కేతు విశ్వ నాద రెడ్డి కధా పరిచయం

కేతు విశ్వ నాద రెడ్డి కధా పరిచయం

           రాయల సీమ లో అందునా కడప జిల్లా నేపధ్యం లో జరిగిన ,జరుగుతున్న సామాజికజీవితాన్ని  ,తన దైన బాణీ లో చాలా సులభం గా ,అందరికి అర్ధమఎట్లు ,సజీవ భాషలో వ్రాసిన కధా సంపుటి ”కేతు విశ్వ నాద రెడ్డి కధలు ”1960 నుంచి 92 వరకు రాసిన కధా రాసి ఇది .సంఘ జీవితం లో వస్తున్న వివిధ పరిణామాలను ,ప్రగతి శీల దృక్పధం లో కధలుగా మలిచారు .ఆలోచనలకు ,సంవేదనలకు సమ ప్రాధాన్యం ఇచ్చే ఉత్తమ స్థాయి సృజనాత్మక రచయిత శ్రీ విశ్వ నాద రెడ్డి .ఈ కధలకు నేపధ్యం అంతా మనం ,మన జీవితాలు,మన చుట్టూ వున్న పరిస్తితుల్లో వస్తున్న సాంఘిక ,ఆర్ధిక ,రాజకీయ ,నైతిక సైద్ధాంతిక విలువలలో వచ్చిన పరి ణామాలే .ఈ పరిణామాలలో మంచీ వుంది, చెడు వుంది .ఆలోచింప జేసేవీ వున్నాయి .ఇందులోని పాత్రలు సజీవ చిత్రాలు .మలచినవి గా అనిపించవు .నిత్యం మనకు  కన్పించేవే .ఈ పాత్రల్లో ని సామాజిక స్పందనలు సంవేదనలకు గురి చేస్తాయి .ప్రతి కధ లో తనదైన విధానం ,శైలీ  ,నిర్మాణం ,భావుకత ముద్ర వేసి నట్లు కని పిస్తాయి .
” కొడవటి కుటుంబ రావు సాహిత్యం  ”సంపాదకునిగా ,విశ్వ నాద రెడ్డి పని చేసి ,సృజనాత్మక రచనల సంపాదకత్వానికి ఒరవడి  దిద్దారు .ఆంద్ర దేశం లో గ్రామ నామాల పరిశోధన లో పని చేసి ,ఆ మార్గానికి మార్గ దర్శి అయారు .దూర విద్యా విధానం లో తన దైన ముద్ర వేశారు .అందులో తెలుగు భాషకు ,సాహిత్యాలకు ,సమకాలీన సామాజిక అవసరాలకు అనుగుణం గా ఆధునికం చేశారు .ఆయన గొప్ప రచయిత మాత్రమే కాదు విశిష్ట విమర్శకుడు కూడా .వీటికి మించి మంచి పరిశోధకుడు .ఒక రకం గా” విద్యైక జీవి” .ఈ కధా సంపుటి లో 30 కధలున్నాయి .వైవిధ్యం తో పాటు ,మనో వేదన వుంది .ఈ కధలు కన్నడ ,హిందీ ,బెంగాలీ ,మరాఠీ ,ఇంగ్లీష్ ,రష్యన్ భాషల్లో కి అనువదింపబడి మంచి కీర్తి ని పొందాయి .తెలుగు కధకు ఇతర భాషల్లో గొప్ప గౌరవం ఏర్పడింది . .మచ్చుకు ఒక కధ ”మార్పు ”ను పరిచయం చేస్తాను .
ఉత్తమ పురుషలో కధ సాగుతుంది .తన చిన్న తనం లో దెయ్యాల కధలంటే ఇష్టం .తన తాత అంటే అబ్బ గ్రామ మునసబు .దెయ్యాలతో ఆయన 50 ఎకరాల జొన్న కోత కోయిన్చాడని ;”జేజి ”కధలు చెప్పేది .ఆ సత్య కాలమ్ తన రోజుల్లో లేక పోయినందుకు బాధ పడే వాడు కధకుని చిన్నతనం లో .రచయిత పెద్ద వాడయ్యాడు .ఏం .ఏ.చేశాడు .ఉద్యోగం లేదు .ఈ లోగా తాత హరీ మన్నాడు .తండ్రి చేసిన అప్పులకు ఆస్తి హరించింది .తాను ,ఇద్దరు తమ్ముళ్ళు ,ఇద్దరు చెల్లెళ్ళు తల్లీ పోషణ మీద పడింది .తాను చదివిన జాన పద కధల్లో లాగా జీవితం వడ్డించిన విస్తరి కాలేక పోయినందుకు ఏదో తెలీని ఎవరి మీదో తెలీని అసహనం ఏర్పడింది .ఆ తర్వాత ”హత్య”అనే కధ చదివాడు .అదొక నిరుద్యోగి ఆత్మ ఆత్మ హత్య .దానికి దారి తెసిన పరిస్తితులు తనూ అనుభవిస్తున్నట్లు భావించాడు .చిన్న ఉద్యోగం దొరికింది .”అభాగిని ”అనే కధ చదివాడు .తింది లేని తల్లి తన బిడ్డను కాపాడు కోలేక పోగొట్టు కొంది .ఆ కధ కలచి వేసింది .పై రెండు కధలు రాసిన ”జయ చంద్ర ”తో పరిచయం అయింది .అతని పరిచయం తో కొత్త కధా లోకం కళ్ళ ముందు కన్పించింది .
