వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం -2

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం -2

                                                       ప్రతాప రుద్ర మహా రాజు
              కాకతీయ రాజుల్లో చివరి వాడు ప్రతాప రుద్రుడు .అమ్మమ్మ రాణీ రుద్రమ దేవి వీరత్వం ,ధీరత్వం మూర్తీభ వించిన వాడు .1328  వరకు పరి పాలించాడు .అయితె దురదృష్ట వంతుడు .విదేశీ దండ యాత్రలను ఎక్కువ గా ఎదుర్కో వలసి వచ్చింది .మొగలాయీలు ధిల్లీ లో స్థిరత్వం సాధించి తరచూ రత్న గర్భ అయిన తెలుగు దేశం పైకి యుద్ధానికి కాలు దువ్వె వారు .ప్రతాప రుద్రుడు యుద్ధ వీరుడు అనే పేరు వుంది .కళా పోషకుడు ,విజ్ఞాని .దేశ భాష ”తెలుగు ”కు మంచి ప్రోత్చాహమిచ్చాడు .”పండితా రాధ్య చరిత్ర ,బసవ పురాణం ,,మార్కండేయ పురాణం ఈ యన కాలమ్ లో వెలు వడి నాయి . .సంగీతా జ్యోతిస్శ్యాలు బాగా వ్యాప్తి చెందాయి .వీటి పోషణకు దానాలు చేశాడు .”వీర భద్ర దళం ”అనే ప్రత్యెక ”టాస్క్ ఫోర్సు ”ను ఏర్పరచి ,దౌర్జన్యాలను ,దోపిడీలను అరికట్టాడు .నేరాలకు కఠిన శిక్ష వుండేది .”మోటు పల్లి రేవు ”రవాణాకు బాగా ఉప యోగించాడు .”ప్రేమాభిరామం ,క్రీడాభి రామం”ఈ తని కాలమ్ లోనే వెలువడిన రచనలు .ఒక రకం గా కవిత్వ పటుత్వం దిగ జారిన రచనలనే పేరు పొందినవి . వేశ్య వ్రుత్తి నాగరకత గా చలా మణి అయిన రోజూ లవి .”పూట కూడు ”అమ్మటం నేరం .అంటే ఉచిత భోజనమే లభించేదన్న మాట .ఓరుగల్లు రాజ దానిగా బాగా అభి వృద్ధి చెందింది
                       
రాజ్యానికి వచ్చిన 10 సంవత్చ రాల లోపే ,అల్లాఉద్దీన్ ఖిల్జీ 1303 లో దాది చేస్తే ,ప్రతాప రుద్రుడు తిప్పి కొట్టాడు .
1309 లో అల్లా ఉద్దీన్ ,అతని సేనాని ”మాలికాఫర్ ”కలిసి ,మళ్ళీ దండెత్తారు .రుద్రుని పరాక్రమానికి తట్టు కోలేక ,ధనం ఇచ్చి పారి పోయారు .మళ్ళీ ఇంకో రెండు సార్లుమీదికి వచ్చినా ,ధైర్యం గా తిప్పి కొట్టిన పరాక్రమ శాలి ప్రతాప రుద్రుడు .1322 లో  మహమ్మద్ బీన్ తుగ్లక్ పెద్ద ఎత్తున ఓరుగల్లు ను ముట్ట దించాడు .ఆరు నెలల భీకర యుద్ధం జరిగింది .ఆయుధ ఆయుధ సామగ్రి తురకల దగ్గర్క వుంది .ఇక్కడ నాయక ,పద్మ నాయక సేనానుల కుట్రతో రాజుకు కొంత ఎదురు దెబ్బ తగిలింది .చివరికి ప్రతాప రుద్రుడు వీరందర్నీ ఎకొన్ముఖం చేసి పోరాడినా ప్రయోజనం లేక ప్రతాప రుద్రుడు ఓడి పోయినట్లు చరిత్ర చెబుతోంది .ఖైదీ గా ఆయన్ను ధిల్లీ కి తీసుకొని పోతుంటే ,అవమానం భరించ లేక ,గోదావరి నది లోకి దూకి ఆత్మ హత్య చేసు కొన్నాడని బ్రిటిష్ వారు రాసిన చరిత్ర చెబుతోంది .ఆయన మరణం తో కాక తీయ సామ్రాజ్యం అష్ట మించింది .అయితె మన చరిత్ర కారులు మాత్రం దీనికి విరుద్ధం గా రచనలు చేసి ,ధిల్లీ సుల్తాన్ నే బందీ చేసినట్లు చెప్పారు .అలేగ్జాందర్ ను ఏడు రించిన మహా వీరుడు పురుషోత్తముని విషయం లోను బ్రిటిష్ చరిత్ర తప్పూ గానే రాసిందని మనందరికీ తెలిసిన విషయమే .,

