దివ్య ధామ సందర్శనం —8
బద్రీ నాద్ దర్శన్
05 -05 -98 –మంగళ వారం –అయిదవ రోజూ –
తెల్ల వారు ఝాము న మూడింటికే లేచి అన్నీ పూర్తి చేసుకొని బస్ ఎక్కాం కాఫీ తాగి .ఉదయం అయిదు గంటలకు భక్తీ గీతాల మధ్య బస్ బయల్దేరింది-గుప్త కాశీ నుంచి .వీలైనంత జాగ్రత్త గా ,వేగం గా బస్ నడుపు తున్నాడు ద్రివెర్ ,44 కిమీ ప్రయాణించి ,అంటే రెండు గంటల తర్వాత ”రుద్ర ప్రయాగ ”జంక్షన్ చేరాం .అక్కడి నుంచి మరో 31 కి.మీ .దూరం లోని ”కర్ణ ప్రయాగ ”చేరాం .ఇక్కడే ”పిండార్ నది ”,అలాక నందా నదీ సంగ మిస్తాయి .మహా భారతం లోని కర్ణుడు పుట్టిన ప్రదేశం ఇదే .లేక అతన్ని తల్లి కుంతీ దేవి నదిలో వదిలిన ప్రదేశం కూడా కావచ్చు .ఉదయం ఎనిమిదైంది .దారిలో హిమ పర్వతాలపై ”కోన్ ”ఆకారం లో వున్నా ,ఆకాశ మంత ఎత్తు వున్న చెట్లున్నాయి .ఇవి రుద్ర ప్రయాగ దాటిన్ తర్వాతే కని పిస్తాయి .కేదార్ నాద్ వద్ద వున్న ఎత్తైన పర్వతాలు ,చిక్కని అడవులు బద్రీ వైపు లేవు .ఫల వృక్షాలు ,పూల చెట్లు బాగా వున్నాయి .రుద్ర ప్రయాగ నుంచి దారి బాగా ఇరుకు .రుద్ర ప్రయాగ లోనే టిఫిన్ పెడితే తినేశాం .
ఇంకో 21 కి.మీ.ప్రయాణం చేసి ఉదయం పదింటికి ”నంద ప్రయాగ ”చేరాం .ఇక్కడే నందాకినీ ,అలక్ నందా నదులు కలుస్తాయి .రెండు వైపులా హిమాలయాల మధ్య గంగమ్మ ఎన్ని పోకడలు పోతుందో ఆశ్చర్యమేస్తుంది .ఒక చోట బాగా వెడల్పుగా ,ఇంకో చోట అతి సన్న గా ,వేరొక చోట పాతాల గంగ గా ,కని పిస్తుంది .బదరి ప్రయాణం చాలా వింత గా వుంది .కొండ పై రోడ్లన్నీ అనేక మెలికలు తిరుగు తాయి .పైనుంచి చూస్తుంటే అద్భుతం గా వుంటుంది .అంటే ప్రయాణం పర్వత అగ్రభాగాన కొంత సేపు ,అడుగు భాగాన కొంత సేపు అన్న మాట .ఆ వరుసలు చూస్తుంటే కళ్ళు తిరుగు తాయి .
నంద ప్రయాగ దాటి పది కి.మీ.వెళ్తే ”చమోలీ ”వస్తుంది .బద్రి చమోలి జిల్లా లో వుంది .రుద్ర ప్రయాగ నుంచి బదరీ దాకా వున్న మార్గ మంతా ,21 బెటాలియన్ కు చెందిన ఆర్మీ అధీనం లో వుంది .వాళ్ళే ఇక్కడి రాక పోకలు ,భద్రత పరి రక్షిస్తారు .అంటే సరి హద్దు ప్రాంతం అన్న మాట .బదరీ కి ఇరవై కి.మీ.దూరం లో మన సరి హద్దు అంతం అయి పోతుంది .అక్కడి నుంచి చైనా బార్డర్ .చమోలీ కి 17 కి.మీ.దారం లో ”పీపల్ కోట్ ”చేరాం .ఆ తర్వాత హేలాంగ్ మీదు గా ,21 కి.మీ.లో వున్న” జ్యోతి ర్మథం” చేరాం .దీన్నే ”జోషీ మఠ ”అనీ అంటారు .కారుకు కాలసిన దీజెల్ ఇక్కడేకొట్టించుకొంటారు . .ధిల్లీ -కేదార్ -బద్రీ -ధిల్లీ ట్రిప్ కు 450 లీటర్ల డీజల్ పడుతుందట .
