పోతన లో తాను –2

పోతన లో తాను –2

          నా ,హరి ,హర అభేద భావాన్ని  ఇప్పటి దాకా మీకు తెలియ జేశాను .నాది సహజ పాండిత్యం అని విన్న విన్చుకొంటున్నాను .”అనగా ,చదువు ,సాధనా లేక గాలి మూట గట్టిన  , శ్రుత వాచాటనము ”అని కొందరు భావించారు .కర్ణునికి కవచ కుండలాలు ,కుశ లవులకు ,జ్రుమ్భాకాస్త్ర్రాదులు ,జన్మ తో ,సంసిద్ధ మైనవి కావా ?అట్లనే నాకు కూడా నా పురాకృత సుకృతం వల్ల సిద్ధిన్చిది  ఈ  పాండిత్యం .పూర్వ జన్మ సువాసన ,జన్మాంతర బహుళ అధ్యయనం వల్ల లభించిన ఫలితం ఇది .పుట్టుక తో నా పుణ్యం వల్ల లభించిన పాండిత్యం ,తపస్సాధనతో సాధించిన కవితా కౌశలం ,కలిసి ,ఆత్మ మంత్ర పుష్ప సమర్పణ చేశాను .పరమేశ్వర ప్రీతితో ,ప్రేరణతో ,పరమేశ్వరాన్కితం గాచేసిన పని ఇది .ఈ విషయం లో ఇంత కంటే ఎక్కువ చెప్ప్పలేను .
ఇక అనువాద విషయం లో నేను చెప్పేదేమీ లేదు .భగవానుడైన వ్యాస మహర్షి వ్రాసిన సంస్కృత మహా భాగవతాన్ని అనువదించటం కొండను నెత్తి కెత్తు కోవటమే .భగవానుడు ”రాముడు ”ఈ అనువాదాన్ని చేయించాడు .ఆ పలుకుల పులకలన్నీ ఆ భగ వానుడివే  .నేను నిమిత్త మాత్రుణ్ణి .గంటం నాది -కదలిక ”వారిది ”..తులనాత్మకం గా సంస్కృత ,తెలుగు ,భాగవతాలను పరిశీలించిన మహాత్ములు కొందరు నా అనువాదం ”హ్రుదయాను వాదం ”అన్నారు .”అంతర్లీన పారవశ్యమే ధ్యేయం గా ,పాండిత్యం కంటే పరమార్దానికి ,మూర్తి సందర్శనం కంటే ,స్ఫూర్తి సందర్శనానికి ,మేధా విలసనం కంటే ,హృదయ వికాసానికి ,ఆశ్చర్య కార మైన ప్రజ్ఞా ప్రకటన కంటే ,పారవశ్యం తో కూడిన రసోదయానికి ప్రాధాన్యం ఇచ్చానని ,రస నిష్యంద మాన మైన ఆనంద బ్రహ్మ స్వరూప సాక్షాత్కారానికే ప్రాముఖ్యం ఇచ్చానని ,నా అనువాద వైఖరి ”హ్రుదయాను వాద వైఖరి ”అని తమ సహ్రుదయాన్ని ప్రకటించారు .నా అనువాద పధ్ధతి లోని విశేషాలన్నీ మీకు తెలిసినవే .అవి శ్రీహరికి అర్పిత నైవేద్యములే .సహ్రుదైక వేద్యాలే .
”రసో వై సహా ”అని వేదం అంది .రస స్వరూపుడగు భగవంతుని దివ్య మంగళ విగ్రహం ,ఎప్పుడూ ,మన మనసు లో ఉండేటట్లు మాత్రం చేయగలిగాని ఆనందం గా వుంది .నా బాల కృష్ణున్ని చూసి వెండి గడ్డం వెలిగిస్తున్న ముఖ వర్చస్సు తో వ్యాస భగవానులు వెన్నెల బావుల్లాంటి కన్ను లతో నవ్వుతు ”నా బాల కృష్ణా !నువ్వు అచ్చం తెలుగు పిల్లాడివి అయి పోయావురా “”అని అన్నారని విని ,నా మనసు ఆనంద పులకిత మైంది .నా కళ్ళు సంతత బాష్ప ధారా పరివ్రుత మైనాయి .నేను ధన్యుణ్ణి అయానని పించింది .ఆంద్ర భాగవత పద్యాలు ,ఆంధ్రుల నోట అలవోకగా పలుకుతున్నాయి అట . .ఎంతటి అదృష్ట వంతుణ్ణి నేను ?ఇది నా పూర్వ జన్మ ఫలం .నా మాధవుని దయా వీక్షణ కటాక్షం .
