అమ్మో పూలు (కవిత )
పూలు భగవంతుని ఆరాధనకే ననీ
పూలు ప్రేయసీ ప్రియుల అణు రాగ బందాలకనీ
పూలు భార్యా భర్తల మమతాను రాగ స్ఫూర్తి దాతలనీ
పూలు పసి పిల్లల బోస్ది నవ్వులనీ -అనుకొన్నాకానీ
పూలు హత్యా ప్రసూనాలనీ ,మంగళ వారం రాత్రే తెలిసింది
పూలు ఒక భారతీయ యువ రాజీవాన్ని బలి గొంటాయనీ
ఆనాడే తెలిసింది -పూలు తామే” ఫూల్ ”అవుతాయనీ
సుగంధాన్ని నలు దిశలా వ్యాపింప జేస్తాయనీ
పూలు స్వచ్చతకు మారు పేరని ఇప్పటి దాకా అనుకొంటే –
పూలు మృత్యు గహ్వ రాలనీ ,విష వాయు భరితాలనీ
మే ఇరవై ఒకటి రాత్రే తెలిసింది
నలభై ఏడేళ్ళ యవ్వనానికి
పూలు మంగళం పాడుతాయనిఊహించ లేదు
అమ్మో పూల పేరు చెబితే భయమేస్తోంది
అమ్మోపూలంటే వెగటు పుడ్తోంది
అయ్యో పూలు ”కాలుని ‘పలుపు తాళ్ళు అని భయం గా వుంది .
రచన –గబ్బిట దుర్గా ప్రసాద్
రచనా కాలమ్ –21 -05 -1991 —భారత ప్రధాని రాజీవ్ గాంధి హత్య కు స్పందించి రాసిన కవిత .

