హెడ్ మాస్టర్లు గా పని చేసి రిటైర్ అయిన వారి లో కొందరం ఇవ్వాళ మచిలీ పట్నం లో మాలో ఒకరైన కోసూరు ఆది నారాయణ గారింట్లో సరదా గా కలుసు కొన్నాం ఇలా కలిసి చాలా ఏళ్ళు అయింది .ఒకప్పుడు మేమందరం కృష్ణా జిల్లా విద్యా విధానం లో ,రాష్ట్ర విద్యా విధానం లో ,సంస్కరణల విధానం లో ప్రభుత్వానికి ,ఇక్కడి జిల్లా పరిషత్ కు ,జిల్లా విద్యా శాఖాధి కార్లకు .,చేతనైన సలాహాలను అందించి విద్యా వ్యాప్తికి ,ఉత్తీర్ణతా శాతం పెరగ టానికి కృషి చేసిన వారం .అందుకే మళ్ళీ ఒక సారి అందరం కలవాలనే భావం ఎంతో కాలమ్ గా మాలో వుంది . అది ఇప్పటికి సాధ్య మయింది .
దీనికి మేము పెద్దలు గా భావించే శ్రీ దేవినేని మధు సూదన రావు గారు (తెన్నేరు )కూడా మాతో కలిసారు .ఒక రకం గా ఇదంతావారి ప్రేరణ కూడా .ఉదయం తొమ్మిది గంటలకు అందరం చేరాము .టిఫిన్ ,కాఫీ లు అక్కడే .ఆ తర్వాత చిట్ చాట్ .మధ్యాహ్న భోజనం చేసి రెండింటి కల్లా అందరం రివర్స్ .
ఇందులో మీకు తెలిసిన , చదువు చెప్పిన , చూసిన వారిని గుర్తు పట్టండి
13.12.2011