తిక్క యజ్వ ను సూర్యునిగా ,నన్ను చంద్రునిగా కొందరు పోల్చారు .మేమిరువురము ఆంద్ర లోకానికి రెండు వెలుగులం అట .సోమ యాజీ పక్కన నాకు పీట వేసి అందలం ఎక్కించారు .తెలుగు జాతికి ,తెలుగు వేదాలు అన దగిన ,మహా గ్రంధాలను రచించిన రుషి పుంగవులం అట .ఆహా ఏమి నా భాగ్యం ?అంతర్ ద్రుష్టి తో మహా భారత ,తంత్రాన్ని ,మంత్రాన్ని ,యంత్రాన్ని తన మనస్సు లో నిల్పి, ఆయా పాత్రలను నాటకోచితం గా తీర్చి దిద్ది ,ఎవరూ తన దారికి వచ్చే సాహసం చేయకుండా చేసిన  తిక్కన కవీశ్వరు లెక్కడ ?నేనెక్కడ ?”ఛందో బంధమగు శబ్దం ,కళాధర్మాలైన  శ్రుతి లయలను నేను    , సాధించానని” కొందరి భావన . ”తగిన చోట్ల యమ ,ప్రాస అలంకారాలను భాగవత కవితా గానానికి మృదంగ వ్యాపారం నిర్వహించానాట ”.నాదము బ్రహ్మము .శబ్దమూ బ్రహ్మమే .నాద ,శబ్ద బ్రాహ్మల అను సందానమే నేను చేసిన పని .ధన్యోశ్మి .
ఆంద్ర భాగవత ప్రశస్తి మన తెలుగు దేశాన్నిదాటి మహారాష్ట్ర దేశం లోను మన్నన పొందింది .హిందూ ధర్మ రక్షకులు ,హిందూ సామ్రాజ్య స్థాపకులు అయిన శ్రీ శివాజీ మహారాజ్ కు గురు ప్రభులైన శ్రీ శ్రీ సమర్ధ రామ దాససద్గురువులు తమ ”దాస బోధ ”గ్రంధం లో నా భాగవత భక్తీ ,ప్రపత్తి నిప్రశంశించారట .  .ఆహా ! ఏమి నా అదృష్టం ?.ఒక జాతికి కీర్తిని ,స్పూర్తిని కలిగించిన ”రామ దాసు ”వరేన్యుల మనస్సెంత సు విశాలం ?ఎల్లలు లేని వారి భక్తికి ,వారికి నాపై వున్న వాత్సల్యానికి నేను ఎంత కృతజ్ఞుడిని ?
నాద బ్రహ్మ యై ,నారదుని అపర అవతార మైన త్యాగరాజు మహాను ను భావులు ఆంద్ర మహా భాగవతాన్ని ,అను నిత్యం పారాయణ చేసే వారట .తిరువయ్యారు లో త్యాగ రాజస్వామి గృహం లో  తెలుగు భాగవత ప్రతిఇప్పటికీ చెక్కు చెదర కుండాభద్ర   పరి చారట . ఇది తెలుగు భాగవత దివ్యత్వ తేజః పుంజం .దీని కాంతి దశ దిశలా వ్యాపించింది .
తమిళ దేశ నవయుగ ప్రవక్త శ్రీ సుబ్రహ్మణ్య భారతి ”సిలకవి యరశాల్  ”(కొందరు కవి రాజులు )అనే వ్యాసం లో నన్ను ప్రస్తు తించారట .హరికధా పితామహులు శ్రీ మదజ్జాడ ఆది భట్ల నారాయణ దాసు గారికి  వారి  అయిదవ ఏటనే ”తెలుగు భాగవతం ”తోనే అక్షరాభ్యాసం అయిందట .భాగవత భక్తి చేతన ఆయన రచనలు హరి కధా రూపం లో ఆంద్ర సాహిత్యాన్ని రంజింప జేసింది .అమ్మా వాణీ !ఇది నీవు ఇచ్చిన అక్షరాభ్యాసమే .నా కైమోడ్పు నీకే కదా !నేను ఎప్పుడూ నిమిత్త మాత్రుడినే .
”క్షోణి తలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు ,సైకత
శ్రోణికి  ,జన్చరీక చయ సుందర వేణికి ,రక్షితామర
శ్రేణికి ,దోయ జాతభవ చిత్త వశీకర నైక  వాణికిన్
వాణికి ,నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్”
మిగిలిన వివ రాలు తరువాత అందిస్తాను .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -01 -12 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.