పారిజాతాప హరణం
”అపహరణం ”(దొంగ తనం )అనే పేరు తో తెలుగు లో వచ్చిన ,మొదటి కావ్యం నంది తిమ్మన రాసిన ”పారిజాతాప హరణం ”శ్రీ కృష్ణ దేవ రాయల కాలమ్ లో వికశించిన ,ప్రబంధ కవిత్వం తో ,పండిత జనం మాత్రమే మెచ్చే ప్రౌఢ రచన ఆద రిమ్పబడి ,కవిత్వం ఆకాశ వీధి లో సంచ రిస్తుండా గా ,ఆ కవిత్వాన్ని ,భూమార్గం పట్టించి ,తేట తేనే లూరే కవితా సౌరభం తో ,సామాన్య జనులను ఆకట్టు కొనే ,అందరికి తెలిసిన కధ తో అందరి హృదయాల్లో ను నిలిచి పోయే విధం గా కవిత చెప్పిన” ఆ నాటి శ్రీ శ్రీ ”నంది తిమ్మన.కవిత్వాన్నే కాదు ,దివ్య పుష్ప రాజమైన పారిజాతాన్ని ,నాక సీమ లోని వారికే స్వంతమై గుత్తాధి పత్యం వహిస్తున్న సమయం లో ,ఆ వృక్షాన్నే పెకలించి ,తెచ్చి ,భూమి పై నాటి ,అందరికీ అండ జేయ గల్గిన ”సామ్య వాదమూ ”కని పిస్తుంది .


పుర వర్ణనలు,నాయకా నాయికల విరహ వేదనలు ,చందన చర్చల తో విసిగి పోయిన పాథ కులకు ,వాటి జోలికి పోకుండా ,చక్కని కధ తో ,మందార మక రందాల వంటి పద్యాలతో తీయని కవిత్వం అందించాడు ముక్కు తిమ్మన .రాయల దేవేరికి ”అరణం ”గా వచ్చి ,వారిద్దరి మధ్య ఏర్పడిన ”పొలఅలకలు ”కు పరిష్కార మార్గం గా ,కావ్యం రాసి ,వారి మధ్య సాన్ని హిత్యం పెంచి ,ప్రేమను ద్విగుణీ కృతం చేసిన కావ్యం గా చిరస్థాయి పొందింది .కధలో మంచినాట కీయత ,సంభాషణా విలక్షణత ,చూపి ,చదువరులను ఆకట్టు కొన్న రచన .గొప్ప ఎత్తు తో కధ ప్రారంభించి ,చివరికి చక్కని సాఫల్యత కూర్చిన రచన .అడుగడుగునా ,”ముద్దు పల్కులు ”తో ,రస ప్లావితం చేశాడు .అవసర మైతే అర్ధం కాని ”మొద్దు పలుకులు ”కూడా వాడాడు .”శరదాం బుద చిత్తులే పూరుషుల్ ”అని సుద్దులూ చెప్పాడు .అయితే మను చరిత్ర లా త్రవ్విన కొద్దీ ,వినూత్న భావాలు కల్గించే కావ్యం మాత్రం కాదు .lighter vein తో రాసిన కావ్యం
కోతిని ”తిమ్మన ”అని ముద్దు గా పిలుస్తాం .కోతి చేష్టలు తమాషా గా వుంటాయి .చిలిపిదొంగ తనాలు చేయటం ,మనల్ని నవ్వించటం ,కోతి ప్రత్యేకత .తిమ్మన లో కూడా ఆ లక్షణాలు కని పిస్తాయి .అందుకే దేవ పారిజాతాన్ని ,సాక్షాత్తు శ్రీ కృష్ణుడే దొంగిలించే ,చిలిపి తనాన్ని కధ గా ,వాడుకొన్నాడు .
