దివ్య ధామ సందర్శనం —11
— బదరీ లోని హాట్ స్ప్రింగ్ కు ఒక కధ వుంది .ఒక సారి అగ్ని దేవుడు ఋషులతో ”నేను అన్నీ భక్షిస్తాను .ఈ పాపం ఎలా పోతుంది” ?అని వ్యాస మహర్షిని అడిగాడు .అప్పుడు వ్యాసుడు ”బదరీ వెళ్లి అలక నందా నదిలో స్నానం చేసి స్వామిని దర్శించు .పాత కాలన్నీ పోతాయి ”అని చెప్పాడు .గంధ మాదన పర్వతం మీదుగా అగ్ని దేవుడు బదరి వచ్చి నారాయణ దర్శనం చేశాడు . ఆయన ప్రార్ధన విని నారాయణుడు పాపాలన్నీ పోగొట్టాడు .అగ్ని అన్ని దిక్కులా వ్యాపించింది .ఇక్కడ మాత్రం వేడి నీరు రూపం లో ఉంది .అందర్నీ పవిత్రం చేస్తున్నాడు .అందుకే ఈ ఉష్ణ కుండాన్ని ”వహ్ని (అగ్ని )తీర్ధం అంటారు .”వహ్ని తీర్ధ సమం తీర్ధం న భూతో నభవిష్యతి ”.బదరీ లో నర నారాయణ ఆశ్రమం ,కుబేర శిల ,వరాహ శిల గరుడ శిల ,నారద శిల ,మార్కండేయ శిల అనే తీర్దాలున్నాయి . .
బ్రహ్మ కపాలం –—
బ్రహ్మకు వున్న అయిదు శిరస్సులలో ఒకదాన్ని శివుడు నరికేస్తే అది చేతితో కలిసి ఉష్ణ కుండం దగ్గర అంటే బ్రహ్మ కపాలం దగ్గర పడిందట .అందుకే అంత పవిత్రం .శివుడు తన బ్రహ్మ హత్యా పాతకాన్ని ఇకడే పోగొట్టు కొన్నాడు నారాయణ దర్శనం తో .ఇక్కడ పిండ ప్రదానం చేయ కుండా ,గయలో చేసినా ,ఫలితం రాదట .
బదరీ క్షేత్రం స్థూల ,స్సోక్ష్మ అతి సూక్ష్మ శుద్ధ మైనది .ఆ నాలుగు క్రమంగా ”సారూప్య ,సామీప్య ,సాలోక్య ,సాయుజ్యాలను ”ఇస్తాయి .నంద ప్రయాగ నుంచి ,గరుడ గంగ వరకు వున్న ప్రదేశమే ”కన్వాశ్రమం ”శకుంతల పెరిగి ,పెద్దదై ,దుష్యంతుని రాణి అయిన ప్రదేశం .దీన్నే ”స్థూల బదరి ”అంటారు .గరుడ గంగ నుంచి ,విష్ణు ప్రయాగ వరకు ”సూక్ష్మ బదరి ”అనీ ,విష్ణు ప్రయాగ నుండి ,కుబేర శిల వరకు ”అతి సూక్ష్మ బదరి ”,కుబేర శిల నుంచి ,సరస్వతీ నది వరకు ”శుద్ధ బదరి ”అని అంటారు .ఈ క్షేత్రాల దర్శనం వల్ల జీవన్ముక్తు లవు తారని నమ్మకం .
ఇవన్నీ తలచు కుంటు ,బస్ లో మా గన్ను గా నిద్ర పోయాను .అతి ప్రమాద కార మైన ఆ చిన్న ఘాట్ మీద ప్రయాణం చేసి సాయంత్రం అయిదింటికి ”జ్యోతిర్మత్ ”చేరాం .ఇదే శ్రీ శంకరా చార్యుల వారు ఉ త్తరాదిన స్థాపించిన మొదటి
”ఆమ్నాయ పీఠం .”కొండ పైకి వెళ్లి భగవత్పాదులను ,తోటకా చార్యులను దర్శించి ,నమస్సు లర్పించాం .ఆ మహాను భావుడే లేక పోతే ,బదరీ ,కేదార్ లు హిందూ ధర్మానికి దూరమై పోయేవి .ఇదంతా శ్రీ శంకరుల భిక్షయే .ఇక్కడే ”లక్ష్మీ నారాయణుల ”ఆలయం” ఉంది ఆశ్రమం లో .రాజా రాజేశ్వరి అమ్మ వారి విగ్రహం అతి సుందరం గా ఉంది .పవిత్రత మూర్తీభవించి నట్లుంది .పైన శ్రీ శంకరులు తపస్సు చేసిన గుహ ఉంది .దీన్ని శ్రీ అయ్యర్ తీసిన ఆది శంకరా చార్య సినిమా లో అత్యద్భుతం గా చూపించి ,స్రద్ధాలి జోడించారు .ఒకప్పుడు శ్రీ శంకరుని పరీక్షించ టానికి అలక నందా నది ఉప్పొంగి ,అంత ఎత్తు పై వున శంకరుని గుహ ను నీటి తో ,తాకిందట .భగవత్పాదులు నదీమ తల్లిని భక్తీ పూర్వకం గా ప్రార్ధిస్తే మళ్ళీ వెనక్కు పోయిందట .అంతటి అఘటన ,ఘటనా సమర్ధుడు శంకరా చార్య .