జ్యోతిర్మత్ నుంచి పది కి.మీ.దూరం లో ”విష్ణు ప్రయాగ ”వస్తుంది .ఇక్కడ ధౌళి గంగా ,అలక నందా నదులు కలుస్తాయి .ఇవన్నీ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలే .ఈ ప్రాంతాన్ని ‘గోవింద ఘాట్ ”అంటారు .అక్కడి నుండి ,పాండు రాజు తపస్సు చేసిన ”పాండు కేశ్వర్ ”చేరాం .దీని తర్వాత ”హనుమాన్ చట్టీ ”వస్తుంది .ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం వుంది .వచ్చే టప్పుడు ,వెళ్ళే టప్పుడు బస్ ను ఇక్కడ ఆపి స్వామిని దర్శించి కాని బయలు దేరరు .కానుకలు సమర్పిస్తారు .ఈ ఘాట్ రోడ్ ను కాపాడేది శ్రీ హనుమ మాత్రమే నని ఇక్కడి వారి విశ్వాసం .జ్యోతిర్మతం నుంచి one way traffic .రోడ్డు చాలా ఇరుకు .అరగంట కోసారి వచ్చే బస్ లను ,పోయే బస్ లను పంపుతూ ,చాలా జాగ్రత్త గా ,ప్రమాదాలు రాకుండా కాపాడు తారు .ఈ పని అంతా సైన్యం దే .మధ్యాహ్నం ఒంటి గంటకు బదరీ క్షేత్రం చేరాం .కర్ణాటక వాళ్ల daarmitari లో బస .చలి బాగానే వుంది .బదరి -సముద్ర మట్టానకి 10500 అడుగుల ఎత్తు .
సామానంతా రూం లో చేర్చి ,భోజనాలు చేశాం .చుట్టూ తెల్లని మంచు పర్వతాలు .ఎత్తైన శిఖా రాలు .రేగు చెట్లు మాత్రమే వున్నాయి .అందుకే ఆపేరు వచ్చింది .వణుకు పుట్టే చలి .స్వెట్టర్ ,మఫ్లర్మామూలే . .ఇంకా ఇక్కడికీ కరెంట్ రాలేదు .మంచాలు ,పరుపులు ,రాజాయిలు అంద జేశారు .ఒక గంట విశ్రాంతి తీసు కొన్నాం .
మధ్యాహ్నం మూడు గంటల కల్లా స్నానం చేసే బట్టలు ,కట్టు కొనే బట్టలు సంచీ లో తీసుకొని ,బయల్దేరాం .ఒక కిలో మీటర్ నడిచి ,”అలక నంద నది ”ఒడ్డుకు చేరాం .పర్వతాల మీద నుంచి ,చల్లని మంచు నీరు జారి పడి ,అలక్ నంద గా ప్రవహిస్తోంది .మహా వేగం .ఇది గుడికి చాలా దగ్గరే .ఈ చల్లని నీటికి ఎగువన ”ఉష్ణ కుండం”వుంది .Hot spring అంటారు .ఇంత గడ్డ కట్టే చలి ప్రదేశం లో అంతటి వేడి నీరు రావటంప్రకృతి వింతల్లో ఒకటి .తటాకంలాగా కట్టి ,నందీశ్వరుని నోటి లో నుంచి నీరు పడేట్లు చేస్తారు .ఆడ మగా వేరు వేరు గా స్నానం చేయాలి .పంపుల ద్వారానూ వేడి నీరు వచ్చే ఎర్పాటుంది .అతి సహజ సిద్ధ మైన ఆ వేడి నీటి లో హాయిగా స్నానం చేశాం .జన్మ తరించి నట్లింది .నంది దగ్గర నీళ్ళు చాలా వేడి గా ఉంటాయి .అందరు స్నానం చేసే చోట కొంచెం వేడి తక్కువ .ఇక్కడ స్నానం చేయటం మధురాను భూతి .ఒక్క మునుగు మునిగితే చాలు ఒంట్లో ని నెప్పు లన్నీ మాటు మాయం ఊష్ కాకి అన్న మాట .అరగంట సేపు స్నానం చేసినా ఇంకా చేయాలని పించింది .ఇక్కడ సబ్బు వాడ కూడదు .”మహా నంది ”లో స్వచ్చ జలం లో స్నానం చేస్తుంటే మనం దేవతలం అని అని పించి నట్లే ఇదో గొప్ప అనుభవం .ఇక్కడ పరమ ఆరోగ్య కరం ఈ ఉష్ణ జల స్నానం .అన్ని వ్యాధులు ఈ నీరే చికిత్చ .అందుకే తనివి తీరా స్నానం చేసి తరించి ,ఆరోగ్యమూ పొందు తారు .
బద్రీ విశాల్ దర్శనం తారు వాత చేద్దాం -అంత వరకు వేచి వుండండి .

సశేషం — మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ –24 -12 -11 .