రస గంగాధరుడు జగన్నాధ పండితుడు
జగన్నాధ పండితుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర కొత్త పేట తాలుకా” ముంగండ” గ్రామం లో
జన్మించాడు .ఇంటి పేరు ఉపద్రష్ట .చిన్న తనం లో విద్యా భ్యాసం ముంగండ లోనే పండితుల వద్ద నేర్చాడు .అంతటి విద్వాంసులను తయారు చేసిన సామర్ధ్యం వున్న పండితులు ఆనాడు అక్కడ వున్నారు .ఉన్చ వ్రుత్తి చేసి జీవించే వాడట .మర్రి చెట్టు కింద జీవించే వాడట .ఆకులు కోసి విస్తళ్ళు కుట్టు కొనే వాడట .ఒక సారి కాపలా దారు అక్కడ కూర్చోరాదనీ,ఆకులు కోయ రాదనీ ,ఆ స్థలం అంతా ఒక జాగీర్దారుడి దనీ ,దాన్ని ఆయనకు ధిల్లీ చక్ర వర్తి ఇచ్చాడనీ చెప్పాడు.కరణం దగ్గరికి వెళ్లి అడిగాడు జగన్నాధుడు ”.కావాలంటే ధిల్లీ వీళ్ళు చక్ర వర్తి తో చెప్పుకో” అని పరిహాసం గా మాట్లాడాడట .అంతే యవ్వనం లో నే ధిల్లీ చేరాడు .
ధిల్లీ లో ఒకరింట ఆశ్రయం దొరికింది .అక్కడ ఇద్దరు పర్షియన్ సైనికులు పోట్లాడు కొంటున్నారు .అది చూసి భరించలేక గ్రామస్తులు చక్రవర్తి కి విన్న వించారు .వారిద్దరూ ఎవరేమి మాట్లాడారో ఎవరూ జ్ఞాపకం ఉంచు కొని చెప్ప లేక పోయారట .ఇదంతా ప్రత్యక్షం గా విన్న జగన్నాధుడు సాక్షి గా ఆస్థానానికి వెళ్లి ‘తాను ఎకసంతా గ్రాహి ”కనుక జరిగిన దంతా అక్షరం పొల్లు పోకుండా చేపాడట .చక్రం వర్తి మెచ్చి ,ఆస్థాన కవి గా చేశాడట .చక్ర వర్తి కి చదరంగం బాగా వచ్చు .మన పండితుడు కూడా అందులో మహా పండితుడే ,చక్రవర్తి తో రోజూ జోడీ గా చదరంగం ఆడే వాడు .దానితో అంతః పురం వారితో పరిచయాలు బాగా కలిగాయి .చక్ర వర్తి ఆయనకు అంతపుర స్త్రీలలో ఒకరినిచ్చి వివాహం చేశాడట .ఆమె మొదటి భార్య కామేశ్వరి .అయితే ఈయన మనసు గెలిచిన ఒక ముస్లిం అమ్మాయి ”లవంగి ‘ని ‘కూడా పెళ్లి చేసు కొన్నాడు ఈమె మీద కవిత్వం రాశాడు .మొదటి బార్య కామేశ్వరి మీద కూడా స్మృతి కావ్యం రాశాడంటారు …
ధిల్లీ పాదుష భార్య నూర్జహాన్ రాణి సోదరుడు ఆసిఫ్ ఖాన్ ద్వారా మొఘల్ రాజా కుటుంబం తో ఇతనికి పరిచయం కలిగింది .అందుకే అతని పేర ”ఆసిఫ్ విలాసం ”రాశాడు .ఇది స్మృతి కావ్యం .జహంగీర్ చక్రవర్తి పండిత రాయల కవిత్వం కంటే సంగీతా ప్రావీణ్యానికి మెచ్చి ”పండిత రాయలు ”అని బిరుదును ఇచ్చాడు .వెండి తో తులాభారం తూయించి వచ్చిన 4500 రూపాయలను పండితునికి కానుక గా ఇచ్చాడు .