ప్రతాప రుద్ర మహా రాజు కాలమ్ లో ”విద్యా ఆధుడు ”అనే ఆలన్కారికుడు ”ప్రతాప రుద్ర యశో భూషణం ”అనే అలంకార గ్రంధం రాసి రాజుకు అంకిత మిచ్చాడు .ప్రతాప రుద్రున్ని రుద్రమ దేవి స్వంత కొడుకును పెంచి నట్లు పెంచి ,పెద్ద వాణ్ని చేసింది .అతని తల్లి అంటే రుద్రమ దేవి కూతురు ”ముమ్ము డమ్మ ”.తండ్రి అంటే రుద్రమ్మ అల్లుడు ,చాళుక్య రాజు వీర భద్రుడు .తెలుగు మాట్లాడే ప్రజలనందరినీ ఏక చ్చత్రాది పత్యం కిందకు తెచ్చిన ఘనుడు ప్రతాప రుద్రుడు .ఏక శిలా నగరం అనే ఓరుగల్లు ఆక్కాలం లో చాలా ప్రసిద్ధి చెందింది .
వల్లభ మంత్రి క్రీడాభి రామం ”లో
”సప్త పాతాళ విస్తాప మహా ప్రస్తాన -ఘంటా పధంబైన ఘన పరిఘ
తారకా మండల స్తబకావతంసమై -కను చూపు గొనని ప్రాకార రేఖ
పున్జీభ వించిన ,భువన గోళము భంగి -సంకులాంగన మైన వంక దార
మెరుగు రెక్కల తోడి మీరు శైలము బోలు -పెను పైబడి తలుపుల పెద్ద గవిని
చూచి చేరే ,ప్రవేశించే జొచ్చె బ్రీతి –సఖుడు దానును రధ ఘోట శకట కరటి
యూద సంబాధముల కొయ్య నోసరిలుచు –మంద గతి నోరుగల్లు గోవింద శర్మ ”
అని ఓరుగల్లు పుర వైభవాన్ని గొప్ప గా వర్ణించాడు .అంటే కాదు ”రాజ మార్గంబు ,వారాన ,ఘటా ఘోటక ,శకతికా భట కోతి ,సంకులంబు –ధరణీ స్తలీ రజస్ర స రేణు బహుళంబు ”గా వీధులలో జన సమ్మర్దం నిండి వుండేది .తిక్కన గారి శిష్యుడు ”మారన కవి గారి ”మార్కండేయ పురాణం ”వెలిసిన చోటు కూడా .
”అనుపమ చరితుండగు ,రుద్ర నరేంద్రు    కరాళ వారి ధార ల చేతన్ —దుని యని భూపతి సుతులును –తనియని ధరణీ సురు లును ధరణిం గలరే ”అని కవులు వర్ణించిన నగరము ,రాజు .

ఇందుకూరి రుద్ర రాజు ,బెండ పూడి అన్నయ మాత్యుడు ,ప్రతాప రుద్రుని ఆస్తానం లోని వారే .శ్రీ నాధుడు భీమ ఖండ పురాణాన్ని అన్య మంత్రికి అంకిత మిచ్చాడు .అలానే ‘సాహిణి మారడు ‘అశ్వ సైన్యాధ్యక్షుడు గా వున్నాడు .గోన బుద్దా రెడ్డి ”భాస్కర రామాయణం ”వ్రాసి ఈతనికి అంటే సాహిని మారని కి అంకిత మిచ్చాడు .


ప్రతాప రుద్రుని కాలమ్ లో వీర శైవం విజ్రుమ్భించింది .శ్రీ శైలం ,పుష్ప గిరి ,కోటి పల్లి ప్రసిద్ధ మైన క్షేత్రాలుగా విల సిలాయి .ద్రాక్షారామం ,త్రిపురాంతకం వైభవం సాధించాయి .ఏక శిలా వీధుల్లో ”మైలార దేవుని ”ఉత్చవం రోజున వీర శైవ భక్తితో తామే శివుని ప్రధమ గణం గా బావించి ,మైలార వీర భటులు” వీర నృత్యాలు” చేసే వారు .కాక తీయుల ఇల వేల్పు ”ఏక వీరా దేవి ”(ఏక శిలా దేవి )మగ వాళ్ళు చేసే పేరిణి తాండవం ,ఆంద్ర నాట్యం బాగాప్రాచుర్యం పొందాయి . .వీటిని ఆధునిక కాలమ్ లో స్వర్గీయ ”నట రాజ రామ కృష్ణ ”పునరుద్ధ రించి పుణ్యం కట్టు కొన్నారు .పాల్కురికి సోమ నాధుడు ,”’పండితా రాధ్య చరిత్ర ””బసవ పురాణం ”రచించి జాను తెనుగు కు పట్టం గట్టాడు .ఈ విధం గా ప్రతాప రుద్ర మహా రాజు కాలమ్ లో కళలు అన్నీ అభి వృద్ధి చెందాయి .కళల కాణాచి అయింది ఓరుగల్లు .

— సశేషం –                         తరు వాతి భాగం లో నాటకం లో అంకాల వారీగా జరిగే కధ తెలియ జేస్తాను
గబ్బిట దుర్గా ప్రసాద్                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –05 -12 -11 .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.