దివ్య ధామ సందర్శనం –10

దివ్య ధామ సందర్శనం –10

                                        బద్రీ విశాల్ దర్శనం

—            బదరీ నారాయణుడి విగ్రహం నాభి వద్ద ఎరుపు రంగు మంచి గంధపు బొట్టు వుంటుంది .రెండు తొడల పైనా చిన్న చిన్న తిలకం బొట్లు ,,నాభికి పైన విశాల వక్షస్థలం వుంది .అందులో ”శ్రీ వత్స ,” ”భ్రుగుతల ”చిహ్నాక్లున్నాయి అందమైన కంత హారం వుంది పద్మం వంటి ముఖం తో ,రెండు వైపులా వ్రేలాడే కేశాలతో ,నారాయణ స్వామి నయన మనోహరం గా ముగ్ధ మోహనం గా ఆనంద సామ్రాజ్య సీమా విహారిగా ,ముక్తి ప్రదాత గా దర్శనమిస్తాడు .మనుష్యులేమిటి ?దేవతలే తమ పేరు అనిమిషులు అని సార్ధకం చేసుకొంటూ ,ఆ స్వామి దర్శనం కోసం అహరహం రెప్ప వాల్చకుండా నిరీక్షిస్తుంటారు .
ఈ విగ్రహం లో ఒక ప్రత్యేకత కూడా వుంది .ఏ మతం వారైనా ,స్వామిని దర్శించి ,తమ ఇష్టా దైవాన్ని ,”నారాయణుడి ”లో చూసి తరిస్తారట .అన్ని మత విశ్వాసాలకు అతీతం గా స్వామి వుంది ,సర్వులకు సులభుదౌతున్నాదన్న మాట .విష్ణు భక్తులకు నాలుగు చేతులు కల విష్ణు మూర్తి గా ,శైవులకు సర్వాలంకార శోభితుడైన కైలాస పతి శివునిగా ,శాక్తేయులకు జుట్టు విర బోసుకొన్న కాళీ మాత గా దర్శనం కల్గిస్తాడు .వారంతా ఆ యా భావాలతో ఆయన్ను కొలవటం ఇక్కడి చిత్రాతి చిత్ర మైన విషయం .జైనులు జిన దేవున్నీ ,బౌద్ధులు ,బుద్ధ భగ వానున్నీ ,ఆ విగ్రహం లో చూసి మురిసి పోతారు .
మార్గ శిర మాసం లో బదరీ ఆలయం మూసేస్తారు .అప్పుడు నారద మహర్షి స్వయం గా ఇక్కడికి వచ్చి ,పూజాదికాలు నిర్వహిస్తాడని పురాణం చెబుతోంది .నిజం గా నారదుడు ఒక గంట కు మించి ఎక్కడా ఉండరాదని దక్ష ప్రజా పతి శాపం వుంది .కాని విష్ణు మూర్తి ,వరం వల్ల స్వేచ్చగా ఆరు నెలలు బదరీ లో వుండి బదరీ నాధుని సేవలో పూజారిగా జనమ చరితార్ధం చేసుకొంటాడు .వైశాఖ మాసం నుంచి ,కార్తీక మాసం వరకు నారదునికి ఇక్కడ పూజించే అధికారం వుంది .ఇక్కడ అర్చకులు అంతా ”బ్రహ్మ చారులే ”.వీరందరూ ,శంకరాచార్యుల వారి జనం స్థలమైన కేరళ రాష్ట్రం లోని ”కాలడి ” నుంచే వచ్చిన  బ్రాహ్మణ వటువులు . జ్యోతిర్మత  పీతాది పతి ,ఘద్వాల్ మహా రాజు కలిసి అర్చకులను నియమిస్తారు .
”లభంతే దర్శనం ,పుణ్య పాప వివర్జితం –శన్మాసం దైవథెహ్ పూజ్యా శంమాసం మానవైస్తా ”( నారద మహా పురాణం )
ఆలయం లో నారదునికి ఎడమ వైపు శంఖ ,చక్ర ,గదా ,పద్మాలతో ,చతుర్భుజాలతో ,శ్యామల  వర్ణం లో ,పద్మాసనం పై తపోస్థితి లో ఉన్నట్లుగా ,నారాయణ విగ్రహం ,కుడి నడుము భాగం లో శ్రీదేవి ,ముఖం వద్ద భూదేవి ,ఎడమ ముఖం వద్ద లీలావతి ,తొడపై ”ఊర్వశి ”వుంటారు .బదరీ క్షేత్రం లో ”ఊర్వశి సిద్ధ పీఠం ”భైరవీ చక్రం ,నారద క్షేత్రాలున్నాయి .
నరనారాయణుల   విగ్రహాలు ఒకే రాతి పై చెక్కబడి నాయి .నారాయణుని ఎడమ భాగం లో ధనుర్బాణ దారుడై ,ఎడమ పాదం బొటన వ్రేలిపై నిలబడి ,కుడి పాదం ఎడమ తోడ మీద వుంచి ,తపస్సు చేస్తున్న ”నరుని విగ్రహం ”కని పిస్తుంది .
శ్రీ కృష్ణుడు ,అవతార సమాప్తి చేసి వైకున్తానికి వెళ్ళే ముందు ,ఉద్దవునికి ,తన నవ రత్న ఖచిత మైన బంగారు పాదుకలను ఇచ్చి ,బదరి లో తపస్సు చేయమని ఆదేశించాడు .ఆ ఉద్ధవుడే ఇక్కడ ఉత్సవ మూర్తి .ఆలయ ద్వారాలు మూసిన తర్వాత ఉద్ధవుడు -యోగ ధ్యాన దేవాలయం అయిన ”పాండకేశ్వరం ”వెళ్లి ,పూజ చేస్తాడు .