జగన్నాధుడు మేవార్ మహా రాణా జగత్ సింగ్ ఆస్థానం లో కూడా కొంత కాలమ్ ఆస్థాన విద్వాంసుడు గా .వున్నాడు .ఒక సారి మొఘల్ ఆస్థానం– రాజపుత్రులు నిజ మైన క్షత్రియులు కారనీ ,సంస్కృత భాష ఆరబిక్ భాష కంటే తర్వాతి దని ,నిర్ణయిస్తే ,మేవాడు రాజా ప్రతినిధి గా జగన్నాధుని రాజు ధిల్లీ పంపాడట .అక్కడ తన అసమాన ప్రజ్ఞా విశేషాలతో రాజపుత్రులు సుక్షత్రియులేననీ ,సంస్కృత భాషే ఆరబిక్ కంటే ప్రాచీన మైన దని సోపత్తి కం గా వాదించి గెలిచాడట .అందరు మెచ్చారు .చక్ర వర్తి పండితుడిని మళ్ళీ తన ఆస్థాన పండితుని గా ఉండమని కోరాడట .సరే నని ఉన్నాడట .జ్కగన్నాధుదు కామార్పుర రాజు ప్రాణ నారాయణ ఆస్థానం లో కూడా కొంత కాలమ్ ఉన్నాడట .ఆయనపై ”ప్రాణ నారాయణం ”అనే కావ్యాన్ని స్మ్రుతి కావ్యం గా చెప్పాడు .
జగన్నాధ పండిత రాయలకు అద్వైత సిద్ధాంతి అప్పయ్య దీక్షితులకు వైరం ఉండేదని ఒక ప్రచారం వుంది .అయితె అప్పయ్య దీక్షితులు 1650 కాలమ్ వాడనీ ,జగన్నాధుడు 17 -18 శతాబ్దం వాడని అందుకే వైరం ఉండ టానికి అవకాశాలు లేవని విమర్శకులు ,చారిత్రిక పరిశోధకులు తేల్చారు .అలాగే ”చిత్ర మీమాంస ఖండనం ”అనే గ్రంధం అప్పయ్య దీక్షితులదా ,పండితునిదా అనే మీమాంస వచ్చినపుడు అది జగన్నాధ కృతమే నని నిశ్చ యించారు .
అసలు జగన్నాధ పండిత రాయలకు పేరు ప్రఖాతులు తెచ్చినది అలంకార శాస్త్రమైన ”రస గంగాధరం ”.ఆనంద వర్ధనుని ”ధ్వన్యా లోకం ”కు సరైన రచన ఇది .రస గంగాధరం చాలా ప్రామాణిక గ్రంధం .”రమ నీయార్ధక ప్రతి పాదకం కావ్యం” అని పండిత రాయలు కావ్య లక్షణాన్ని తెలియ జేశాడు .ఇదే అందరికీ శిరో భూషణం అయింది .షాజహాన్ ఆస్థానం లోను వున్నాడు .సంప్రదాయ సంస్కృత కవుల్లో చివరి తరం వాడు పండిత రాయలు .దక్షిణ దేశం కంటే ఉత్తరాదిన బాగా ప్రాముఖ్యం పొందిన మహా పండితుడు ,కవి మన జగనాధుడు .అక్కడి వారు ఆయన శిష్యులై తమ కావ్యాలలో ఆయనకు పెద్ద పీట వేశారు .చాలా మంది ఉత్త రాది శిష్య ప్రశిష్యులను సంపాదించుకొన్న వాడు మన రాయ కవి .
షాజ హాన కుమారుడు ”దారా” కూడా జగన్నాధుని శిష్యుడై ,విద్య నేర్చి ,పండితుడై ,ఉపనిషత్తులను ,దర్శనాలను వారి భాష లోకి అనువదించి ,గురువుకు తగ్గ శిష్యుడని పించుకొన్నాడు .”అష్ట భాషా కవిత్వ క్షముడు ”అనీ ”,పద వాక్య ప్రమాణ ”అనీ,”కళా వంత్”అనీ బహు బిరుదులూ పొందిన సంగీత,సాహిత్య, శాస్త్ర, కవిత్వ , మీమాంస ,అలంకారాడుల్లో శిరోమణి .రాజస్థాన్ లోని జయ పుర ఆస్థానం లో కూడా ”విద్యాది కారి ”గా ప్రతిభకు తగిన పదివిని అలంకరించాడు .వ్యాకరణానికి పతంజలి భాష్యం ,వేదాంతానికి శంకర భాష్యం ఎలాగో సాహిత్యం లో రసగంగాధారం పండిత రాజ్య భాష్యం అంటారు విజ్ఞులు .