కధ లో దొంగతనానికి పెద్ద పీట వేశాడు శీర్షికా అదే కదా.అందుకే శ్రీ కృష్ణున్ని ఎవరు వర్ణించినా ఆయన దొంగాటల్నీ ,మాయా ప్రవ్రుత్తి నే వర్ణిస్తారు .గరుత్మంతుణ్ణి కూడ ”దుర్లభామృత పశ్యతో హరుండు ”అంటాడు .యుద్ధం వుంది కనుక వీలైన చోట్లల్లా ,”గోపా వధూ వంచాకుదనీ ”,”దానవ ధ్వంసి”అనీ ,”ముర మర్దనుడు ”అనీ కపట స్త్రీ రూపం ధరించాడనీ ,”కంస ఘర్మసుడనీ ”,సత్యా విదేయుడనీ ,నముచి మాధనుడనీ ,,మధు సూదనుడు అనీ సాభిప్రాయం గా అంటాడు ,అని పిస్తాడు .అలాగే ఇంద్రుణ్ణి ”జంభ వైరి ”అనీ ,”పాక దమనుడుఅనీ ”బల హరుడనీ ”ఔచితీ యుతం గా అంటాడు .
శ్రీ కృష్ణుణ్ణి ఎక్కడా అపర బ్రహ్మ తత్త్వం అన్నట్లుగా ,కవి చెప్పడు .ఆయనకు స్తోత్ర పాఠాలు కవి చేయడు .అయితే ఇంద్రుని తల్లి ”అదితి ‘శ్రీ కృష్ణ దర్శ నానికి పులకించి ,ఆయన అవతారాలను వర్ణిస్తుంది .అందు లోను ,ఆయన కపట వేషాలను మెచ్చ టమే ఎక్కువ .ఇలా శ్రీ కృష్ణుడు చేయ బోయే దొంగ తనానికి అందరు మాంచి” . బిల్డప్” ఇస్తారు .”భవ రోగ వైద్యుని ”గా కృష్ణుని వర్ణిస్తాడు కవి
ఈ వైద్యానికి సాధనాలు కావాలి కదా .అందులోను ,ఇంద్ర ,అష్ట దిక్పాలకు లతో యుద్ధమాయే .ఆ యుద్ధం లో గాయ పడ్డా వారికి చికిత్చ చేయాలంటే చాలా ఔషధాలు కావాలి .అందుకే సూర్యోదయాన్ని ,వర్ణిస్తూ తమ్మ కవి సద్భుట మైన పద్యం చెప్పాడు .
మొగుడు దమ్ముల జిక్కు ,మగ తేటి యలుగులు -సడలి పో జేయు విశల్య కరణి
కాల వశంబున గద చన్న వాసర శ్రీ -గ్రమ్మ రించు సంజీవ కరణి
రేయును వాలున ,బాయ లైన రధాంగ -తతుల హత్తించు సంధాన కరణి
తివిరంబు జే సోంపు ,సమసిన దిశలకు ,వన్నియ నొసగు సావరణ కరణి
మించు బీరెండ యగ్ని బుట్టించు నరణి — కలుష ఘోష పయో రాశి ,గడుపు తరణి
దోచే బ్రాచీ మహీధరో త్తుంగ సరణి –బ్రా జదువు ,ముని కంబుల బరని తరణి ”
దీని అర్ధం తెలుసు కొక పొతే వ్యర్ధమే .”ముకుళించిన పద్మాల్లో చిక్కిన తేనే టీగలను సాడ లించే విశల్య కరణి సూర్యుడు .(గ్గుచ్చుకొన్న బాణాలను తీసేది )కాల గతి లో నశించిన దిన లక్ష్మిని ,మరలించే అంటే బతికించే సంజీవ కరణి .రాత్రి అనే కత్తి చేత ,ముక్క లైన చక్ర వాక పక్షులను అంట జేసే సంధాన కరణి సూర్యుడు .చీకటి వల్ల అందం పోయిన దిక్కులకు
శోభనిచ్చే సౌవర్ణ కరణి .పెరిగిన సూర్య తాపం అనే అగ్నిని పుట్టించే ”ఆరణి ‘ ( అగ్నిని మధించేది )’సూర్యుడు .పాపం అనే భయంకర సముద్రాని దాటించే వొడ .వేదాలు అనే మాణిక్యాల భరిణ సూర్య నారా యణుడు ,వేద స్వరూపుడు .అద్భుత మైన సందర్భోచిత మైన వర్ణనా ..తిమ్మన కవీ హాట్స్ ఆఫ్ .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -03 -12 -11 .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -03 -12 -11 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