బదరీ నాదునిఎడమ వైపు ,పన్నెండు నెలలూ ఆరి పోకుండా వెలిగే ”అఖండ జ్యోతి ”వుంది .ద్వారాలు మూసి వేసినా ,మళ్ళీ తెరిచే దాకా ,ఆ జ్యోతి అఖండం గా వెలుగుతూనే   వుండటం విశేషం .ఆలయం తెరిచే రోజున జ్యోతి దర్శనం కోసం వేలాది భక్తులు వచ్చి ,దర్శించి పుణ్యం మూట కట్టు కొంటారు .
స్వామికి ఎడమ వైపు ”శ్రీ లక్ష్మీ ”ఆలయం వుంది .ఆమె తపస్తితి లో స్వామికి ప్రసాదం తయారు చేస్తుంటుంది .నారాయణుడు ,ఆమెను చూస్తూ ,ఆ నైవేద్యం తింటూ ఉంటాడు .అందుకే ఇక్కడి ప్రసాదాన్ని భేద బావం లేకుండా అంతా స్వీకరిస్తారు .స్వామి కూడా ఈ నాటి తిరుమల వేంకటేశ్వరుని విభం తో దర్శాని దివ్యం గా అనుగ్ర హిస్తాడు .
”బదరీ నాద నైవేద్యం ,యో మొహాత్త పరిత్యజేత్ –చండాలాధామో జ్ఞేయః ,సర్వ ధర్మ బహిష్క్రుతః ”(కేదార ఖండం )
దేవాలయానికి ఎడమ వైపు యజ్న కుండం ,దానికి దగ్గర గరుడ విగ్రహం ,దానికి ఎడమ వైపు శ్రీ హనుమాన్ విగ్రహం ,వినాయక విగ్రహమువున్నాయి   .మంగళ వారం కనుక ”మా  సామి హనుమను ”ఇక్కడే మనసారా దర్శించి ,తరించాం .
బదరీ దర్శనం వల్ల ,వెంటనే ఫలితం కలుగు తుంది .కోరిన కోర్కె తీరు తుంది .స్మరణ ,దర్శన మాత్రం చేత ఘోర తపహ్ఫలం ,భూదాన ఫలం లభిస్తాయి .
”గమిష్యామి విశాలావై ,యావై కధయతే నిశం –సొపి తత్ఫల దాప్నోతి ,బదరీ నాద దర్శనం ”
క్షణ మాత్రమాపి జలం ,పితృ నుద్రిష్య ఏ నవి –తట్టం తేన కలౌ ,సర్వ పిత్రూనాం ముక్తి కారణం ”(స్కంద పురాణం )
దీని అర్ధం -ఎవరు పితరుల భస్మాన్ని (ఎముకలు )బదరి లో కాలుస్తారో అతని పితరులు మోక్షం పొందుతారు .
ఇంతటి పవిత్ర క్షేత్రం దాని వైభవం నర నారాయణుల పవిత్ర మూర్తులు ,మనసునిండా ఆక్ర మించగా ,బదరీ హిమాలయ సొగసులు కనుల ముందు విందు చేస్తుండగా అలక నందా ప్రవాహం సేద తీరుస్తుడగా ,మంచు పొరలు తెరలు తెరలు గా రాలు తుండగా ,నీల kantha శిఖర శోభ మనో వీధి పై మనోహరం గా నర్తిస్తుండగా ,ఏదో స్వర్గ లోకం లో దేవ లోకం లో ఆనందపు అంచుల మీద తేలి యాడి నట్లుంది .ఆ మధుర భావ స్పందనల తో శివ నర ,నారాయను లను ,భక్తులైన నారదాదులను ,స్మరించు కుంటు ,నెమ్మది గా నిద్ర లోకి జారు కొన్నాను .కలో ,వైష్ణవ మాయో ,నిజమో తెలీని అపూర్వ ఆనను భూతి .
 06 -05 -98 -బుధ వారం (ఆరవ రోజూ )
అయిదింటికే తెల్ల వారింది .నిద్ర లేచి ఆలా కృత్యాల తర్వాత కాఫీ తాగాం .అక్కడ ఒకతను స్టవ్ మీద వేడి నీళ్ళు కాచి ఇస్తునాడు .ఒక బక్కెడు నీళ్ళు కోని వాటి తోనే అందరం స్నానం అయిందని పించు కున్నాం .ఇక్కడి నీళ్ళు ఫ్రీజింగ్ వాటర్ .ఒంటి పై చన్నీరు చుక్క పడితే ”చలి ముళ్ళు ”గుచ్చు కొన్నట్లే .ఏడు గంటలకు అందరం బయల్దేరాం .మళ్ళీ ఉష్ణ కుందాం లో ఒక అర గంట స్నానం చేసి ,వారం రోజుల బడలికను మటు మాయం చేసు కొన్నాం .శరీరం అంతా తేలి పోయినట్లుంది .కాళ్ళ ,కీళ్ళ నొప్పులు అడ్డ్రెస్ లేవు .ఎంతో రిలీఫ్ గా ఫీల్ యం .బావ ఆనందం వర్ణనా తీతం .అక్కా ,ప్రభా కూడా స్నాన మహాత్మ్యాని బాగా పొందారు .దర్శనం క్యు లో నిలబడి ఒక గంటలో ఆలయ ప్రవేశం చేసి ,మళ్ళీ నిన్నటి స్మృతులతో బద్రీ విశాల్ ను దర్శించు కొన్నాం .పదే పదే స్వాములను కన్నుల పండువు గా చూసి ,చూసి ,కళ్ళకు మనసుకు పరమార్ధం పొందాం .పోతనా మాత్య కవి వర్ణించి నట్లు ”కమలాక్షు నర్చించు కరములు కరములు ,శ్రీ నాదు వర్ణించు జిహ్వ జిహ్వ ”గా అనుభూతిని పొందాం .భక్తీ పార వశ్యం తో దాదాపు నాట్యమే చేశాను నేను .

