వేదమం వారి ప్రతాప రుద్రీయ నాటకం–5
— నాల్గవ అంకం లో భేతాళ రావు తో యుగంధర మంత్రి సమావేశ మై ,రాజును విడి పించే విధానం పై తీవ్రం గా ఆలోచన చేస్తారు .భేతాళ రావు ఎంతో జాగ్రత్త గా వ్యవహరిస్తున్నందుకు అభినందించాడు .ఆయన అది తన ధర్మం అంటాడు రావు తో .యుగంధర్ ”మా నీతికి శేషించినది నీది ,నీచేతికి శేషించినది మాది ” ”అని పని విభజన చేశాడు .ఇంతలో చెకుముకి వస్తాడు .యుగంధరుని తెలివి తేటలకు ప్రశంశ చేస్తాడు .అంతటి శక్తి యుక్తులు అందరికి రావు అంటాడు .”గరుత్మంతుని ద్రుష్టి ,గ్రద్ద లకు కలుగునా ?”అంటాడు .మంచి పలుకు బడి ఇది .ఇంతలో విద్యా నాధుడు చేరాడక్కడికి .పేరిగాడు వచ్చాడు .విద్యా నాధుని తో మంత్రి ”వీడు నిన్ను వదలదు .వీన్ని ”పేనుము ”అంటాడు .మంచి ప్రయోగం .అంతా బాగా మాట్లాడే మాట అది
పంచ మానకం లో ఖుశ్రు దర్బార్ లో చేకుఉముకి వచ్చి ,”రాజు అనుకోని అనుకోని చాకలిని వలీఖాన్ ధిల్లీ కి పట్టుకు పోతున్నాడని చెప్పాడు .ఖుశ్రు కు ఏది నమ్మాలో తెలీటం లేదు .జవాన్ కు ,చెకుముకి కి మాటా మాటా పెరుగు తుంది .”సర్దార్ సాహెబ్ !ఈబొమ్మంకు బొమ్మన్కు పొడీ చేస్తాం ”అంటాడు .ఇందులో రెండర్ధాలు పొడిచి చంపుతాననీ ,పొడి పొడి చేస్తాననీ .శాస్త్రి ”తురక పొడుము .-మేము తాకము ”అంటాడు .అంతటి గంభీర సన్ని వేశం లో కూడా ,హాశ్యపు తునక .అలాగే మాటలు ప్రయోగించటం లో దిట్ట .ఇవాళ మనం సరదాగా మాట్లాడే మాట లన్నీ ,ఆనాడు ఆయన పడి కట్టు కట్టి పెట్టారు .యుగంధరుడు ఎల్లి తో ”నీ పెరి గాడు తానె రాజు నని ,ప్రతిజ్ఞలు ”నరికాడు ”అందుకే అపాయాలల్లో చిక్కాడు ”అంటాడు .ఈ నరకటం మనం అంతా వాడే మాటే .పేరి గాడిని ”దేవ తార్చన లో సాలగ్రామం వలె సవారీ లో కాపాడు తున్నారు ”అంటాడు చెకుముకి యుగంధరుని తో .యుగంధరుని మంత్రిత్వం లో 90 వేల మంది తురకలు సఫా అయారు .ఆ శవాల వాసన భరించ టానికి వీల్లెకా వుంది .దాన్ని చెబుతూ చెకుముకి ”తురకలు బతికి సాధించాక పోయినా ,చచ్చి సాధిస్తారు ”అంటాడు .సందర్భానికి తగిన విలువైన మాట .”కోట బురుజులకు ,రాత్రులలో ,లక్ష కొరివి దయ్యాలు చూపిస్తాను అద్ఫీ నూరేళ్ళ వరక్కూ ,నిరంతరం గా కొన సాగుతుంది .”తురకల హత్యా విషయం లో మంత్రి తో .”అదేమిటి ?”అని ఆయన ఆశ్చర్య పోతాడు .”ఇంక నూరేళ్ళ దాకా ఈ నగరం లో స్త్రీ లందరికి తురక పిశాచాలే కాని ,హిందూ పిశాచాలు పట్టవు ”అంటాడు చెకుముకి .నిజాన్ని సందర్భోచిత హాశ్యం తో మేల వించిన సంఘటన .తాను ఆడ బోయే మహా నాటకం లో భేతాళ రావు కు పంపిన చీటీ ప్రస్తావన గా చెబుతాడు యుగంధరుడు .”పడుగు నేయుట క్షణం .పేక నేయుట కు మాసములు పట్టును .”అని నేత సూక్స్మాన్ని రాజా కీయ నేత మర్మాన్ని అద్భుతం గా వివ రిస్తాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -12 -11 .

