నమ స్తే గోపాల కృష్ణ గారు -మొన్న గురువారం విశ్వనాధ వైభవం సదస్సులో మధ్యాహ్నం నేను పేపర్ ప్రెసెంట్ చేసిన సభకు కుప్పం ద్రవిడియన్ యూని వర్సిటి తెలుగు ప్రొఫెసర్ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించారు ..వారు ఏంతో గొప్ప పండితులు కవులు విమర్శకులు . సభను చాలా బాగా నడిపించి మార్గ దర్శనం చేశారు .వారి అడ్రస్ తీసుకొని మన సరసభారతి గ్రంధాలు వారికి శుక్రవారం రిజిస్టర్డ్ పోస్ట్ లోపంపాను .వారికి ఇవాళ సోమవారం వారికి అందగానే నాకు ఫోన్ చేసి చెప్పి ”చాలా శ్రమ పడి రాశారండీ ! చదివి మళ్ళీ చేస్తాను ”అన్న సంస్కారి .. అలాంటి వారి చేతిలో మన పుస్తకాలు ఉండటం మనకు, అదృష్టం గర్వకారణం .
రెండో విషయం -శ్రీ ఎస్ ఆర్ భల్లం గారి రెండు పుస్తకాలు ”జ్ఞాన దర్శిని ””వేకువ పిట్ట ”లపై నేను నిన్న అంతర్జాలం లో రాసిన సమీక్ష లను ఆయనకూ నెట్ లో పంపాను . అయన ఇవాళ ఉదయం ఫోన్ చేసి సమీక్షలు చాలా బాగా ఉన్నాయని ,తనకు నారాయణ రెడ్డి గారు అత్యంత ఆప్తులని తన సభలు 80 కి పైగా ఆయనే అధ్యక్షత వహించారని ,ఇవాళ ఉదయం నా సమీక్షను సి నా రే ;గారికి ఫోన్ చేసి చదివి వినిపించానని ,ఆయనా చాలా సంతృప్తి చెందారని ,తాను త్వరలోనే ”వేకువ పిట్ట ”పై స్పందనలనన్నిటి ని ఒక పుస్తకం గా తేవాలని అనుకొంటు న్నానని,అందుకోసం నేను రాసిన సమీక్షకు మరికొంత కలిపి సమగ్రంగా తనకు పంపించమని కోరారు .
మరో విషయ0 -మన ”కేమటా లజి పిత కోలాచల సీతారామయ్య గారి మనవరాలు అనస్తే షియా తాతగారి మూలాలను వెతుక్కొంటూ ఉయ్యూరు వచ్చిన విషయాన్ని నేను సమీక్షలో సమగ్రంగా రాయటం వలన తనకు ఆమె విషయం పూర్తిగా తెలిసిందన్నారు .తాను ఆమె రాకను పేపర్లో చదివి స్పందించి రాసిన ”పడమటి సంధ్యా రాగం ”కవిత ను ఆకాశ వాణి జాతీయ కవి సమ్మేళనం లో చదివానని తోటి కవులు ఏంతో అభినందించారని తెలియ జేశారు భల్లం గారికి మన పుస్తకాలు ఈ రోజే పోస్ట్ లో పంపాను ఇవి మీకూ సంతోషం కలిగిస్తాయని తెలియ జేశాను -దుర్గాప్రసాద్ –
శ్రీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్గారికి అనేకానేక వందనములతో: విషయాలు చదివి చాలా సంతోషించాను . బహు ముఖ ప్రజ్ఞాశీలి ప్రొఫెసర్ ఆచార్య బూదాటి వెంకటే శ్వర్లు గారి , శ్రీ ఎస్ . ర్ . భల్లం గారి స్పందనలు, మీ సాహిత్యరచన, విమర్శలలో అద్వితీయమైన ప్రతిభకు అద్దం పడుతోన్నై. మీలో నాకు తెలిసిన ఇతర పార్శ్వాలు ( సునిసిత హాస్యధొరణులతో మిళితమైన రాజకీయ ద్విప్లేట్స్ , సందర్భోజిత సంభాషణ , సమయ కాల నియమావళి, ధైర్యంతోకూడిన మనోభావ ప్రకటన, స్నేహ సౌభ్రాతుత్వం, సౌశీల్యం , అన్నిo టికీ మించిన ఆధ్యాత్మికత) ఇవన్నీ కలిసి రంగరించిన వెలకట్టలేని లక్షణాలకు దరి కావటం మా అదృష్టం . భాషలో తప్పులు మన్నించగలరు . –మీ గోపాలకృష్ణ
—