మొత్తం మీద పది గంటలకు ఆలయం వెలుపలికి వచ్చాం .ఉష్ణ కుండం దగ్గరే ”బ్రహ్మ కపాలం ”వుంది .ప్రక్కన గల గలా ప్రవహించే అలాక నందా నది .160 రూపాయలు ఇచ్చి ,నేను బావా ,పితరులకు పిండ ప్రదానాన్నిశాస్త్రోక్తం గా   చేశాం .తెలుగు తెలిసిన పండిత్జీ బాగా చేయించాడు .నేను అలాక నందా నదిలో కూడా స్నానం  చేశా అంత చలి లోను .బావ చెయ్య లేదు .నేను పంచె కట్టి ఉత్త రీయం నడుముకు బిగించి ,బావేమో పాంటు షర్టు తో తయారైతే అక్య సన్నాయి నొక్కులు నొక్కితే అప్పుడు నా లానే పంచ కట్టాడు బావ .పితృ కార్యం యధా విధి గా చేశాం .వయసు వచ్చినా ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం .అంతా అయేసరికి ఒంటి గంట అయింది .ఎన్నో వేల మంది అన్ని వర్ణాల వాళ్ళు ఈ పవిత్ర క్షేత్రం లో పితృ విధి తీర్చి తమ పితరులకు మోక్షం కల్పిస్తూ తమ ఋణం తీర్చు కొంటున్నారు .ఇక్కడ పిండ ప్రదానం చేస్తే ఇంక తద్దినాలు పెట్టక్కరలేదు అంటారు .పైన మబ్బు ,చలి గాలి ,రివ్వున కొడ్తోంది .గజ గజ వణుకుతూనే ,అంతా పధ్ధతి ప్రకారం కార్య క్రమం పూర్తి చేశారు .బజారు లో ఫోటోలు వగైరాలు కొనుక్కొని ,రూం కు చేరాం .అప్పటికే అందరు భోజనాలు పూర్తి చేసు కోని బస్సు ఎక్కి రెడి గా వున్నారు .మా కోసం ఇద్దరు ఎదురు కూడా వచ్చారు .అన్నం పెద్ద గా తిన బుద్ధి కాలేదు .కతికాం .పాయసం బాగా చేశాడు అదే రెండు గ్లాసులు లాగించాం .మజ్జిగ అన్నం తో భోజనం అయిందని పించాం .సామాను బస్ లోకి చేర్చి బస్ ఎక్కాం .మధ్యాహ్నం రెండు గంటలకు బస్ ను కిందికి దిగ టానికి అనుమతిస్తారు .
కిందకు దిగి ఏమేమి చూశామో తరువాత తెలియ జేస్తాను
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -12 – 11 .

దివ్య ధామ సందర్శనం –9

దివ్య ధామ సందర్శనం —8

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

1 Response to దివ్య ధామ సందర్శనం –10

  1. kalyani's avatar kalyani says:

    చాలా మంచి విషయాలు పంచుకుంటున్నారు, యాత్ర చేయాలనుకునే వారికి బాగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు thankyou very much.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.