కేతు విశ్వ నాద రెడ్డి -గడ్డి కధ

కేతు విశ్వ నాద రెడ్డి -గడ్డి కధ

             రాయల సీమ కరువును కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు విశ్వ నాద రెడ్డి .”ఆకాశం లో ఒక్క మబ్బు తునక లేదు .పెద్దోల్ల వాగ్దానం లా వుంది .వాన కోసం ఎదురు చూసే రైతు లా వుంది వంక .మొండి జాతి కలుపు మొక్కలు పేరిగినా గట్లతో బీడైన రేగటి చాలు .ఎవరో గుండెను ముక్కలు చేసి ,కడ్డీలకు చెక్కి ,మంటల్లో మాడ్చి మసి బొగ్గులు చేసి నట్లుండె రేగటి చాళ్ళు కల్లా లన్నీ   మొండి గోడల కళ్లాలే -మొండి బతుకుల్లా .
ఒక రైతు ఆవేదనను ఆవిష్కరించే విధానం చూడండి ”ఈ పాడు కరువు అందర్నీ మాడ్చి మసి చేస్తోంది .రైతుకు ఇంట్లో గిన్జల్లేవు .వీధుల్లో పరపతుల్లేవు .పశువులకు మేత లేదు ”  ‘ఇంతలో చీకి ముళ్ళు కన్పించాయి .తన అక్కస్సు అంతా యెట్లా వెళ్ళ గాక్కాడో వినండి ”వెతికి కరువోచ్చినా ,వీటికి మాత్రం కరువు లేదు .బావుల్లో నీళ్ళు లేకున్నా ,పచ్చ గడ్డి కరువైనా ఈ చీకి చెట్లు మాత్రం ఏ పాతాళం నుంచి నీళ్ళు తాగుతాయో పచ్చగా వుంటాయి .చీకి ముళ్ళతో గూని శెట్టి తిన్నా ,కరణం తిన్నా ,వూళ్ళో పోలీసోల్లు తిన్నా సీమ పంది పసుల డాటరు తిన్నా –దీంట్ల తోనే కరువు లంతా ”.దూ.నీ యమ్మ”
అని ఆక్రోశాన్ని ఆక్రన్దనను ,అసహాయతను నిస్సహాయత్వాన్ని ప్రదర్శిస్తాడు .చీకి ముళ్ళు విస్తారం గా వుంటే పంటలు హుళక్కి అన్న మాట .
ఇంకో దృశ్యం చూపిస్తాడు ఇంకో చోట ”చుట్టూ చేలు నూర్ల ఎకరాల చేలు .ఎవరి చేతుల్లోనో మారుతూ వస్తున్న ”పుడమి తల్లి ”అమ్మకాల్లో .కుటుంబ పంపకాల్లో ,చీలికలు ,ముక్కలు అవుతూ ,నేల తల్లి గట్ల మధ్య ”భూదేవత ”.పొలం లో జొన్న గిలి లేదు .కొర్రే గిలి లేదు .కుసుమ గిలి లేదు .సేనక్కాయే గిలి లేదు .ఏయే గిలీ ఏం లాభం ?అక్కడో ఇక్కడో బెత్తెడు ఎత్తు కూడా  ,పెరక్కుండానే పసి వాళ్ల చావు లాగా ,మాడి బుగ్గి అయిన సేనక్కాయ .గట్లు మాత్రం కని పిస్తున్నాయి .మళ్ళీ బతుకుల్లోని భవిష్యత్తు లా.
ధాత కరువు ను మించిన కరువు .కరువులు బతుకు లో భాగ మైన కరువు .కాళ్ళ కింది కొంపా గోడు ,,కాలిన ఒక వీధి లాభూమి   .పైన ఆకాశం ఒక బూడిద కుప్ప లాగా .ఆకాశం లో ఒకటీ ,అరా మబ్బు లేవో కన పడ్తున్నాయ్.తగిన వానల్లేక గాలికీ ఎండ కీ పగిలిన పత్తి కాయల్లో కనబడే గొగ్గి పత్తి లాగా ఆ మబ్బులు .ఆ కాశం లో ఒక్క కాకి లేదు .కాలి దారిలో ఒక్క మనిషీ ఎదురు పడ లేదు .పైర గాలి రావలసిన కాలమ్ లో ,గాలి కాలమ్ లో లాగా గాలి ,గాలి గాలి ”’
ఇదీ రాయలేలిన రాయల సీమ ,రత్నాలు పండిన రాయల సీమ ఆ నాదే కాదు ఈ నాడు ఇంతే .హృదయం ద్రవిన్చేట్లు చెప్పిన మాటలవి .కళ్ళు చేమర్చాల్సిందే  .రెడ్డి గారి ఆవేదనకు ఇది గొప్ప సాక్షాత్కారం .కధకుడంటే అలా రాయాలి గుండెను తాకాలి ప్రతిమాట .ప్రతిస్పందన మన లో కలగాలి అట్లా రాసాడు విశ్వ నాద రెడ్డి .ఎంత గొప్ప అనుభవమో ?ఎంతటి నిశిత పరిశీలనమో ?ఆ నేల బిడ్డ అనుభవించిన కష్టాల దొంతరలు అవి .అందుకే అంత బాగా వుంటాయి .ఎక్కడా అత్యుక్తి లేదు .అంతా రైతు భాషే .ఆ పలుకు బడులే .ఆ భావ దారే .అందుకే రెడ్డి గారి కధలకు అంత వ్యామోహం .నేల విడిచి సాము చేయడు .ప్రత్యక్ష సాక్షి గా చేబుతాడేది చెప్పినా .అనుభవ రాహిత్యం తోచెప్పేది  ఏదీ నిలువదని ఆయనే అంటాడు .అందుకే అంత జాగ్రత్త గా చెబుతాడు కధ .రాయల సీమ  కధాకదక రత్నం అని పించు కొంటాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.