దివ్య ధామ సందర్శనం –9

దివ్య ధామ సందర్శనం –9

                                  బద్రీ విశాల్ దర్శన

—                స్నానాలు చేసినతర్వాత ,బద్రీ నాద్ ఆలయ సందర్శనకు బయలు దేరాం .ప్రసాదాలు కొనుక్కొని ,క్యు లో నున్చోన్నాం .ఒక అర గంటకు లోపలి చేరాం .చాలా గొప్ప ఆలయం .నర ,నారాయణుల నివాసం .లక్ష్మీ నారాయణ క్షేత్రం .ప్రదక్షిణ చేసి బద్రీనాధు దర్శించాం .కృష్ణ స్వామి చాలా ప్రసన్నం గా కన్పించాడు .ప్రక్కన నారద ,ఉద్ధవులు వున్నారు .స్వామి వార్లను భక్తి ప్రపత్తు లతో చూసి ఉప్పొంగి పోయాం .కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాఠం గా కారు తున్నాయి .జీవిత సాఫల్యం పొందిన ఘడియ ఇది .జనం బాగా వున్నారు .అక్కడే శ్రీ శంకర భగవత్పాదుల ఆలయం వుంది .బద్రీ వైభవానికి కారకుడుశంకరా చార్యులే   .కృతజ్న త తో నమస్కరించాం .అక్కడి నుంచి ,ఆలయం దాటి బయటకు వచ్చాం .అక్కడే ”గండకి నది ”లో లభించే సాలగ్రామాలు కొన్నాం .ఇక్కడే స్వచ్చమైనవి లభిస్తాయని అందరు చెప్పారు .తెలుగు వాళ్ళు చాలా మంది కని పించారు .చలి పెరుగు తోంది క్రమంగా .మంచు కూడా పెరుగు తోంది .ఆలయానికి generator   ద్వారా కరెంట్ ఇస్తునారు ర్స్వాస్వా మికి మరోసారి నమస్కరించి సాయంత్రం ఆరు గంటలకు రూం కు చేరాం .ఆకలి లేదు .అక్కయ్య ,బావ ,ప్రభ హాయిగా రాజాయిల్లో దూరారు . నేను వచ్చింది పడుకోవ టానికి కాదు కదా .ఆలయం లో చదువు దామంటే చీకటి భయం .ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను .నెమ్మది గా పుస్తకాలన్నీ తీసుకొని బయటికి వచ్చి రావు ట్రావెల్స్ వాళ్ల బస్ లో కూర్చున్నాను . .
ఎదురుగా ”నీల కంత  పర్వతం ”ఎదురుగా అతి దగ్గర గా కని పించింది .శివ దేవుడు ఇక్కడే తపస్సు చేస్తాడట .అందుకే ఆపేరు .అతి తెల్లగా ,మబ్బులు మూస్తే నీలం గా కన్పిస్తుంది .శిఖరం అంతా మంచు తో నిండివుంది .కైలాస శిఖరమా అని పిస్తుంది .స్వామి దయానంద సరస్వతి కూర్చిన వెద మంత్రాలు ,మహా నారాయణ ఉపనిషత్తు ,నమకం ,చమకం ,తైత్తిరీయ ఉపనిషత్తు ,కతోపనిషత్తు ,ప్రశ్నోపనిషత్తు ,మున్డకోప నిషత్తు లను సాయంత్రం 6 -15 నుంచి ,రాత్రి 9 గంటల వరకు నాన్ స్టాప్ గా ఉచ్చ్చ్రైశ్వరం తో ,ఆనంద పులకాన్కితం గా ,కన్నీరు జాలు వారుతూండగాకారు లోని లైట్ వెలుగు లో   ,పథనం చేశాను .
బస్ డ్రైవర్ ,శ్రీనివాస్ ఆశ్చర్యం గా అలా చూస్తూ వుండి పోయారు .”మహారాజ్ ,మహారాజ్ ”అని నాకు చేతులు జోడించి నమస్కరించారు . వేద పథనం అత్యద్భుతం గా సాగింది .హిమాలయాలపై ,బద్రీ నాధుని సన్నిధి లో ,నా పూర్వ జన్మ సుకృతం వల్ల ఇలా చేయ గలిగానని పించింది .మహదానందం గా వుంది .ఆనందో బ్రహ్మ గా వుంది మనస్సంతా .దూది పింజలా మనసు తేలి పోతోంది .మహా శివుని సాక్షాత్కారం పొందిన దివ్యాను భూతి గా వుంది .