బదరీ దేవాలయం మూసి వేయ గానే ,మిగిలిన ఆరు నెలలు ,ఇక్కడి లక్ష్మీ నారాయణులకు బదరీ లో చేసి నట్లే పూజాదికాలు నిర్వ హిస్తారు .ఈ రకం గా ఈ పర్వత వాసులకు ఆస్తిక ధర్మ భిక్ష పెట్టింది ఆది శంకరా చార్యుల వారే .ఇక్కడ ధవళ గంగా ,అలక నందా నదులు కలిసి భక్తులకు తీర్ధ ప్రయోజనాన్ని కల్గిస్తాయి .ఇక్కడే నవ దుర్గాలు ,వాసు దేవులు ,వున్నారు .ప్రహ్లాదుడు వీరిని భజించి నట్లు ఇతిహ్యం .పీఠం లో యాభై రూపాయలు చందా చేల్లిన్చాం .వారు చేసిన కృషికి నీరాజ నాలు అందించాము .
జ్యోతిర్మాథం భారతీయ ఆర్మీ కి కేంద్రం .శిక్షణ ,భద్రత అంతా వారిదే .చెర్రీ పళ్ళు ఎక్కువ .కొని తిన్నాం .ఇక్కడ ”ధవళా నది ”ఒడ్డున ‘భవిష్య బదరి ”క్షేత్రం ఉంది .అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి ,నారాయణుడు ,”భవిష్యత్తు లో బదరీ క్షేత్రం పాపులకు కని పించదు .అప్పుడు ఇదే బదరి గా ప్రసిద్ధ మవు తుంది ”అని చెప్పాడట .దీనికి దగ్గర లో గురు గోవింద సింగ్ అనే శిక్కు గురువు తపస్సు చేసిన ”లోకపాలక క్షేత్రం ”ఉంది .నారాయణుడు పర్వతాన్ని రెండు గా చీల్చి ,వాటి మధ్య గా ,గంగను ప్రవహింప జేశాదట .ఇక్కడ నాలుగు వైపులా ,కోట్లాది పుష్పాలు పూసి ,సర్వ మనోహరం గా కన్పించే వనం ఉంది .
నంద ప్రయాగ దాటి ,కర్ణ ప్రయాగ చేరాం .”పిండార గంగ,అలక నంద లు కలుస్తాయి .కర్ణుడు సూర్యుని కోసం తపస్సు చేసి సహజ కవచ కుండా లాలు వరం గా పొందిన దివ్య క్షేత్రం .ఇలా ప్రయాణం చేస్తూ ,రాత్రి ఏడు గంటలకు పీపాల్ కోట్ చేరాం .దార్మితరి లో పడక శీను .కరెంటు లేదు .బిర్యాని చేశాడు .మేము తిన లేక పోయాం .పెరుగు అన్నం తిన్నాం .అరటి పళ్ళు కోని తిని పడు కొన్నాం .బదరీ నాద్వెళ్ళిన రోజూ రాత్రి ప్రభావతికి అమ్మ కలలో కని పించి చాలా ఆనందం గా వున్నట్లు చెప్పిందట .అంటే పితృ దేవతలు సంతృప్తి చెందారని భావించాం .ఈ యాత్ర ఫలం వాళ్ళదే .
జ్యోతిర్మతం దగ్గర ఒక వంతెన ఉంది .సీజన్ అయి పోగానేఆ వంతెన పై రాక పోకలు వుండవు .సైన్యం పూర్తిగా పహారా కాస్తూ ,సరిహద్దుల్ని కాపాడుతూ ,దేశాన్ని రక్షిస్తుంది .విదేశీ ప్రవేశం లేకుండా ,వేయి కళ్ళతో కాపలా కాసే వీర జవానుల సేవ చిరస్మర నీయం .అద్వితీయం .ఈ గడ్డ కట్టే చలిలో ,భార్యా పిల్లలకు సుదూరం లో ఉంటూ ,అనుక్షణం కంటికి రెప్పలా భారత మాత ను కాపాడే వారి ఋణం ఎంత ఇచ్చినా ,చేసినా తీరనిది .వారందరికీ మనసా వాచా కృతజ్ఞతలు .వారి అకున్తిత దేశ భక్తికీ ,త్యాగ నిరతికీ ,కర్తవ్య పాలనకు జోహార్లు .ఎందరు ప్రజలు అక్రమ మార్గాల్లో నడుస్తున్నా ,నిజాయితీ పరులైన ఈ వీర జవాన్లు చేసే సేవ వల్లనే దేశం సుభద్రం గా ఉంది .పురోగ మిస్తోంది .ఉజ్వల భవిష్యత్తు కై కృషి చేస్తోంది .
salute to thee o soldier who protects the mother land ”
సశేషం —–మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