ఒక రోజూ వాళ్ల ఊళ్ళో మాదిగ ఇళ్ళు తగలడ్డాయి . రైతులంతా పరారీ .తాను తన ఊరు చేరాడు .తనకుతుమ్బానికి ఈ పాపం చుట్టూ కొంటుం దనే నే భయం తో .వళ్ళ కాడు గా మారిన గూడెం చూశాడు .దానిని  వర్ణించాలంటే ”కాటి కాపరులు ”మాత్రమే చేయ గలరు” అంటాడు .జయ చంద్ర ను కలిశాడు .గొడవకు అతను కారణం చెప్పాడు .కూలీలు రెట్లు పెంచామన్నారు .రైతులు వీల్లేదు అన్నారు .రైతులు చెప్పిన కారణం ”వ్యవసాయ ఖర్చులు పెరిగాయి .బ్లాక్ లోను యూరియా దొరకటం లేదు .సారాయి తాగే నాకోడుకులకు ఎంతిచ్చినా ఒకటే .ఒళ్ళు పొగరెక్కి కాని ”ఇది నిజమే నంటాడు జయ చంద్ర .”ముప్పొద్దులా చాకిరీ చేస్తే వీళ్లిచ్చేది రోజుకు రూపాఎగా ”అన్నాడు రచయిత .”భోజనం మూడు పూటలా పెట్టి కూలీ కూడా ఇస్తునారు కదా ”అన్నాడు జయ చంద్ర .”మాదిగ వాళ్ల కు పెట్టె తిండీ అల్లుళ్ళకు పెట్టినట్టు ఉండదండీ”మన రచయిత . అన్నాడు .కూలి అడగటం న్యాయమే కాని ,రైతులు ఊరి నుంచి పారి పొతే ఇళ్ళ మీద పడి ఆడవాళ్ళను బూతులు తిట్టటం ,కమ్యూనిస్టులు చేయి కలపటం తనకు నచ్చ లేదంటాడు జయ చంద్ర .
అప్పుడు జయ చంద్ర  తో రచయిత ”ఈ విషయం మీద కధ రాయండి న్యాయం హరి జనులది .నిప్పు పెట్టింది ఎవరైనా కావచ్చు .పెట్టించింది పెద్ద రెడ్లు .నోట్లో మట్టి కొట్టేది వాళ్ళే .ఈ అన్యాయం కధలో రావాలి ” దీన్ని జయచంద్ర చాలా తేలిగ్గా తీసు కొన్నాడు .”యెంత కోపాలోచ్చినా రైతులకు వాళ్ల అవసరం వుంది హరిజనుల ఇళ్ళకు వాళ్ళే నిప్పు పెట్టు కొన్నారని ,ప్రచారం వుంది ”అంటాడు జయ చంద్ర .రచయిత కు ఓర్పు నశించింది .అణచు కోలేక నిజం చెప్పాడు .”ఇదంతా రైతుల ప్రచారం .వాళ్ళంతా పెద్ద రెడ్లు .మీరు కూడా ఆ కోవ లోని వాళ్ళే .ఆ రక్తమే మీలోను వుంది .ఆ ఇళ్ళకు నిప్పు పెటింది మా  తమ్ముడే.రైతు పెద్దలు మా దరిద్రాన్ని అలా వాడుకొన్నారు .డబ్బిచ్చీ ,ఎప్పట్నుంచో హరిజనులు వాడు కుంటున్న బంజర్లన్నీ లాక్కొని ఇస్తామని ఆశ పెట్టి ”జయ చంద్ర మాట్లాడ లేక పోయాడు .నిజం విని సమర్ధించ లేక అక్కడినుంచి జారు కున్నాడు .
ఇందులో రచయిత నిజాయితీ కని పిస్తుంది .నిజా నిజాలను స్వయం చ్చూసి స్పందించటం కన్పిస్తుంది .తనలో ”మార్పు”” కల్గించిన జయ చంద్ర రచనలు ఎంత అనుభవ రాహిత్యమో అర్ధ మైంది .దీన్నీ చూడ కుండా ,ఏదో రాసి పారేసి సాను భూతి సంపాదించే జయ చంద్ర లాంటి కుహనా ప్రగతి షీలా రచయితల నీచ బుద్ధి కని పిస్తుంది .నిజ మన సామాజిక బాధ్యత గల ”మార్పు ”తనలో వచ్చినందుకు ”రచయిత ”మనకు ఎంతో ఎత్తుకు ఎదిగి నట్లు కన్పిస్తాడు .అదీ నిజాయితీ ..ఆ నిజాయితీ రచయితల సొత్తు కావాలనే సత్యం చెప్పించాడు కధా రచయిత విశ్వ నాద రెడ్డి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —29 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.