బద్రీ లో రాత్రి ఏడున్నర వరకు చీకటి పడదు .ఉదయం అయిదు గంటలకే తెల్లారి పోతుంది .ఇదో అద్భుతం .ఈ నీల కంత దర్శనం అందరికీ పునర్జన్మ లేకుండా చేయాలని మనసారా కోరు కోన్నా.రాత్రి తొమిది గంటలకు ఆనంద పార వశ్యం తో గదికి చేరు కొన్నాను .అందరు పోరాట ,కూర తిని వంట వాడు బాగా చేశాడని మెచ్చు కొంటు పడు కొన్నారు .నేను వాళ్లకు చెప్పకుండా వేదం చదువు కొన్నానన్న మాట .వాళ్ళు కంగారు పడుతున్నారు .ఇంకాసేపుంటే అందరు కంగారు పడి గుడి దగ్గరక్కు వచ్చి చూసే వాళ్ళే .నాకు ఏమీ తినాలని పించ లేదు .మజ్జిగ తాగి విటమిన్ టాబ్లెట్స్ వేసుకొనిరజాయి   కప్పు కోని హాయిగా పడుకొన్నాను .కళ్ళ ముందు బదరీ క్షేత్ర దృశ్యాలు కను విందు చేస్తూనే వున్నాయి .
 బదరీ క్షేత్ర విశేషాలు —
బదరీ క్షేత్రం లో ”నర నారాయణులు ”తపస్సు యొక్క గొప్ప దనాన్నిప్రపంచానికి తెలియ జేశారు .దక్షుడు మనువు కుమాత్ర్హే ”ప్రసూతి ”ని వివాహం చేసుకొన్నాడు .వీరికి 16 మంది కుమార్తెలు . 13  వ కుమార్తె ”మూర్తి ”అనే ఆమెకు ”నర నారాయణులు ”జన్మించారు .తల్లిని అతి శ్రద్ధ తో వారిద్దరూ పూజించారు .ఆమె సంతోషించి ,వారిద్దరూ తపస్సు చేసుకోవా టానికి అనుమతి నిచ్చింది .నర నారాయణులు ”నైమిశారణ్యం ”లో ఘోర తపస్సు చేశారు .చేతిలో ధనుర్బాణాలతో వున్నవీళ్ళను  ప్రహ్లాదుడు  చూసి ,మోసగాళ్ళు అని భావించి ,యుద్ధం చేశాడు వారిద్దరితో .100 సంవర్సరాలు యుద్ధం చేసినా ఎవరూ గెలవ లేదు .అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుని ధ్యానించి ,వారిద్దరూ నర నారాయణులు అని తెలుసు కొన్నాడు .క్షమాపణ కోరాడు .నరనారాయణులు ఆ తర్వాత ఉజ్జయిని కి వెళ్లి తపస్సు చేశారు .అక్కడే నరుని భక్తి కి నారాయణుడు సంతోషించి ,అర్జునుని సారధిగా ఉండ టానికి అంగీకరించాడు .వారిద్దరే ఆ తర్వాత ,కృష్ణార్జును లైనారు .
నర నారాయణులు బదరికాశ్రమం చేరి ,తీవ్ర తపస్సు చేశారు .ఇంద్రుడు బయపడి అప్సరస లను పంపాడు తపోభంగం చేయటానికి .వీరు చలించ లేదు .నారాయణుడు తన తొడ నుండి ”ఊర్వశి ”(తోడలనుంది పుట్టినది )ని సృష్టించి ,అపూర్వ సౌన్దర్యాన్నిచ్చి ,అప్సరస లను తల వంచు కోనేట్లు చేశాడు .ఆమె తో సహా నారాయణుని అనుగ్రహం తో ,అప్సరసలు అందరు స్వర్గం చేరారు .అప్సరసలు నారాయణుని సేవించాలని కోరితే  ,కృష్ణావతారం లో గోపికలు గా పుట్టి ,ఆ కోర్కె తీర్చు కుంటారని వరం ఇచ్చాడు .
కృత యుగం లో భగవంతుడే ”నర నారాయణ ”రూపం లో జన్మించి ,తపస్సు చేశాడు .ఋషులు నారాయనున్ని బదరీ వనం లో ఉండ మని కోరారు .నారద క్షేత్రం లో వున్న ,నారాయణ దివ్య విగ్రహాన్ని వారితో తెప్పించి ,బదరి లో ప్రతిష్టింప జేశాడు .దర్శన మాత్రం తో మోక్షం వచ్చేట్లు అనుగ్రహించాడు .”విశ్వ కర్మ ”చాలా అందం గా ఆలయాన్ని నిర్మించాడు .”నారదుడు ”ప్రధాన అర్చకుడు గా వుండి ,స్వామిని సేవించి పూజించి తరించాడు .
