభం దోషం తో కూడి ఉండ వచ్చు .అదే కర్మ అనేది స్వభావం అయితె సిద్ధము ,సహజము అవుతుంది .అప్పుడు ఏ దోషము కర్మను అంటదు .ఆ స్తితి లో చేసే కర్మ శ్రేయస్సు నిస్తుంది .అంటే ఉచిత మైన పని మాత్రమే చేయాలని భావం .శాస్త్రాను సారం గా ,లేక ,సద సద్వివేక బుద్ధి తో కర్తవ్యాని నిశ్చయిన్చ్కొని పని చేయాలి .బుద్ధి -శుద్ధం ,సాత్వికం అయితె సత్కర్మా చరణ జరుగు తుంది ”.కర్తవ్యమ్ చేయటం నా వంతు -ఫలా ఫలాలు నావి కావు ”అన్న భావన రావాలి .”సిద్ద్య సిద్ద్యోహ్సమో భూత్వా ,సమత్వం యోగ ఉచ్యతే ”అన్నాడు గీతా చార్యుడు ,.ఫలా పేక్ష లేని కర్తవ్యమ్ ఉత్తమం .”తస్మా దసక్తః సతతం -కార్యం కర్మ సమాచర” .
మహా భారతం లో ద్రౌపది యుదిస్టిరుని తో ”ధర్మ బుద్ధి తో మీరందరూ మంచి పనులే చేస్తున్నారు .కానీ కస్టాలు అనుభ విస్తున్నాం .దుర్మార్గం తో ప్రవర్తించే కౌరవులంతా ,అందలాలు ఎక్కి భోగాలు అనుభ విస్తున్నారు ”అని కొంచెం నిస్టురంగాఅంటుంది .దానికి స్థిత ప్రజ్ఞుడైన ధర్మ రాజు సమాధానం చాలా ఉదాత్తం గ వుంది .
”ధర్మం చరామి ,శుశ్రోని ,ధర్మ ఫల కారణాత్ –ధర్మ వాణిజ్య కో హీనో జఘన్యో ధర్మ వాదినాం ”
అంటే ”నేను చేసే ధర్మాన్ని ఫలం ఆశించి చేయను .ధర్మం వ్యాపార వస్తువు కాదు .అలా చేస్తే ధార్మికుల మధ్య నన్ను నీచ మానవుని గా భావిస్తారు ”
కర్మకు మూడు ఫలాలు చెప్పాడు భగవానుడు .ఇష్టము ,అనిష్టము ,మిశ్రమం .ఫలా పేక్ష లేని వాడికి ఏ ఫలితం వచ్చినా ఒకటే .ఫలితానికి అయిదు కారణాలుంటాయి .అధిష్టానం ,కర్త ,కారణం ,వివిధ చేష్టలు ,దైవం లేక ఈశ్వ రేచ్చ .అంటే కర్మ ఫలం తాను చేసిన ఒక్క దాని మీద మాత్రమే ఆధార పది వుండదు .ఇతర కారణాలూ తోడ్పడాలి .అందుకే ”కర్తవ్యమ్ ‘అని ఎంచి చేసిన కర్మమే ఉత్కృష్ట మైనది .”చేతసా సర్వ కర్మాణి మయి సంయస్య మత్పరం ”అని సూటిగా చెప్పాడు కృష్ణుడు .”ముక్త సంగో ,నాహం వాదీ ,ద్రుత్చాహ సమన్వితః –సిద్ద్య సిద్ద్యోర్నిర్వి కారః కర్తా సాత్విక ఉచ్యతే .ఇదే కర్మ అసలు రహశ్యం
ధర్మ విషయం లో లో న్యాయం గా ,ఉచితం గా వుండాలని గీతా కారుడు కోరాడు .సంసారాలు వదిలి అరణ్యాలకు పోవటం సన్యాసం కాదు .కామ్య ,కర్మల సన్యాసమే నిజ మైన సన్యాసం .కర్మాన్ని వదిలించు కోవటం త్యాగం కాదు .కర్మ ఫలా సక్తిని వదిలి పెట్ట టమే త్యాగం .చక్కని నియమాలతో చేసే గురు శుశ్రూష మొదలైనవే శారీరక తపస్సు .సత్యం మాట్లాడటం వాచిక తపస్సు .ప్రసాదం ,శాంతి మానసిక తపస్సు .
బ్రహ్మం అంటే దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ చేసే ఈశ్వర ఆవ తారం .అదే సగుణ బ్రహ్మ అని చెప్పాడు గీతా కారుడు .ఏ కోరికా లేకుండా ,స్వార్ధ త్యాగం చేస్తే అదే ఉత్తమ మార్గం అని ,తాను ఆచరించి ,లోకానికి మార్గ దర్శనం చేశాడు .ఎటు వంటి వారి కైనా భక్తీ సులభ మార్గమని తెలిపాడు .ఈ నాడు ఎన్ని కులాలు ,అభిప్రాయ భేదాలు వున్నా ,భక్తి మార్గం తో అంతా ఎకోన్ముఖులవటం చూస్తూనే వున్నాం .మోక్ష మార్గాన్ని అతి సులభం చేసి ,అందరికీ అందు బాటు లోకి తెచ్చిన జగద్గురువు శ్రీ కృష్ణ భగ వాన్” .” గీతా గంగా వతరణం” చేయించి ,సామాన్యులను మాన్యులను చేసి ,ఉత్తమ గతి కల్పించిన” శ్రీ కృష్ణుడు ద్వాపర భగీ రధుడే ”. .
ఆధారం –”భారత మీమాంస ”–రచన -పండిత మాధవ రావు సప్రే
06 -12 -11 మార్గ శిర శుద్ధ ఏకాదశి మంగళ వారం –”గీతా జయంతి ”.సందర్భం గా ప్రత్యేకం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -12 -11 .