గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
402-చింతగుంట సుబ్బారావు (1932)
శ్రీ చింత గుంత సుబ్బారావు శ్రీమతి తులసి బృంద శ్రీ చెన్నయ్య దంపతులకు గుంటూరులో 5-4-1932జన్మించారు .గుంటూరు ఇ.ఎల్ .సి.ఎం . హైస్కూల్, హిందూ కాలేజి హైస్కూల్ ల లో చదివి ,ఏ.సి కాలేజి లో డిగ్రీ1954లో పొందారు .విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో బి ఏ ఆనర్స్ 1958లో సాధించి ఏం ఏ అయ్యారు .
చీరాల వి ఆర్.ఎస్ .అండ్ వై. ఆర్ .యెన్. కాలేజి లో ఇంగ్లీష్ లెక్చరర్ గా 1957-1992వరకు ఉద్యోగించారు .సంస్కృతం హిందీలపై అభిమానం మెండు .స్వయం కృషితో వాటినీ సాధించారు .శ్రీమతి దుర్గా దేవి ని వివాహమాడి ఒక కుమారుడిని ,ముగ్గ్గురు కుమార్తెలను పొందారు .
సంస్కృతం లో ‘’అమృత వర్షిణి,శ్రీ పద చింతనం ,ఆదర్శ దర్శనం చంద్రికా ద్వీపే చండాతపః నిర్మాల్యం ‘’ సవ్య రచనలు .’’ ప్రజాకవిర్వేమః శతపత్రోత్తరీ ,కామకోటి సరస్వతి , ,మొదలైన అనువాద రచనలు చేశారు తెలుగులో వాల్మీకి రామాయణం లో గాయత్రి ,శ్రీ సదాశివ బ్రహ్మెంద్రుడు ,పలనాడు భారతం ,భారత రాజ్యాంగ రచన అనువాదంగా రాశారు .ఆంగ్లానువాదాలుగా ‘’devotional songs of Annamacharya ,The battle of Poland ,How sweet is thy name sriRama ,Venkatachala mahatmyam, The silent melody ‘’రచించారు .వీరి హిందీ అనువాదాలు ‘’అన్నమాచార్యకే ఆధ్యాత్మ సంకీర్తన్ ,విజ్ఞాన దీపికా ,గృహ్య సంగీతం .మొదలైనవి
శ్రీ సుబ్బారావు ‘’ఆలోచనామృతం ,శ్రీ స్తుతిః,శృంగార తిలకం ,విష్ణుమాయా విలాసం ,శ్రీరంగనాధ ప్రబోధం ,నారద భక్తీ సూత్రాలు ,బ్రహ్మ సూత్రాలు పాదం 1,కుమార సంభవ౦ ఒకటి నుంచి ఏడు సర్గలు అనే వ్యాఖ్యానాలు తెలుగులోనూ ,shree kantha shiva chaarya;s dasha shloki ఆంగ్ల వ్యాఖ్యానంగా రాశారు .వీరి అముద్రిత గ్రంధాలు రుద్రయామలం ఆరవ పటలం ,శివస్తోత్రావళీ,అరవింద కదా సరిత్సాగరం ,పతంజలి యోగ సూత్రాలు బ్రహ్మ సూత్రాలు రెండవ పాదం రఘువంశం మొదటి సర్గ మొదలైనవి వెలుగు చూడాలి .
శ్రీ చింత గుంట సుబ్బారావు గారి విద్వత్తు కు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘’లలిత సంగీత విశారద ‘’పురస్కారం2006లో పొందారు .అప్పా జోశ్యుల చారిటబుల్ ట్రస్ట్ వారి ‘’గురు పూజా పురస్కారం ‘’అందుకొన్నారు .డా.కోడూరు ప్రభాకర రెడ్డి ‘’ప్రజ్ఞా పురస్కారం ‘’’’సహజ సాహితి పద్య పురస్కారం ‘’,శ్రీ పోరూరి లక్ష్మీ నరసింహా రావు గారి 13వర్ధంతి పురస్కారంవీరిని వరించాయి .83ఏళ్ళ వయసులోనూ నిత్య గ్రంధ పఠనం,రచనా వ్యాసంగం ,సాహిత్య గోష్టి తో జీవితాన్ని ధన్యం చేసుకొంటున్న చతుర్భాషా కోవిదులు శ్రీ చింత గుంట సుబ్బారావు .
సశేషం
మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -6-9-15-ఉయ్యూరు