బుద్ధుని శిష్యులు బదరీ నాద్ లోని విగ్రహాని ;;బుద్ధుని ”గా భావించి పూజించారట .శకులు ,హోణులు మొదలైన బౌద్ధులు శంకరా చార్యుల వారికి భయ పడి , టిబెట్ వైపు పారి పోయారట.పారి పోతూ ,ఆ విగ్రహాన్ని ”నారద కుండం ”లో పారేసి  పోయారు .ఆ విగ్రహం రెండు ముక్క లైంది .శ్రీ శంకరులు ఇక్కడికి చేరినపుడు దాన్ని చూసి ,ఆలయం లో విగ్రహం లేక పోవటాన్ని గమనించి ,నారద క్షేత్రం లో ని ,విగ్రహాన్ని తెచ్చి ,పునః ప్రతిష్ట చేశారు .
ఒక రోజూ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ తపస్సు చేసు కొందామని , ”అలక నందా నది ”లో స్నానం చేయ బోతుంటే ,నారదుడు పిల్ల వాడి రూపం లో ఏడుస్తూ వచ్చాడు .పార్వతి జాలి పడి ,భర్త తో ఆబాలున్ని రక్షించ మని కోరింది .ఇదంతా ”మాయ ”అన్నాడు శివుడు .వారిద్దరూ స్నానం చేయ టానికి పోగా ,ఆ ప్రదేశం పై అధికారం సంపాదించాడు నారదుడు .ఈశ్వరుడికి స్థానం లేక పోవటం వల్ల .కేదార్ ఆద చేరి అకడ నివాసం ఏర్పరచు కొన్నాడు .పాపం తపస్సు చేసు కోవ టానికి వచ్చిన శివుని పరిస్థితి అలా మలుపు తిరిగింది .బదరీ నాద్ ,కేదార్ నాద్ శిఖా రాల మధ్య దూరం 105 మైళ్ళు .బదరి కి కృత యుగం లో”ముక్తి ప్రద ” గా ,త్రేతాయుగం లో ”యోగ సిద్ధిద ”గా ,ద్వాపర యుగం లో ”విశాల ”గా ,కలియుగం లో ”బదరీ ఆశ్రమం ”గా పేర్లతో ప్రశిద్ధ మైంది .
వరాహ పురాణం లో ఒక కధ వుంది .సూర్య వంశానికి చెందిన ”విశాల ‘అనే రాజు తన రాజ్యాన్ని పోగొట్టు కోని ,బదరి లో తపస్సు చేశాడు .నర నారాయణులు ,దర్శనం ఇచ్చి ,వారి రాజ్యం వారికి ఇప్పించేశాడు .ఆ పట్టణమే ”విశాల ”పేరుతొ వర్ధిల్లు తుందని చెప్పాడు .అందుకే బదరి క్షేత్రాన్ని ”విశాల ”అంటారు .”బద్రీ విశాల్ ”అంటూ భక్తులు ఆర్తిగా వేడు కొంటారు .హైదరాబాద్ లో ”బద్రీ విశాల్ పిట్టి ”అనే రాజా కీయ నాయకుడు వుండే వాడు .
బదరీ అంటే రేగు అని అర్ధం .లక్ష్మీ దేవికి రేగు పండు బాగా ఇష్టం .రేగు చెట్టు కింద భగ వంతుడు తపస్సు చేశాడు .అందుకే బదరీ క్షేత్రం గా పిలుస్తారు .నరనారాయనులుండే ప్రదేశం కనుక ”నర నారాయనాశ్రమం ”అనీ అంటారు .నారద మహర్షి ప్రధాన అర్చకుడు కనుక ”నారద క్షేత్రం ”అని కూడా పిలుస్తారు ..
భగవాన్ రామానుజా చార్యులు -పూర్వ ఆలయం శిధిల మైతే ,”విష్ణు కుండం ”దగ్గర”నారాయణ విగ్రహం ”ప్రతిష్టించారు 15 వ శతాబ్దం లో”గద్వాల ”రాజు ఈ దేవాలయం నిర్మించాడు .రాణి ‘అహల్యా బాయి ”దేవాలయం పై బంగారపు కలశం నిర్మించింది .ఆలయం లో బదరీ నారాయణుడు వెండి సింహాసనం మీద ,బంగారు గొడుగు కింద ,ధ్యాన తత్పరుడై ,దర్శనమిస్తాడు .రెండడుగుల ఎత్తున్న విగ్రహం స్వామిది .కుడి వైపులా వెడల్పైన  ముఖం తోకుబేరుడు ,గరుత్మంతుడు ,ఎడమ వైపు నర నారాయణులు ,శ్రీదేవి ,భూదేవులు ,వీణ తో వున్న బాల బ్రహ్మ చారి నారద మహర్షి ,ఉద్ధవుడు ,భగవంతుని పాదాలు వుంటాయి .భక్త బృందం తో సహా అద్భుత దర్శనం ఇచ్చే మహాను భావుడు ”నర నారాయణుడు ”  .
విగ్రహ విశేషాలు ఇంకా వున్నాయి .అవి తరువాత తెలియ జేస్తాను .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —26 -12 -11 .

దివ్య ధామ సందర్శనం —8

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.