పారిజాతాప హరణం –2
”ఘన సంధ్య రాగ వినతా ,తనయ ,గరుత్చమితి -కడిది తాకున ,ధర వ్రాలిన గగన ఫణి ఫణా మణి యన ,రవి మండలము పశ్చి మాంబుధి గ్రున్కెన్ ”
సంజ కెంజాయ అనే గరుడుని రెక్కల ఘాటు దెబ్బలకు ,భూమి మీద ఆకాశం అనే సర్పం యొక్క మాణిక్యం అన్నట్లుగా ,సూర్య మండలం పడమటి సముద్రం లో అస్తమించింది .గరుడిని రెక్కలూ ఎరుపు ,సంజె కూడా ఎరుపే .గగన ఫణి అనే శ్రీ కృష్ణ సర్పం -భవిష్యత్తు లో శ్రీ కృష్ణ -గరుత్మంతుల పరాక్రమ ప్రదర్శనకు నేపధ్యం .ఇలా ప్రకృతి వర్ణన లో కూడా ,రాబోయే కధకు చక్కని basement వేశాడు ,భేష్ అని పించాడు .
”మరుదీశ ,ద్విపదాన శోభ ,శిఖా దూమ్యా రోచి -గీనాశ ,కాసర దేహ ప్రభ ,రాక్షసాసి లతికా కంచ ద్దీదితి ,న్వారి దేశ్వర ,కేతు ద్యుతి ,మాత రిశ్వ ,హరిణ చ్చాయన్ ,ధనా ధ్యక్ష ,,నీల రుచిన్ ,ధూర్జటి కంత(kantha ) కాంతి దమముల్ ,ప్రాపిన్చే దిగ్భిత్తు లం .”
దేవేంద్రుని ఇరావత మద కాంతి వంటి కాంతి తో ,అగ్నితేజస్సు తో ,యముని మహిష కాంతి తో ,నైరుతి లత లాంటి కత్తి కాంతి తో ,వరుణుడి జెండా రంగు తో ,వాయువు లేడి వంటి కాంతి తో ,కుబేరుని నీల కాంతి తో ,ఈశ్వరుని ,నీల కంత శోభ తో ,చీకట్లు వ్యాపించా యట. .ఇదంతా రాబోయే యుద్ధం లో ఈ మహా మహులంతా పాల్గొన బోతున్నారని తెలియ జెప్పే ,తెలివైన ,గడసరి ,సొగసరి విధానం .ముక్కు వారి ముద్దు పలుకు సింగారమే ఇది .
తిమ్మ కవి తన కాలమ్ లో వారి తో పాటు ,ప్రౌఢ మైన కవిత్వమూ ,నర్మ గర్భ కవిత్వమూ ,చెప్ప గలననీ ,చివర లో అన్ని రకాల ”బంధ కవిత్వం ”రుచి చూపించాడు .చిత్ర కవిత్వానీ అందించాడు .సరి వార ల తో తాను సరి సమానున్నని ,రుజువు చేశాడు .ఇవన్నీ నారదుడు శ్రీ కృష్ణుని పొగడ టానికి ఉపయోగించిన ఛందో వేది ”.చిత్ర చిత్ర స్వభావుడు కనుక చిత్ర గతులతో ,నవ్విభు కొనియాడి ”అంటాడు కవి సాభిప్రాయం గా .
11 వ శతాబ్దం లోసంస్కృతం లో ”పారిజాతాప హరణం ”నాటకం గారాశాడు ఒక అజ్ఞాత కవి .శ్రీ నారాయణ తీర్ధులు ”శ్రీ కృష్ణ లీలా తరంగిణి ”తో పాటు ”పారిజాతాపహరణం యక్ష గానం ”చేశారు .16 వ శతాబ్ది లో రఘు నాద నాయకుడు కూడా ,ఈ ప్రబంధాన్ని రాశాడు .”మాత్రు భూత కవి ఈ నాటకం రాసి 1788 -89 లోతంజావూర్ ను పాలించిన ”అమర సింహ రాజు కు అంకితం ఇచ్చాడు .
”నానా సూన వితాన వాసనల నానదించు సారంగమేలా నల్లోల్ల దటంచు ,గంధ ఫ లి బల్ కాకన్ ”అన్న పద్యాన్ని తిమ్మనే వ్రాశాడు .అందుకే ముక్కు తిమ్మన అనే పేరు వచ్చిందని కొందరి భావన .1520 నాటికే పారిజాతాపహరణం కావ్యం రాసి 1526 లో తిమ్మ మహా కవి అస్త మించాడు .ఆయన చిత్ర పద్యం తోనే ముగింపు పలుకు తాను
”చిత్రా కృత్య భి నందిత ,వజ్ర ముఖాక్షీ మధ్యగా ,యక్ష రా
మిత్రో ష్ణద్యుతి దిగ్ధ చక్ర జానీ ,వాల్మీ కర్శపా ,కృష్ణ భా
సూత్రా రాద్య ,నుతింతు ,నిన్ను ,జగదీశా ,విక్రమాస్థిరా
రాత్రీ నాన్చిత భూమి తాబ్జ సదయా ,రాధాను భావా కరా ”
స్వస్తి –సంపూర్ణం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -12 -11 .