పండిత రాయల ఇతర రచనల గురించి చెప్పా లంటే చాలానే వున్నాయి .అందులో ముఖ్య మైనది ”గంగా లహరి ”.దీనికి ఒక కధ వుంది .మన పండితుడు సంప్రదాయ విచ్చిన్నుడు .ముస్లిం స్త్రీ లవంగిని వివాహ మాడి ,చివరి రోజులో కాశీ చేరాడు .అక్కడ గంగా స్నానాన్ని చేయాలని ఘాట్ లోకి వెళ్తే సంప్రదాయ బ్రాహ్మలు కుల ద్రోహం చేశాడని స్నానం చేయ టానికి అడ్డు చెప్పారు .అప్పుడు జగన్నాధ పండితుడు ఘాటు , పై మెట్టు మీద దీక్ష గా కూర్చుని గంగా నది మీద అద్భుత శైలిలో నభూతో గా శతకం ఏక దీక్ష గా చెప్పాడట .అంతే గంగమ్మ పొంగి పోయి ఆ కవిత్వానికి ఉబ్బు కుంటు ఆయన కూర్చున్న మెట్టు దాకా వచ్చిందట .అక్కడ వున్న పండాలు ,సంప్రదాయజ్నులు చెంపలేసు కోని కాళ్ళ మీద పడ్డారట .అంతటి శక్తి సంపన్నుడు .ఆయన మనసు స్వచ్చం అని గంగమ్మకు తెలిసిందే ./ఇక్కడ చెప్పిన కావ్యమే ”గంగా లహరి ”
యమునా నది మీద ”అమృత లహరి ”రాశాడు పండితుడు .కారుణ్య లహరి ,ని విష్ణు మూర్తి పరం గాను ,లక్ష్మీ లహరి ని మహా లక్ష్మీదేవి పరం గాను చెప్పాడు .జగదాభారణ .ప్రానాభరణ ఆయన ఉన్న ఆస్థాన రాజుల పేర రాశాడు .ఇవి కాక అనేక వేల ముక్తకాలు రాశాడు .ఇవన్నీ కలిసి ”భామినీ విలాసం ”పేరు తో వున్నాయి .వీటిలో రాజాస్థానాల్లో వున్న ఆశ్రిత పక్ష పాతాన్ని ,అవినీతినీ చీద రించుకొన్నాడు .అంటే అవన్నీ చాటువులు గా చలా మణీ అయాయి .జగన్నాధుని శైలి అననుకరణీయం .ఆయన ప్రతిభా శేముషీ నిక్షిప్తం ఆయన రచనలు .
పండిత రాయల చివరి రోజులు కష్టాల లహరి గా సాగాయి .జహంగీర్ ఆస్థానాన్ని వదిలి పెట్టేశాడు .రాణా జగత్ సింగ్ దగ్గరా ,కామార్ప రాజు దగ్గరా కొంత కాలమ్ వున్నాడు .ఇంత మందికి ప్రేరణ కల్గించిన మహా పండితుడు ,కవీ ఆలన్కారికుడు ,తర్క వ్యాకరణ పారీణుడు,రాజాస్థాన కవి ,విద్యా పరీక్షకుడు మన జగన్నాధ పండిత రాయలు .మన తెలుగు వాడు అవటం మనకు గర్వ కారణం .అయితే ఆంద్ర దేశం ఆయన్ను మర్చి పోయింది .ఒక సారి మళ్ళీ ఈ తరం వారికి గుర్తు చేయ టానికి చేసిన ప్రయత్నమే ఇది .జగన్నాధ పండితునిపై మహీధర నళినీ మోహన్ ”భారతి ”మాస పత్రికలో అనేక వ్యాసాలు రాసి ,పండితుని యశో వైభవాన్ని అన్ని కోణాల్లో ను ఆవిష్కరించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31 -12 -11 .
అందరికి నూతన సంవత్సర శుభా కాంక్షలు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


దుర్గా ప్రసాద్ గారూ! జగన్నాథ పండిత రాయలు గురించి అడిగిన వెంటనే టపా రాసినందుకు కృతజ్ఞతలు. ఆయన చరమదశ గురించి ఇంకా వివరాలేమైనా తెలుసా? ఆయనది సహజ మరణం కాదనే వాదన ఒకటుంది. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనే భావనను మించి, మరింత నిర్దిష్టంగా ‘ రసాత్మకమైన వాక్యమే కాదు, శబ్దమూ కావ్యమే’ అంటూ ‘రమణీయార్ధక ప్రతి పాదక శబ్ద: కావ్యం’ అని చాటిన ఘనత పండితరాయలిది!
LikeLike
గురువు గారూ జగన్నాథ పండిత రాయల వారి గురించి చక్కని సమాచారం అందించారు. ధన్యవాదాలు.
LikeLike